
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.
తొలుత బ్యాటింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన ఆక్మల్.. అనంతరం ఫీల్డింగ్‌లో గల్లీ స్ధాయి వికెట్ కీపర్‌ను తలపించాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో ఆక్మల్ ఈజీ స్టంపింగ్‌ను మిస్ చేసి నవ్వులు పాలయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షోయబ్ మాలిక్.. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ మస్టర్డ్‌కు ఫుల్ ఔట్‌సైడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని మస్టర్డ్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే షర్ఫ్‌గా టర్న్ అవుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ కోల్పోయాడు.
దీంతో 23 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మస్టర్డ్ ఏకంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు నీవు అన్నా.. నీవు ఇప్పటికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు.
కాగా ఆక్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్‌తో చాలా మ్యాచ్‌ల్లో పాక్ కొంపముంచాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ఇచ్చిన ఈజీక్యాచ్‌ను జారవిడిచిన ఆక్మల్.. పాక్ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టేలర్.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుత మ్యాచ్‌లో పాక్ గెలవకపోయింటే అందుకు ఆక్మల్ కారణమయ్యేవాడు.
చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!
Kamran Akmal Wicket keeping -
Then, Now & Forever.....
His wicket keeping costs Shoaib Akhter career - Ross Taylor assault in 2011 WC.#WCL2025 pic.twitter.com/HNcMCLRXUE— alekhaNikun (@nikun28) July 19, 2025