Dhoni-Chahar: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!

ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్‌తో సీఎస్‌కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్‌కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్‌తో కలిసి సీఎస్‌కే సమంగా నిలిచింది.
ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్‌ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్‌గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్‌పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే.
ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్‌ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ క్యాచ్‌ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్‌తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు.
MS Dhoni when Deepak Chahar came for Autograph.
Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM— MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023
చదవండి: డానిల్ మెద్వెదెవ్‌కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్'
మరిన్ని వార్తలు
మరిన్ని వీడియోలు