breaking news
South Africa Champions
-
డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. శనివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. తొలి డబ్ల్యూసీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో ప్రోటీస్ దిగ్గజం, సౌతాఫ్రికా ఛాంపియన్స్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ది కీలక పాత్ర.47 బంతుల్లో సెంచరీ..196 పరుగుల లక్ష్య చేధనలో డివిలియర్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఊతికారేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఔట్ చేయడం పాక్ బౌలర్ల తరం కాలేదు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్.. 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. అతడితో పాటు జేపీ డుమినీ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో ఆజ్మల్ ఒక్కడే వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.షర్జీల్ ఖాన్ మెరుపులు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. అతడితో పాటు ఉమర్ అమీన్(36) రాణించాడు. సఫారీ బౌలర్లలో విల్జోయెన్, పార్నల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఒక మెగా ఈవెంట్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన డివిలియర్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు దక్కింది.చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..AB de Villiers is probably the only retired cricketer who’s still better than all the active playerspic.twitter.com/3OB1AdCQaK— yash (@onlydardnod1sco) August 2, 2025 -
ఉత్కంఠ పోరు.. ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్(57), వాన్ వైక్(76) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడల్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్, బ్రెట్‌లీ, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు.పోరాడి ఓడిన ఆసీస్..అనంతరం లక్ష చేధనలో ఆసీస్‌కు షాన్ మార్ష్(25), క్రిస్ లిన్(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్(33), క్రిస్టియన్(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.వైన్ పార్నల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి క్వినీ సిక్స్ బాదగా.. రెండు బంతికి సింగిల్ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్ మాత్రమే వచ్చింది.రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్ నైల్ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
షోయబ్ మాలిక్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్- 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లీసెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ను 31 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది.పాక్ బ్యాటర్లలో ఉమర్ అమీన్(58) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(46) కీలక నాక్ ఆడాడు. అతడితో పాటు ఆసిఫ్ అలీ(23), షర్జీల్ ఖాన్(19) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలీవర్ రెండు, విజోలన్, డుమినీ, పార్నల్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా ఛాంప్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగల్గింది. సఫారీ బ్యాటర్లలో మోర్నే వాన్ వైక్(44) మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో హాఫీజ్, తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాలిక్, రియాజ్, సోహిల్ ఖాన్, వసీం తలా వికెట్ సాధించారు. కాగా పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా డబ్ల్యూసీఎల్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
IND vs SA: డివిలియర్స్ సంచలన ‘రిలే క్యాచ్’.. వీడియో వైరల్
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు.సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన డివిలియర్స్.. 2021లో ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు ఏబీడీ కెప్టెన్‌గా ఉన్నాడు.అజేయ అర్ధ శతకంఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్ చాంపియన్స్‌ను బాలౌట్‌లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌ను ఢీకొట్టింది. నార్తాంప్టన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ ధనాధన్ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.ఇండియా చాంపియన్స్‌కు ఓటమిఅనంతరం లక్ష్య ఛేదనలో భారత్.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్ యూసఫ్ పఠాన్‌ను అవుట్ చేయడంలో డివిలియర్స్ చేసిన ప్రయత్నం హైలైట్‌గా నిలిచింది.క్యాచ్ పట్టి.. సహచర ఫీల్డర్‌కు అందించిఇండియా చాంపియన్స్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్ వైడ్ లాంగాఫ్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.అయితే, తాను బౌండరీ రోప్‌ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్ సరేల్ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్‌ను సురక్షితంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఇమ్రాన్ తాహిర్ సంబరాలు చేసుకోగా.. యూసఫ్ పఠాన్ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️Even after four years away from the game, he's making the impossible look easy 😮💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK— FanCode (@FanCode) July 22, 2025 -
డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)సీజన్‌ను ఇండియా చాంపియన్స్ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ చేసింది.డివిలియర్స్ విధ్వంసంఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (22), జాక్వెస్ రుడాల్ఫ్ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ సరేల్ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU— . (@ABDszn17) July 22, 2025 భారీ స్కోరుమిగతావాళ్లలో స్మట్స్ (17 బంతుల్లో 30), వాన్ విక్ (5 బంతుల్లో 18) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇండియా చాంపియన్స్ బౌలర్లలో పీయూశ్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (2), శిఖర్ ధావన్ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్లఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్ పఠాన్ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), పీయూశ్ చావ్లా (9), పవన్ నేగి (0), వినయ్ కుమార్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చివరన యువీ సేనమరోవైపు.. ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకోగా ఒక పాయింట్ వచ్చింది. తాజా మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి సీజన్లో యువీ సేన ఫైనల్లో పాక్‌ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?