
తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో ఉంది కురుమూర్తి స్వామి ఆలయం.

ఈ స్వామివారిని భక్తులు ప్రేమగా పేదల తిరుపతిగా పిలుస్తారు.

అందుకు కారణాలు లేకపోలేదు. ఈ ఆలయం.. కురుపతి కొండల మధ్య వెలిసి తిరుపతి వాతావరణాన్ని తలపిస్తుంది.

అలాగే.. స్వామివారి విగ్రహం కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపాన్ని పోలి ఉంటుంది.

తిరుపతి వెళ్లాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా అవుతుంది. అందుకే స్థానికంగా ఉన్న ఈ స్వామివారిని పేదల తిరుపతిగా కొలుస్తున్నారు.

ఇక్కడి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు.

మహబూబ్‌నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు, గద్వాల్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కురుమూర్తి రైల్వే స్టేషన్ నుంచి 5–7 కిలోమీటర్లు వస్తుంది.






























