breaking news
World champions Australia
-
WCL 2025: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లీడ్స్ వేదికగా శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ విధ్వంసం సృష్టించాడు. ధావన్ 60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(3), అంబటి రాయుడు(0) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ ) రెండు వికెట్లు సాధించగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.ఫెర్గూసన్ మెరుపులు.. అనంతరం 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆరంభంలో కంగారులు తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. కాలమ్ ఫెర్గూసన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.అతడితో పాటు డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇండియా ఛాంపియన్స్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం
మెల్బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన భారత్... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 3-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (6వ ని.లో) ఒక గోల్ చేయగా... రఘునాథ్ (22వ, 25వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు నుంచి టెంట్ మిటన్ (13వ ని.లో), జేక్ వెటన్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జెరెమీ హేవార్డ్ (38వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
ప్రపంచ హాకీ చాంప్ ఆసీస్‌కు భారత్ షాక్
మెల్బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు భారత పురుషుల హాకీ జట్టు షాకిచ్చింది. యువ స్ట్రరుుకర్ ఆఫ్ఫాన్ యూసుఫ్ (19వ నిమిషంలో) రెండు ఫీల్డ్ గోల్స్‌తో చెలరేగడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో భారత్ 3-2తో గెలిచింది. డ్రాగ్ ఫ్లికర్ రఘునాథ్ (44) మరో గోల్ చేశాడు. ఆసీస్ నుంచి విల్లీస్ (36), మిట్టన్ (43) గోల్స్ సాధించారు. అత్యంత పటిష్ట జట్టుగా పేరు తెచ్చుకున్న ఆసీస్‌ను భారత్ ఆది నుంచే కట్టడి చేసింది. 19వ నిమిషంలో యూసుఫ్ తొలి గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత వెంటనే మరో ఫీల్డ్ గోల్‌తో ఆసీస్‌కు షాకిచ్చాడు. దీం తో తొలి అర్ధభాగంలోనే జట్టు 2-0తో పైచేరుు సాధించింది. కానీ ద్వితీయార్ధంలో ఆసీస్ రెండు గోల్స్‌తో మ్యాచ్‌లో నిలిచింది. ఆరుుతే వారికి ఈ ఆనందం ఎంతోసేపు నిలవకుండానే రఘునాథ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. నేడు చివరిదైన రెండో మ్యాచ్ జరుగుతుంది.