WCL 2025: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓట‌మి | Dhawan heroics in vain as Ferguson seals 4-wicket win for AUS Champs | Sakshi
Sakshi News home page

WCL 2025: ధావన్ మెరుపులు వృథా.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓట‌మి

Jul 27 2025 10:47 AM | Updated on Jul 27 2025 11:25 AM

Dhawan heroics in vain as Ferguson seals 4-wicket win for AUS Champs

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. లీడ్స్ వేదిక‌గా శ‌నివారం ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 203 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్‌ శిఖ‌ర్ ధావ‌న్ విధ్వంసం సృష్టిం‍చాడు. ధావన్‌ 60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అతడితో పాటు యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్‌(3), అంబటి రాయుడు(0) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ ) రెండు వికెట్లు సాధించగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.

ఫెర్గూసన్ మెరుపులు.. 
అనంతరం 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో‍యి చేధించింది. ఆరంభంలో కంగారులు తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. కాలమ్ ఫెర్గూసన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

అతడితో పాటు డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇండియా ఛాంపియన్స్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్‌ తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓటమి చవిచూసింది.
చదవండి: IND vs ENG: షాకింగ్‌.. 'జ‌స్ప్రీత్ బుమ్రా త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement