
ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్‌దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.