భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం | India, Australia to level hockey series | Sakshi
Sakshi News home page

భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం

Dec 1 2016 12:36 AM | Updated on Sep 4 2017 9:32 PM

భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం

భారత్, ఆసీస్ హాకీ సిరీస్ సమం

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది.

మెల్‌బోర్న్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన భారత్... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 3-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది.

భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (6వ ని.లో) ఒక గోల్ చేయగా... రఘునాథ్ (22వ, 25వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు నుంచి టెంట్ మిటన్ (13వ ని.లో), జేక్ వెటన్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జెరెమీ హేవార్డ్ (38వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement