
నటి నిహారిక రెండో పెళ్లి చేసుకోనుందని కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా నిహారిక సడెన్‌గా పెళ్లి కూతురిలా ముస్తాబై ఫోటోలు పంచుకుంది

పట్టుచీర, అందుకు మ్యాచింగ్ నగలు ధరించి బుట్టబొమ్మలా మెరిసిపోతుంది.

పెళ్లి కూతురిలా రెడీ అయిన నిహారిక ఇదంతా ఫొటోషూట్ కోసం మాత్రమేనని చెప్పింది.

'నిశ్శబ్దంగా ఉండడంలో కూడా బలం ఉంది' అనే కొటేషన్‌తో ఆమె పోస్ట్ చేసింది.

మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత సినిమాలపైనే ఆమె దృష్టి పెట్టింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై సినిమాలు నిర్మిస్తూ విజయం సాధిస్తుంది

నిహారిక రెండో పెళ్లి గురించి గతంలో ఆమె తండ్రి నాగబాబు ఒకసారి రియాక్ట్ అయ్యారు.

ఒక వేళ తన మనసుకి నచ్చిన వాడు దొరికితే మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

అన్ని విధాల తగినవాడై ఉంటే.., ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికైతే తనకు పెళ్లిపై ఎలాంటి ఆలోచనలు లేవని కూడా పేర్కొన్నారు.



