కపిల్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం.. | IND Vs ENG 4th Test:Bumrah Surpasses Kapil Dev To Become Fastest Indian Pacer To Take 100 Test Wickets | Sakshi
Sakshi News home page

IND Vs ENG 4th Test: కపిల్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..

Sep 6 2021 7:54 PM | Updated on Sep 6 2021 7:54 PM

IND Vs ENG 4th Test:Bumrah Surpasses Kapil Dev To Become Fastest Indian Pacer To Take 100 Test Wickets - Sakshi

ఓవల్‌: ఇంగ్లండ్‌తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఓలీ పోప్‌ వికెట్‌ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్‌లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ పేరిట నమోదై ఉంది. కపిల్‌.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. 

ఈ జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌ కేవలం 18 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్‌ మార్క్‌ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్‌ లోమాన్‌(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్‌(17), ఇంగ్లండ్‌ సిడ్నీ బార్న్స్‌(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్‌(17), పాక్‌ యాసిర్‌ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్‌(18) మూడో స్థానంలో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్‌(1) ఇంగ్లండ్‌ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్‌లో రూట్‌(32), వోక్స్‌(12) ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
చదవండి: పాక్‌ క్రికెట్‌లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement