T20 WC 2026: సెమీస్‌కు అంపైర్లు వీరే..! | IND vs ENG, SA vs NZ Umpires, Match Referee, Officials Announced For ICC T20 World Cup 2026 Semifinal | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సెమీస్‌కు అంపైర్లు వీరే..!

Mar 3 2026 1:10 PM | Updated on Mar 3 2026 1:23 PM

IND vs ENG, SA vs NZ Umpires, Match Referee, Officials Announced For ICC T20 World Cup 2026 Semifinal

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

ఈ మ్యాచ్‌లకు అఫీషియల్స్‌ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది.  

సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌  
- ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్  
- థర్డ్‌ అంపైర్‌: నితిన్ మెనన్  
- నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్  
- మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్  

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో సెమీఫైనల్‌ 
- ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్  
- థర్డ్‌ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్  
- నాలుగో అంపైరు: పాల్ రైఫెల్  
- మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement