
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. శనివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. తొలి డబ్ల్యూసీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో ప్రోటీస్ దిగ్గజం, సౌతాఫ్రికా ఛాంపియన్స్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ది కీలక పాత్ర.
47 బంతుల్లో సెంచరీ..
196 పరుగుల లక్ష్య చేధనలో డివిలియర్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఊతికారేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఔట్ చేయడం పాక్ బౌలర్ల తరం కాలేదు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్.. 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. అతడితో పాటు జేపీ డుమినీ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో ఆజ్మల్ ఒక్కడే వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
షర్జీల్ ఖాన్ మెరుపులు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. అతడితో పాటు ఉమర్ అమీన్(36) రాణించాడు. సఫారీ బౌలర్లలో విల్జోయెన్, పార్నల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఒక మెగా ఈవెంట్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన డివిలియర్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు దక్కింది.
చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
AB de Villiers is probably the only retired cricketer who’s still better than all the active playerspic.twitter.com/3OB1AdCQaK
— yash (@onlydardnod1sco) August 2, 2025