
"నేను జస్సీ భాయ్ (జస్ప్రీత్ బుమ్రా) మాత్రమే నమ్ముతాను. ఎందుంటే అతడొక గేమ్ ఛేంజర్". టీ20 ప్రపంచకప్-2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లడకపోవడంతో చాలా మంది ట్రోలు చేశారు.
కానీ ఇప్పుడు అవే మాటలు సిరాజ్‌కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగుపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాడు.
భారత పేస్ ధళ నాయకుడిగా నిప్పులు చెరిగాడు. ఓటమి కోరుల్లో చిక్కుకున్న తన జట్టును వారియర్‌లా విజయతీరాలకు చేర్చాడు. విశ్రాంతి, విరామం లేకుండా ఓ యోదుడులా పోరాడాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో సిరాజ్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఓవల్‌లో టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ద్‌ల పట్టుదల, దృఢ సంకల్పం వల్లే భారత్‌కు ఈ అద్బుతమైన విజయం దక్కింది. జట్టు కోసం ప్రతీసారి ముందుండి పోరాడే సిరాజ్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది " అని విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా కోహ్లి ట్విట్‌పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లే ఇచ్చాడు.
చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్