#JosButtler-Jaiswal: జైశ్వాల్‌ శివతాండవం.. బట్లర్‌ త్యాగం ఊరికే పోలేదు

Buttler-Run-Out-Horrible-Due-To-Jaiswal But Applauds His Terrific Knock - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 150 పరుగుల టార్గెట్‌ను 13.1 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. యశస్వి జైశ్వాల్‌ 47 బంతుల్లోనే 98 పరుగులు నాటౌట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి రాజస్తాన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. 

అయితే ఇదే జైశ్వాల్‌ రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో బట్లర్‌ రనౌట్‌కు ప్రధాన కారణమయ్యాడు. జైశ్వాల్‌తో మిస్‌ కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల బట్లర్‌ ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో హర్షిత్‌ రానా వేసిన నాలుగో బంతిని బట్లర్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని చూస్తూ బట్లర్‌ క్రీజు నుంచి కాస్త ముందుకు కదిలాడు.

అయితే సింగిల్‌ కోసం వస్తున్నాడేమోనని భావించిన జైశ్వాల్‌ పరిగెత్తుకొచ్చాడు. ఇది గమనించిన బట్లర్‌ జైశ్వాల్‌ను వద్దని వారించకుండా తాను నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న రసెల్‌ మెరుపు వేగంతో త్రో విసరగా బట్లర్‌ డైరెక్ట్‌ హిట్‌కు బలయ్యాడు. ఒక రకంగా జైశ్వాల్‌ను ఔట్‌ చేయడం ఇష్టం లేక తన వికెట్‌ను త్యాగం చేశాడు.

బట్లర్‌ త్యాగం అర్థం చేసుకున్న జైశ్వాల్‌ దానిని వృథా కానివ్వలేదు. తన కారణంగా బట్లర్‌ ఔటయ్యాడన్న కోపంతో మరింత ధాటిగా ఆడాడు. దీంతో జైశ్వాల్‌.. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న సమయంలో డగౌట్‌లో బట్లర్‌ పైకి లేచి చప్పట్లతో అభినందించడం హైలెట్‌గా నిలిచింది. 

చదవండి: జైశ్వాల్‌ సెంచరీ కోసం తపించిన శాంసన్‌.. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top