
నత్తా రామేశ్వరాలయం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం, నత్త రామేశ్వరంలో గ్రామంలో ఉంది.(Natta Rameswara Temple)

ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి వుండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా వుండడం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివ లింగానికి పూజలూ, అభిషేకాలు చేస్తారు.

ఈనెలలో మాత్రమే శివ దర్శనం వుంటుంది.

ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం.

అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.

నత్తా రామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రం 14 కి.మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ, అత్తిలి నుండి. 6 కి.మీ, మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రముంది.


















