
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా అద్బుతమైన విజయంతో ముగించింది. ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను 2-2తో భారత్ సమం చేసింది.
374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ సైతం ఆఖరివరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్బుతం చేశారు. 339/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ నాలుగు వికెట్లు సాధించారు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి సిరాజ్ తొమ్మిది, ప్రసిద్ద్ 8 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్‌లో గెలిసి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని గిల్ అన్నాడు.
"ఈ సిరీస్ అసాంతం రెండు జట్లు(భారత్, ఇంగ్లండ్) అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదో రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఆఖరికి ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
అందుకే కొత్త బంతిని తీసుకోలేదు..
సిరాజ్, ప్రసిద్ద్ లాంటి బౌలర్లు ఇంత అద్బుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్యలేదన్పించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకులేదు.
అయితే ఆరంభంలో మాపై కొంత మాపై ఒత్తడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురిచేయాలనుకున్నాము. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తోంది. మా ప్రణాళికలకు తగ్గట్టే బౌలర్లు అద్బుతంగా రాణించారు.
ఒక్కడు చాలు..
సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తం అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు.
ఈ విజయానికి మేము అన్ని రకాల ఆర్హులం. ఇక ఈ సిరీస్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రత్మక విజయం
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।#INDvsENGTest #OvalTest pic.twitter.com/j7W0q1y2RY— Office of Shivraj (@OfficeofSSC) August 4, 2025