ఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా,శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తుల్ని జప్తు చేసింది. రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఈడీ విచారణకు రైనా,ధావన్ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌ను కూడా ఈడీ గతంలోనే విచారించిన విషయం తెలిసిందే.
సురేష్ రైనా రూ.6.44 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రూ.4.70 కోట్ల విలువైన శిఖర్ ధావన్‌కు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆస్తులు 1xBet అనే విదేశీ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.
కేసు నేపథ్యం
1xBet అనే సంస్థ భారత్‌లో అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్ సేవలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు సంబంధించిన సరొగేట్ యాప్స్ ద్వారా పలు ప్రముఖులు ప్రచారం చేసినట్లు ఈడీ గుర్తించింది. సురేష్ రైనా,శిఖర్ ధావన్,మ్యూజిక్ డైరెక్టర్ బాద్షా,యాక్టర్ కపిల్ శర్మ యూట్యూబర్ బీబీ కీ వైన్ (బువన్ బామ్)లను నిర్ధారించింది. వీరందంటూ బెట్టింగ్ యాప్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేసినట్లు అభిపప్రాయం వ్యక్తి చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
టీఎక్స్ బెట్ వంటి బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఈ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణ కొనసాగుతోందని ఈడీ పేర్కొంది.


