
కుమారుడి నిశ్చితార్థ వేడుకతో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుటుంబం ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌కు.. ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ (Saaniya Chandhok)తో ఆగష్టు 13న ఎంగేజ్‌మెంట్ అయినట్లు సమాచారం.
ఆతిథ్య రంగం, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ప్రసిద్ధి చెందిన ఘాయ్ కుటుంబం.. పాపులర్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమెరీతోనూ పేరుగాంచింది. మరోవైపు.. జంతు ప్రేమికురాలైన సానియా.. ‘మిస్టర్ పాస్ పెట్ స్పా’ స్టోర్‌కు డైరెక్టర్‌గా, భాగస్వామిగా ఉంది.
కాబోయే మరదలితో సారా
ఇక టెండుల్కర్ కుటుంబానికి కాబోయే కోడలిగా సానియా పేరు బయటకు రాగానే.. సచిన్ ఫ్యామిలీతో ముఖ్యంగా.. సారా టెండుల్కర్ (Sara Tendulkar)తో ఆమె ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సారా టెండుల్కర్ ఇటీవల పైలేట్స్ స్టూడియో (వెల్‌నెస్ సెంటర్) ప్రారంభించగా.. పూజా కార్యక్రమాల్లో కాబోయే అత్తమామలతో కలిసి సానియా పాల్గొంది. అలాగే.. అంతకుముందు సారాతో కలిసి విదేశీ ట్రిపులకు వెళ్లింది సానియా. ఇక కాబోయే మరదలితో కలిసి దిగిన ఫొటోలను సారా గతంలో షేర్ చేయగా.. ఇప్పుడు అవి తెరమీదకు వచ్చాయి.
అర్జున్ కంటే వయసులో పెద్దా?
వీటిని బట్టి సానియా.. సారా బెస్ట్‌ఫ్రెండ్స్‌లో ఒకరిగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ వయసు వ్యత్యాసం గురించి కూడా చర్చ నడుస్తోంది. కాగా సచిన్- అంజలిలకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. ఆ తర్వాత రెండేళ్లకు అంటే.. సెప్టెంబరు 24, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 25 ఏళ్లు.

మరోవైపు.. సానియా జూన్ 23, 1998లో జన్మించింది. ఆమె ప్రస్తుత వయసు 26 ఏళ్లు. అంటే.. సానియా అర్జున్ కంటే దాదాపు ఏడాది పెద్దది. కాగా సచిన్ కంటే తన భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్దావిడ అన్న సంగతి తెలిసిందే.
సారాకు సానియా సలహా.. అర్జున్ రియాక్షన్ ఇదే
ఇదిలా ఉంటే.. గతేడాది సారా టెండుల్కర్ తన బర్త్‌డే (అక్టోబరు 12, 1997)కు ముందు.. ‘‘బెస్ట్ అడ్వైస్’’ కావాలంటూ తమ ఆప్తులను అడిగింది. ఇందులో సానియా కూడా ఉంది. ‘‘ఒత్తిడిలో కూరుకుపోకుండా.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ సానియా సారాకు సలహా ఇచ్చింది.
అయితే, అర్జున్ టెండుల్కర్ మాత్రం.. ‘‘27 ఏళ్ల వయసున్న వ్యక్తిలా అస్సలు ప్రవర్తించకు’’ అంటూ అక్కకు అడ్వైస్ ఇచ్చేశాడు. అర్జున్- సానియా ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. సానియా కంటే.. అర్జున్ సలహా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తల్లిదండ్రులు ఏమన్నారంటే..
మరోవైపు.. సచిన్ టెండుల్కర్.. ‘‘నువ్వెప్పుడూ ఇలాగే సింపుల్‌గా, నిరాడంబరంగా.. గౌరవప్రదనీయురాలిగా ఉండు’’ అంటూ కూతురికి సూచించగా.. తల్లి అంజలి.. ‘‘సంతోషం, బాధ.. కన్ఫ్యూజన్.. ఏదైనా.. ఆఖర్లో అన్నీ వర్కౌట్ అవుతాయనే సానుకూల దృక్పథంతో ఉండాలి’’ అంటూ సారాకు విలువైన సలహా ఇచ్చింది.