breaking news
India Champions
-
పాకిస్తాన్‌తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. టోర్నీలో భాగంగా రేపు (జులై 31) సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లంతా మూకుమ్మడిగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించారని సమాచారం. దీంతో పాకిస్తాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనూ భారత్ ఇదే కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.భారత్ సెమీస్‌కు చేరిందిలా..!పాక్‌తో లీగ్ దశలో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొని సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్లో తుది బెర్త్ దక్కించుకుంది.అయితే అప్పటికే పాకిస్తాన్ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో సెమీస్‌లోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యమైంది. ఒకవేళ లీగ్ దశలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా ఫైనల్లో అయినా పాక్‌తో పోరు తప్పేది కాదు.మరోపక్క పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సి ఉంది.దేశమే ముఖ్యంపాక్తో సెమీస్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత ఆటగాళ్లు నిర్ణయించుకోకముందే టోర్నీ ప్రధాన స్పాన్సర్ 'ఈజ్‌మైట్రిప్' నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భారత్, పాక్ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.‘డబ్ల్యూసీఎల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్‌తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అండగా ఉండలేము.కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లతో డబ్ల్యూసీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా
ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్ (WCL 2025)లో టీమిండియాకు ఇది తొలి విజయమే అయినా.. ఏకంగా టాప్-4కు అర్హత సాధించడం విశేషం.వరుస ఓటములుఈ టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది ఇండియా. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్‌తో తలపడి 88 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆ తర్వాత ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఇంగ్లండ్ చాంపియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న యువరాజ్ సేన.. విండీస్‌తో తాజా మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది.చెలరేగిన భారత బౌలర్లుగ్రేస్ రోడ్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇండియా.. వెస్టిండీస్‌ను 144 పరుగులకు కట్టడి చేసింది. ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (2), కెప్టెన్ క్రిస్ గేల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.మిగతా వారిలో డ్వేన్ స్మిత్ (20) కాస్త ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ వింటేజ్ ఆటను గుర్తుచేశాడు. కేవలం 43 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు కూల్చారు. పవన్ నేగి ఒక వికెట్ దక్కించుకున్నాడు.14 ఓవర్లలోనే ఛేదించాలిఅయితే, సెమీస్ సమీకరణల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 14 ఓవర్లలోనే ఛేదించాలి. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్‌రేటుతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ అద్భుతమే చేసింది. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది.బిన్ని మెరుపు అర్ధ శతకంస్టువర్ట్ బిన్ని మెరుపు అర్ధ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21)తో పాటు యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. Mountains are there to be climbed 💪Faced with a stiff target of 145 in 14.1 overs to qualify for the semis, India got there with ease thanks to fireworks from Stuart Binny & Yusuf Pathan 🇮🇳#WCL2025 pic.twitter.com/eGOorYFQbq— FanCode (@FanCode) July 29, 2025మిగతా వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (18 బంతుల్లో 25) రాణించగా.. రాబిన్ ఊతప్ప (8), గురుకీరత్ సింగ్మాన్ (7), సురేశ్ రైనా (7) విఫలమయ్యారు. ఇక 13.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన ఇండియా చాంపియన్స్ ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది.పాక్‌తో సెమీస్... ఇండియా ఆడుతుందా? ఆరుజట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, సౌతాఫ్రికా చాంపియన్స్ ఐదింట చెరో నాలుగు గెలిచి ముందుగానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట రెండు, ఇండియా చాంపియన్స్ (రన్‌రేటు: -0.558) ఒకటి గెలిచి టాప్-4లో నిలిచాయి. ఇంగ్లండ్ ఐదింట ఒకటి (రన్‌రేటు: -0.809), వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట ఒకటి (రన్‌రేటు: -2.302) మాత్రమే గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగానూ వెనుకబడి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇండియా ఆడుతుందా? లేదంటే టోర్నీ నుంచే తప్పుకొంటుందా? అనేది తేలాల్సి ఉంది. చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన టీమిండియా
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఆదివారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 224 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు టీమిండియా పోరాడింది.లక్ష్య చేధనలో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇండియా బ్యాటర్లలో యుసఫ్ పఠాన్ మరోసారి తన బ్యాట్ ఝూళిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు.అతడితో పాటు యువరాజ్ సింగ్(38), బిన్నీ(35) పర్వాలేదన్పించారు. కానీ టాపర్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మీకర్ రెండు వికెట్లు సాధించాడు.బొపారా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ రవి బొపారా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో ఇయాన్ బెల్(54), మోయిన్ అలీ(33) రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ ఓ వికెట్ సాధించాడు.సెమీస్‌కు చేరాలంటే..కాగా ఈ ఓటమితో భారత్ సెమీస్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్బుతం జరగాలి. భారత్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తమ సెమీస్ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి.మరో బెర్త్ కోసం విండీస్, భారత్, ఇంగ్లండ్ పోటీపడతున్నాయి. విండీస్, భారత్ కంటే ఇంగ్లండ్‌కే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్(3 పాయింట్లు) నాలుగో స్ధానంలో ఉంది. భారత్(-1.852), విండీస్(-1.974)తో పోలిస్తే రన్‌రేట్ పరంగా కూడా ఇంగ్లండ్(0.809) ముందంజలో ఉంది. భారత్ తమ ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయం సాధిస్తే ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. -
WCL 2025: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లీడ్స్ వేదికగా శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ విధ్వంసం సృష్టించాడు. ధావన్ 60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(3), అంబటి రాయుడు(0) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ ) రెండు వికెట్లు సాధించగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.ఫెర్గూసన్ మెరుపులు.. అనంతరం 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆరంభంలో కంగారులు తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. కాలమ్ ఫెర్గూసన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.అతడితో పాటు డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇండియా ఛాంపియన్స్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.కాగా ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధావన్ సెంచరీ మిస్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025 ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.పఠాన్ ఫటాఫట్ కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్‌డౌన్‌లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.యువీ సేనకు భంగపాటుకాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్‌తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు -
IND vs SA: డివిలియర్స్ సంచలన ‘రిలే క్యాచ్’.. వీడియో వైరల్
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు.సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన డివిలియర్స్.. 2021లో ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు ఏబీడీ కెప్టెన్‌గా ఉన్నాడు.అజేయ అర్ధ శతకంఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్ చాంపియన్స్‌ను బాలౌట్‌లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌ను ఢీకొట్టింది. నార్తాంప్టన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ ధనాధన్ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.ఇండియా చాంపియన్స్‌కు ఓటమిఅనంతరం లక్ష్య ఛేదనలో భారత్.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్ యూసఫ్ పఠాన్‌ను అవుట్ చేయడంలో డివిలియర్స్ చేసిన ప్రయత్నం హైలైట్‌గా నిలిచింది.క్యాచ్ పట్టి.. సహచర ఫీల్డర్‌కు అందించిఇండియా చాంపియన్స్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్ వైడ్ లాంగాఫ్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.అయితే, తాను బౌండరీ రోప్‌ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్ సరేల్ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్‌ను సురక్షితంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఇమ్రాన్ తాహిర్ సంబరాలు చేసుకోగా.. యూసఫ్ పఠాన్ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️Even after four years away from the game, he's making the impossible look easy 😮💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK— FanCode (@FanCode) July 22, 2025 -
డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)సీజన్‌ను ఇండియా చాంపియన్స్ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ చేసింది.డివిలియర్స్ విధ్వంసంఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (22), జాక్వెస్ రుడాల్ఫ్ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ సరేల్ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU— . (@ABDszn17) July 22, 2025 భారీ స్కోరుమిగతావాళ్లలో స్మట్స్ (17 బంతుల్లో 30), వాన్ విక్ (5 బంతుల్లో 18) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇండియా చాంపియన్స్ బౌలర్లలో పీయూశ్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (2), శిఖర్ ధావన్ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్లఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్ పఠాన్ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), పీయూశ్ చావ్లా (9), పవన్ నేగి (0), వినయ్ కుమార్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చివరన యువీ సేనమరోవైపు.. ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకోగా ఒక పాయింట్ వచ్చింది. తాజా మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి సీజన్లో యువీ సేన ఫైనల్లో పాక్‌ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే? -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్‌వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్‌బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్‌నరైన్ చందర్‌పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్‌బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1డిజిటల్/ఓటీటీ: ఫ్యాన్‌కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్‌స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?