IND vs SA: డివిలియర్స్‌ సంచలన ‘రిలే క్యాచ్‌’.. వీడియో వైరల్‌ | WCL: AB De Villiers Stuns Yusuf Pathan With Insane Relay Catch Goes Viral | Sakshi
Sakshi News home page

డివిలియర్స్‌ సంచలన ‘రిలే క్యాచ్‌’.. బిత్తరపోయిన యూసఫ్‌ పఠాన్‌.. వీడియో వైరల్‌

Jul 23 2025 11:51 AM | Updated on Jul 23 2025 12:00 PM

WCL: AB De Villiers Stuns Yusuf Pathan With Insane Relay Catch Goes Viral

PC: X

సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్‌’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు.

సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన డివిలియర్స్‌.. 2021లో ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 (WCL 2025) సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ జట్టుకు ఏబీడీ కెప్టెన్‌గా ఉన్నాడు.

అజేయ అర్ధ శతకం
ఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్‌ చాంపియన్స్‌ను బాలౌట్‌లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌ను ఢీకొట్టింది. నార్తాంప్టన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.  ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.

ఇండియా చాంపియన్స్‌కు ఓటమి
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను అవుట్‌ చేయడంలో డివిలియర్స్‌ చేసిన ప్రయత్నం హైలైట్‌గా నిలిచింది.

క్యాచ్‌ పట్టి.. సహచర ఫీల్డర్‌కు అందించి
ఇండియా చాంపియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్‌ వైడ్‌ లాంగాఫ్‌ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్‌ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.

అయితే, తాను బౌండరీ రోప్‌ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్‌ సరేల్‌ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్‌ను సురక్షితంగా క్యాచ్‌ పట్టాడు. దీంతో ఇమ్రాన్‌ తాహిర్‌ సంబరాలు చేసుకోగా.. యూసఫ్‌ పఠాన్‌ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ  తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement