breaking news
Australia Champions
-
ఉత్కంఠ పోరు.. ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్(57), వాన్ వైక్(76) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడల్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్, బ్రెట్‌లీ, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు.పోరాడి ఓడిన ఆసీస్..అనంతరం లక్ష చేధనలో ఆసీస్‌కు షాన్ మార్ష్(25), క్రిస్ లిన్(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్(33), క్రిస్టియన్(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.వైన్ పార్నల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి క్వినీ సిక్స్ బాదగా.. రెండు బంతికి సింగిల్ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్ మాత్రమే వచ్చింది.రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్ నైల్ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.కాగా ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధావన్ సెంచరీ మిస్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025 ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.పఠాన్ ఫటాఫట్ కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్‌డౌన్‌లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.యువీ సేనకు భంగపాటుకాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్‌తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు -
ఆసీస్ ఓపెనర్ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 27 బంతుల్లోనే....
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ లిన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ పూర్తైన అనంతరం మరో ఏడు బంతులు ఎదుర్కొన్న క్రిస్ లిన్ (Chris Lynn).. ఏకంగా 31 పరుగులు రాబట్టాడు.27 బంతుల్లోనే35 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్ మొత్తంగా 27 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 300 స్ట్రైక్‌రేటుతో ఈ మేర పరుగులు రాబట్టాడు. క్రిస్ లిన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా.. ఆస్ట్రేలియా చాంపియన్స్ వెస్టిండీస్ చాంపియన్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.డబ్ల్యూసీఎల్-2025లో భాగంగా బుధవారం రాత్రి ఆసీస్- విండీస్ (AUSCH vs WICH) జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.గేల్ మరోసారి విఫలంఓపెనర్ డ్వేన్ స్మిత్ (22), లెండిల్ సిమ్మన్స్ (29), డ్వేన్ బ్రావో (26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ క్రిస్ గేల్ (21) మరోసారి తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడెల్ మూడు వికెట్లు కూల్చగా.. కౌల్టర్-నైల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ బ్రెట్ లీ, స్టీవ్ ఒకెఫె, ఆర్సీ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ చాంపియన్స్ ఆరంభంలోనే షాన్ మార్ష్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్అయితే, మరో ఓపెనర్ క్రిస్ లిన్ (27 బంతుల్లో 81) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. నికిత మిల్లర్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఆటకు తెరపడింది. ఈ క్రమంలో డీ ఆర్సీ షార్ట్ (12 బంతుల్లో 18) వేగంగా ఆడగా.. వికెట్ కీపర్ బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 30)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 9.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.Lynnsanity Strikes in Style 😎Chris Lynn hammered 81 off just 27 balls, peppering the ground with 8 sixes and 6 fours to power Australia Champions to a dominant win 💪#WCL2025 pic.twitter.com/CZUaP0T4Ui— FanCode (@FanCode) July 23, 2025ఈ క్రమంలో ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ చాంపియన్స్‌ను చిత్తు చేసిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఈ మెగా టోర్నీ 2024లో మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా చాంపియన్స్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచింది. చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్‌వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్‌బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్‌నరైన్ చందర్‌పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్‌బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1డిజిటల్/ఓటీటీ: ఫ్యాన్‌కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్‌స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?