
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన బౌల్-అవుట్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోలేడు. టై అయిన మ్యాచ్‌లో బౌల్-అవుట్ నియమం ద్వారా భారత్ విజయం సాధించింది. ఇప్పడు అచ్చెం అటువంటి సీన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో రిపీటైంది.
ఈ టోర్నీలో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.
విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రిస్ గేల్(2), పొలార్డ్(0) వంటి స్టార్ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్ సిమ్మన్స్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్, స్మట్స్, ఓలీవర్ తలా వికెట్ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.
లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు బౌల్ అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్‌లు చేయగా.. విండీస్ ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.
దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్ క్రికెట్ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
Bowl-Out Decides SA vs WI Thriller 🍿
You can't write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac— FanCode (@FanCode) July 19, 2025