అతడొక లెజెండ్‌.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్‌ బౌలర్‌ | Prasidh Krishna reveals why he sledged Joe Root at The Oval | Sakshi
Sakshi News home page

అతడొక లెజెండ్‌.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్‌ బౌలర్‌

Aug 2 2025 11:04 AM | Updated on Aug 2 2025 1:25 PM

Prasidh Krishna reveals why he sledged Joe Root at The Oval

ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య ఐదో టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. బౌల‌ర్లు స‌త్తా చాటుతున్న మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు స‌మంగా ముందుకు వెళ్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(51), ఆకాష్ దీప్‌(4) ఉన్నారు.

ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఆటలో టీమిండియా పేస‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ , ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూట్‌ను ప్రసిద్ద్ స్లెడ్జింగ్ చేయగా.. అందుకు అతడు సీరియస్‌గా స్పందించాడు.

ప్రసిద్ద్‌కు భారత ఆటగాళ్లు మద్దతుగా నిలవడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. అంపైర్‌ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదంపై ప్రసిద్ద్ కృష్ణ స్పందించాడు. తను చేసిన స్లెడ్జింగ్ పై జో రూట్ స్పందన ఆశ్చర్యపరిచిందని కర్ణాటక స్పీడ్ స్టార్ వెల్లడించాడు.

"జో రూట్‌ను స్లెడ్జ్ చేయడం​ మా ప్రణాళికలలో భాగమే. కానీ ఆ చిన్న మాటలకు రూట్ అంత కోపంగా స్పందిస్తాడని నేను ఊహించలేదు. నేను మంచి రిథమ్‌లో ఉండి బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇలానే జరుగుతోంది. అం‍టే బ్యాటర్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు అలా చేస్తాను. 

నా మాట‌ల‌కు రియాక్ట్ అయ్యి బ్యాట‌ర్  ఏదైనా త‌ప్పు చేస్తే మాకు వికెట్ వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఇదంతా గేమ్‌లో భాగ‌మే. కానీ జోరూట్ అంటే నాకు చాలా ఇష్టం. మైదానం వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అతొడ‌క లెజెండ‌రీ క్రికెట‌ర్‌. ఇదొక చిన్న విష‌యం. ఈ విష‌యం ఇక్క‌డతో వదిలేయండి" అంటూ రెండో రోజు ఆట అనంత‌రం కృష్ణ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement