WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్‌, బ్రెట్‌ లీ.. షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు | WCL 2025: When & where to watch legends like Yuvraj Singh, Shahid Afridi; catch live streaming details | Sakshi
Sakshi News home page

WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్‌, బ్రెట్‌ లీ.. షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Jul 18 2025 6:29 PM | Updated on Jul 19 2025 10:13 AM

WCL 2025: When & where to watch legends like Yuvraj Singh, Shahid Afridi; catch live streaming details

దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్‌ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్‌ ఝులిపించేందుకు యువరాజ్‌ సింగ్‌, ఏబీ డివిలియర్స్‌, జాక్వెస్‌ కలిస్‌.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్‌ లీ, ఇమ్రాన్‌ తాహిర్‌ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్‌ వేదికగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్‌ షెడ్యూల్‌, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఇందులో భాగమయ్యాయి.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇండియా చాంపియన్స్‌ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్స్‌ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

జట్లు
ఇండియా చాంపియన్స్‌
యువరాజ్ సింగ్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.

ఆస్ట్రేలియా చాంపియన్స్‌
షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్‌ లిన్‌, రాబ్‌ క్వినీ, జాన్‌ హేస్టింగ్స్‌, జేవియర్‌ దొహర్టి, మోజెస్‌ హెండ్రిక్స్‌, పీటర్‌ సిడిల్‌, నాథన్‌-కౌల్టర్‌ నీల్‌, డిర్క్‌ నాన్స్‌.

సౌతాఫ్రికా చాంపియన్స్‌
హర్షల్‌ గిబ్స్‌, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌, జేపీ డుమిని, జేజే స్మట్స్‌, డేన్‌ విల్లాస్‌, రిచర్డ్‌ లెవీ, నీల్‌ మెకంజీ, ఎస్‌జే ఎర్వీ, మోర్నీ మ్యాన్‌ విక్‌, జాక్వెస్‌ కలిస్‌, క్రిస్‌ మోరిస్‌, రియాన్‌ మెక్‌లారెన్‌, అల్బీ మోర్కెల్‌, డేల్‌ స్టెయిన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌​, వైన్‌ పార్నెల్‌, రోరీ క్లెన్‌వెల్ట్‌, హార్డస్‌ విల్జోన్‌, ఆరోన్‌ ఫంగిసో, డువాన్‌ ఓలీవర్‌.

పాకిస్తాన్‌ చాంపియన్స్‌
సర్ఫరాజ్‌ అహ్మద్‌, యూనిస్‌ ఖాన్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ హఫీజ్‌, కమ్రాన్‌ అక్మల్‌, షోయబ్‌ మసూద్‌, మిస్బా ఉల్‌ హక్‌, షార్జిల్‌ ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, షాహిద్‌ ఆఫ్రిది, ఇమాద్‌ వాసిం, షోయబ్‌ మాలిక్‌, ఆమేర్‌ యామిన్‌, వహాబ్‌ రియాజ్‌, సయీద్‌ అజ్మల్‌, సొహైల్‌ తన్వీర్‌, రమన్‌ రాయీస్‌.

ఇంగ్లండ్‌ చాంపియన్స్‌
కెవిన్‌ పీటర్సన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, అలిస్టర్‌ కుక్‌, ఫిలిప్‌ మస్టార్డ్‌, ఇయాన్‌ బెల్‌, క్రిస్‌ షోఫీల్డ్‌, టిమ్‌ ఆంబ్రోస్‌, రవి బొపారా, సమిత్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్‌, స్టువర్ట్‌ మేకర్‌, రియాన్‌ సైడ్‌బాటమ్‌, లియామ్‌ ప్లంకెట్‌, టిమ్‌ బ్రెస్నాన్‌, సాజిద్‌ మహమూద్‌, అజ్మల్‌ షెహజాద్‌.

వెస్టిండీస్‌ చాంపియన్స్‌
క్రిస్‌ గేల్‌, శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌, జొనాథన్‌ కార్టర్‌, చాడ్విక్‌ వాల్టన్‌, విలియమ్‌ పెర్కిన్స్‌, డేవ్‌ మహ్మద్‌, క్రిస్‌ గేల్‌, డారెన్‌ సామీ, కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో, డ్వేన్‌ స్మిత్‌, షెల్డన్‌ కార్టెల్‌, సామ్యూల్‌ బద్రీ, షనన్‌ గాబ్రియెల్‌, ఫిడెల్‌ ఎడ్‌వర్డ్స్‌, రవి రాంపాల్‌, ఆష్లే నర్స్‌, నికిత మిల్లర్‌, సులేమాన్‌ బెన్‌.

షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం
👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌- రాత్రి 9 గంటలకు
👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్‌- సాయంత్రం 5 గంటలకు
👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్‌- రాత్రి 9 గంటలకు
👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్‌- రాత్రి 9 గంటలకు.

వేదికలు: ది ఓవల్‌, ఎడ్జ్‌బాస్టన్‌, హెడింగ్లీ, గ్రేస్‌ రోడ్‌, నార్తాంప్టన్‌ మైదానాలు.

ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?
👉ఇండియాలో..
టీవీ: స్టార్‌ స్పోర్ట్స్‌ 1
డిజిటల్‌/ఓటీటీ: ఫ్యాన్‌కోడ్‌
👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ
👉యునైటెడ్‌ కింగ్‌డమ్‌: టీఎన్‌టీ స్పోర్ట్స్‌
👉ఆస్ట్రేలియా: ఫాక్స్‌ స్పోర్ట్స్‌ స్ట్రీమ్‌, కయో స్పోర్ట్స్‌.
👉సౌతాఫ్రికా: సూపర్‌స్పోర్ట్‌.

చదవండి: BCCI:‍ వైభవ్‌ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement