
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్(57), వాన్ వైక్(76) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడల్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్, బ్రెట్‌లీ, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు.
పోరాడి ఓడిన ఆసీస్..
అనంతరం లక్ష చేధనలో ఆసీస్‌కు షాన్ మార్ష్(25), క్రిస్ లిన్(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్(33), క్రిస్టియన్(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.
వైన్ పార్నల్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి క్వినీ సిక్స్ బాదగా.. రెండు బంతికి సింగిల్ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్ మాత్రమే వచ్చింది.
రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్ నైల్ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.
చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్