జైస్వాల్‌ రీఎంట్రీ | Thakur, Jaiswal back in Mumbai squad for Ranji Trophy quarters | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌ రీఎంట్రీ

Feb 2 2026 3:23 PM | Updated on Feb 2 2026 3:39 PM

Thakur, Jaiswal back in Mumbai squad for Ranji Trophy quarters

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్‌ ఫైనల్‌ కోసం​ ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. 

జైస్వాల్ ఈ సీజన్‌లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్‌ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. 

తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శార్దూల్‌ ముంబై జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్‌కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్‌, శార్దూల్‌ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.  

కర్ణాటకతో జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ కోసం ముంబై జట్టు..  
- శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) 
- యశస్వి జైస్వాల్
- ముషీర్ ఖాన్  
- అఖిల్ హెర్వడ్కర్  
- సిద్ధేశ్ లాడ్  
- సర్ఫరాజ్ ఖాన్  
- ఆకాష్ ఆనంద్ (wk)  
- హార్దిక్ తమోరే (wk)  
- సైరాజ్ పటిల్  
- శంస్ ములానీ  
- తనుష్ కోటియన్  
- తుషార్ దేశ్‌పాండే  
- మోహిత్ అవస్థ  
- ఓంకార్ తర్మలే  
- దివ్యేష్ సక్సేనా  
- సూర్యాంశ్ షెడ్గే  

 

Advertisement
 
Advertisement
Advertisement