AB De Villiers: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా'

AB De Villiers Says Watching Gladiator Movie I Cry Every Second Movie - Sakshi

సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌  ఐపీఎల్‌ ఆడకపోయినప్పటికి ఆర్‌సీబీకి తన మద్దతు ఇస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ప్లేయర్ల జాబితాలో డివిలియర్స్‌ చోటు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 39.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఓవరాల్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 151.69 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న జియో సినిమాకు డివిలియర్స్‌ ఇటీవలే ఇంటర్య్వూ ఇచ్చాడు. ఎన్నో విషయాలు పంచుకున్న డివిలియర్స్‌ కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా చెప్పడం ఆసక్తి కలిగించింది. తాజాగా గ్లాడియేటర్‌ సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తానని చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

"నేను గ్లాడియేటర్ మూవీ చూసినప్పుడల్లా ఏడుస్తుంటాను. ఆ సినిమాలో ప్రతి సెకండ్‌కు ఎమోషనల్ అవుతాను. ఇటీవలే మా పిల్లలతో కలిసి ఆ సినిమాను 12వ సారి చూశాను. అందులో కాస్త హింసాత్మకా సన్నివేశం కనిపించగానే నేను వారి కళ్లు మూస్తూ చూపించాను. కానీ అప్పుడు కూడా సినిమా చూసి ఏడ్చాను." అని డివిలయర్స్ తెలిపాడు. 

డివిలియర్స్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే 2018లో  తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున ఎన్నో అరుదైన మైలు రాళ్లు అందుకున్న ఏబీ డివిలియర్స్‌ రిటైర్మెంట్ తర్వాత కూడా ఐపీఎల్‌లో కొనసాగాడు. 2021లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. ఈ టోర్నీలలో అత్యుత్తమ ఆఠగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 39.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఓవరాల్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 151.69 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top