
టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు వారిద్దరూ ' గ్రాండ్ మార్షల్'గా వ్యవహరించారు.

FIA అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. ఇది 1970లో ప్రారంభమైంది.

ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఘనమైన వేడుక.

2025 సంవత్సరానికి గాను, సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న “గ్రాండ్ మార్షల్స్”గా పాల్గొన్నారు.

2022లో టాలీవుడ్ నుంచి తొలిసారి అల్లు అర్జున్ దంపతులకు ఈ గౌరవం దక్కింది.












