breaking news
Indpendence Day
-
ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు!
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీలోనే ఎన్నో పన్నులు.. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్‌గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి. 12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో కీలక భేటీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది. -
తిరుమలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..
ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే.. నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్‌గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ దినోత్సవం థీమ్: "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం. ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు. (చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!) -
వెయ్యి అడుగుల జాతీయ జెండా (ఫొటోలు)
-
వింటేజ్ షోయగం
-
‘కోట’పై జెండాకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలను జరిపేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతించింది. రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే చేసిన దరఖాస్తుకు స్పందించిన ఆ శాఖ షరతులతో అప్పట్లోనే తాత్కాలికంగా ఓకే అంది. ఇప్పుడు అధికారికంగా లిఖితపూర్వక అనుమతి మంజూరు చేస్తూనే నిబంధనలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమం కోసం గోల్కొండ కోట ప్రాంగణాన్ని వినియోగిస్తున్నందున నిర్దేశిత అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ చె ల్లించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.60 వేలను గోల్కొండ కోట ఇన్ఛార్జిగా ఉన్న ఏఎస్ఐ అధికారికి చెల్లించి అధికారిక అనుమతి పత్రం పొందింది. ఈ అనుమతి కేవలం ఆగస్టు 15కే పరిమితమని, మరుసటి రోజు కోటలో ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యక్రమాలు జరపొద్దని, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వస్తువులు, పరికరాలను కూడా తొలగించాలని సూచించింది. 15న భద్రతాపరమైన చర్యల పేర సందర్శకులకు ఇబ్బందులు సృష్టించొద్దని స్పష్టం చేసింది. కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తుండటంతో జీహెచ్ఎంసీ రోడ్లను ముస్తాబు చేసింది. ప్రధాన రోడ్లన్నింటిని కొత్తగా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. -
జెండా పండుగకు కర్నూలు ముస్తాబు
58 ఏళ్ల తరువాత ఏపీ సర్కారు స్వాతంత్య్ర వేడుకలు సాక్షి, కర్నూలు : ఒకనాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని కందనవోలు(కర్నూలు)లో దేశ 68వ స్వాతంత్య్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్వహించనుంది. 58 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత మరోసారి కర్నూలులో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. చివరగా 1957 గవర్నర్ పాలనలో త్రివేది కర్నూలులో అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంతో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. సుమారు రూ. 5 కోట్లతో ఏపీఎస్పీ బెటాలియన్‌లో స్వాతంత్య్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజన తరువాత తొలిగా నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకలను కర్నూలు నగరంలో నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రదర్శనకు ప్రభుత్వ శాఖల శకటాలను సిద్ధం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, జేసీ కన్నబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు చేరుకున్నారు. టీవీ చానళ్లు, పత్రికా ప్రతినిధులను సీఎం వద్దకు అనుమతించలేదు. దీంతో జర్నలిస్టులంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. -
బహిరంగ చర్చకు సిద్ధమా?: నరేంద్రమోడీ
అహ్మదాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. దేశభద్రత విషయంలో ప్రధాని చేతులు ముడుచుకొని చోద్యం చూస్తున్నారని, సరిహద్దుల వెంట పాకిస్థాన్, చైనా తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అందుకు దీటుగా స్పందించడం లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, పాలన అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. గురువారం గుజరాత్‌లోని భుజ్‌లో ఓ కాలేజీలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మోడీ ప్రసంగించారు. దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి నుంచి ఆహార భద్రత బిల్లు వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభద్రతపై ఆందోళన వ్యక్తంచేసిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. ‘‘సహనానికి ఓ హద్దు ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు. ఆ హద్దు ఏమిటి.. ఎక్కడుందో నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ సహనం ఎంతకాలం ఉంటుంది? ఈరోజు దేశభద్రత ముప్పు ముంగిట ఉంది. పాకిస్థానే కాదు.. చైనా కూడా మన సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తోంది. అయినా మనం మౌనంగానే ఉంటున్నాం. ఇటలీ సైనికులు మన జాలర్లను చంపేసినా.. పాకిస్థానీయులు మన జవాన్ల తలలను నరికివేసినా మౌనంగానే ఉంటున్నాం..’’ అని అన్నారు. ప్రధాని మన్మోహన్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎక్కడా పాక్‌ను హెచ్చరించలేదన్నారు. ‘‘అంతర్జాతీయ సంబంధాలు, పొరుగు దేశాలతో స్నేహ బంధం వంటి అంశాల్లో ప్రధాని సంయమనం పాటించాలన్న విషయం నాకు తెలుసు. పాక్‌కు సవాలు విసిరేందుకు ఎర్రకోట వేదిక కాదని కూడా తెలుసు. కానీ భారత ఆర్మీ మనోస్థైర్యాన్ని నిలబెట్టాల్సిన వేదిక మాత్రం కచ్చితంగా అదే. ప్రధాని మన జవాన్లలో ధైర్యం పెంచుతారని ఆశించా. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’’ అని విమర్శించారు. ‘ఎర్రకోటపై ఎక్కువసార్లు జెండా ఎగరవేసినవారి జాబితాలో మీరు (ప్రధాని) ఉన్నట్లు విన్నాను. పండిట్ నెహ్రూ జాతినుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఏమి చెప్పారో మీరు ఇప్పటికే అవే విషయాలను చెబుతున్నారు. ఆనాడు ఆయన ఏ సమస్యలను పేర్కొన్నారో వాటినే మీరు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ 60 ఏళ్లు మీరేం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి?’ అంటూ మోడీ ఎద్దేవా చేశారు. కాగా, చర్చకు రావాల్సిందిగాప్రధానికి సవాలు విసిరిన మోడీపై కాంగ్రెస్ మండిపడింది. ఆయన చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. ‘ప్రధాని చివరగా వస్తారు. ముందు మాతో చర్చకు సిద్ధపడు’ అని కేంద్ర మంత్రి ఖుర్షీద్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికాదు: అద్వానీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ ప్రసంగంపై గుజరాత్ సీఎం మోడీ చేసిన విమర్శల తీరు బీజేపీ అగ్రనేత అద్వానీకి నచ్చలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజున వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును పురస్కరించుకుని దేశం సంబరాలు జరుపుకొంటున్న సందర్భంలో ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయకూడదని, ప్రధాని మన్మోహన్పై, ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయకూడదని మోడీ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంపై మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. -
స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నగరం ఖాకీమయం
నగరం ఖాకీమయమైంది. ఎక్కడా చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ భద్రత ఏర్పాటుచేశారు. దాడులు చేస్తామన్న ఉగ్రవాద సంస్థల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ప్రవేశ ద్వారాలు, నిష్ర్కమణ ద్వారాల వద్ద డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. టోల్ నాకాలతోపాటు చెక్ నాకాలవద్ద ట్రక్కులు, టెంపోలు సహా కార్లు, ద్విచక్రవాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నగరంలోకి అనుమతినిస్తున్నారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు మొదలుకుని చిన్న గల్లీలో కూడా పోలీసులను మోహరించారు. ఇందుకోసం నగర పోలీసు శాఖ అదనంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోంగార్డుల సాయం తీసుకుంటుంది. మంత్రాలయ వద్ద నిషేధాజ్ఞలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రాలయ భవనంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. దక్షిణ ముంబైలో పారాగ్లైడింగ్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్, ఎయిర్ క్రాఫ్ట్‌లను గురువారమంతా నిషేధించారు. ఈ పరికరాల ద్వారా దాడులకు పాల్పడే అవకాశాలుండడంతో మంత్రాలయ పరిసరప్రాంతంలో వీటిని నిషేధించారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. ఏటా మంత్రాలయ భవనం ఆవరణలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంత్రులు, ఇతర కీలకమైన వ్యక్తులు, మిలీటరి, నేవీ, ఎయిర్ పోర్స్ దళాల అధికారులు, నగరవాసులు హాజరవుతారు. దీన్ని అదునుగా చేసుకుని ఉగ్రవాదులు పారాగ్లైడింగ్, ఎయిర్ క్రాఫ్ట్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ద్వారా మంత్రాలయపై దాడులకు పాల్పడే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెరైన్ డ్రైవ్, ఆజాద్‌మైదాన్, డి.బి.మార్గ్, కఫ్ పరేడ్, కొలాబా పోలీసు స్టేషన్ల హద్దులో పారాగ్లైడింగ్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్, ఎయిర్ కాఫ్ట్లను నిషేధించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ కేశవ్ పాటిల్ చెప్పారు.