breaking news
West Indies Champions
-
సిమన్స్ విధ్వంసం.. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2026 విజేతగా వెస్టిండీస్ ఛాంపియన్ నిలిచింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని విండీస్ ముద్దాడింది. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ(60), ఓవైద్ షా(38) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్, కాట్రెల్, రీఫర్ తలా వికెట్ సాధించారు.సిమన్స్ విధ్వంసంఅనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలో చేధించింది. విండీస్ ఓపెనర్ లెండల్ సిమన్స్(53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), చాడ్విక్ వాల్టన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ ఒక్కడే వికెట్ సాధించాడు. కాగా చాడ్విక్ వాల్టన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. డ్వేన్ బ్రావో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు.చదవండి: IND vs ZIM: టీమిండియా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా -
చందర్‌పాల్ విధ్వంసం.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న తుది పోరుకు విండీస్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జో బర్న్స్(86) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. వెల్స్(49) రాణించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(0), షార్ట్(0) తీవ్ర నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4 వికెట్లతో చెలరేగాడు.వాల్టన్ విధ్వంసంఅనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చాడ్విక్ వాల్టన్ విధ్వంసం సృష్టించాడు. వాల్టన్ కేవలం 42 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు కరేబియన్ లెజెండ్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, కౌల్టర్ నైల్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. -
యువరాజ్ ఫెయిల్.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో ఇండియా ఛాంపియన్స్ కథ ముగిసింది. మంగళవారం షార్జా వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు నమన్ ఓజా (0), అంబటి రాయుడు (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (4) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టాడు. రిషి ధావన్ (34 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాబిన్ ఉతప్ప (19), పియూష్ చావ్లా (13) కాస్త పోరాడటంతో భారత జట్టు వంద దాటగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రయద్ ఎమ్రిట్ 2 వికెట్లు తీయగా, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డన్ కాట్రెల్, నికితా మిల్లర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్ తలా ఒక వికెట్ సాధించారు. చాడ్విక్ వాల్టన్ విధ్వంసంఅనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. విండీస్ ఓపెనర్ చాడ్విక్ వాల్టన్( 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో దావల్ కులకర్ణి 2 వికెట్లు పడగొట్టగా, పియూష్ చావ్లా, రిషి ధావన్ తలా ఒక వికెట్ సాధించినా విండీస్ జోరును అడ్డుకోలేకపోయారు. -
డేవిడ్ వార్నర్ ఫెయిల్.. 119 పరుగులకే ఆసీస్ ఆలౌట్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026లో షార్జా వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బ్యాటర్లు నిరాశపరిచారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(1)తో సహా బెన్ డంక్(13), జో బర్న్స్(0) వంటి స్టార్ ప్లేయర్లు సైతం విఫలమయ్యారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది.డి ఆర్చీ షార్ట్(34), వెల్స్(26) రాణించిడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో కాట్రల్ మూడు, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రీఫర్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. ఇప్పుడు కరేబియన్ జట్టుపై కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసేటట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైంది.తుది జట్లువెస్టిండీస్ ఛాంపియన్స్: క్రిస్ గేల్(కెప్టెన్), లెండల్ సిమన్స్, చాడ్విక్ వాల్టన్(వికెట్ కీపర్), రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డ్వేన్ బ్రావో, రాయద్ ఎమ్రిట్, డేవ్ మహమ్మద్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాట్రెల్ఆస్ట్రేలియా ఛాంపియన్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), డి ఆర్సీ షార్ట్, జో బర్న్స్, బెన్ డంక్(వికెట్ కీపర్), కాలమ్ ఫెర్గూసన్, జొనాథన్ వెల్స్, మైఖేల్ బీర్, నాథన్ కౌల్టర్-నైల్, బెన్ లాఫ్లిన్, బెన్ హిల్ఫెన్హాస్, ఫవాద్ అహ్మద్ -
గేల్ ఒంటరి పోరాటం వృథా.. సఫారీల చేతిలో విండీస్ చిత్తు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్ 2026) టోర్నీలో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో వెస్టిండీస్ చాంపియన్స్ చిత్తుగా ఓడింది. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ చాంపియన్స్ 18.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో క్రిస్ గేల్ (31 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ (29) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆరోన్ ఫాంగిసో, ఇమ్రాన్ తాహిర్‌లు చెరో 3 వికెట్లు తీయగా, రోబి ఫ్రైలింక్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా చాంపియన్స్.. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఓపెనర్ రిచర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ అర్థశతకాలో విధ్వంసం సృష్టించడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. చివర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియన్స్ బౌలర్లలో డేవ్ మొహమ్మద్ రెండు వికెట్లు తీయగా, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రెయాడ్ ఎమ్రిట్, డ్వేన్ బ్రావో తలా ఒక వికెట్ తీశారు.𝗨𝗡𝗜𝗩𝗘𝗥𝗦𝗘 𝗕𝗢𝗦𝗦, 𝗨𝗡𝗜𝗩𝗘𝗥𝗦𝗘 𝗖𝗟𝗔𝗦𝗦 🔥 Chasing 242, Chris Gayle anchored the West Indies Champions’ innings with a blazing 60 off 31 balls in a fighting chase against South Africa Champions. 💥 Watch the #WCL 2026 LIVE on Star Sports! https://t.co/qbWoEDjl4c— Star Sports (@StarSportsIndia) October 5, 2026ఇదీ చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. భారత్, వెస్టిండీస్‌లకు జరిమానా -
డ్వేన్ బ్రావో కళ్లు చెదిరే క్యాచ్.. నోరెళ్లబెట్టిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
విన్యాసాలకు వయసుతో సంబంధం లేదని వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మరోసారి నిరూపించాడు. వెస్టిండీస్ చాంపియన్స్ తరఫున వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లీగ్ (డబ్ల్యూసీఎల్ 2026)లో ఆడుతున్న బ్రావో.. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 42 ఏళ్ల వయసులో బ్రావో అమాంతం గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడంతో సౌతాఫ్రికా స్టార్ ఫాప్ డుప్లెసిస్ నోరెళ్లబెట్టాడు. డుప్లెసిస్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రావో ఈ విన్యాసం ప్రదర్శించాడు. లాంగాన్ దిశగా డుప్లెసిస్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రావో వెనక్కి పరిగెత్తి. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా చాంపియన్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఓపెనర్ రిచర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి బీభత్సం ధాటికి సౌతాఫ్రికా చాంపియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. చివర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియన్స్ బౌలర్లలో డేవ్ మొహమ్మద్ రెండు వికెట్లు తీయగా, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రెయాడ్ ఎమ్రిట్, డ్వేన్ బ్రావో తలా ఒక వికెట్ తీశారు.DJ Bravo said: That one’s mine. https://t.co/X4VgRs6bZ9— World Championship Of Legends (@WclLeague) October 4, 2026ఇదీ చదవండి: కెప్టెన్‌గా రుతురాజ్.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
డివిలియర్స్ విధ్వంసం.. విండీస్‌పై సౌతాఫ్రికా భారీ స్కోరు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్ చాంపియన్స్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఓపెనర్ రిచర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి బీభత్సం ధాటికి సౌతాఫ్రికా చాంపియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. చివర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియన్స్ బౌలర్లలో డేవ్ మొహమ్మద్ రెండు వికెట్లు తీయగా, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రెయాడ్ ఎమ్రిట్, డ్వేన్ బ్రావో తలా ఒక వికెట్ తీశారు. ముందుగా రిచర్డ్ లెవీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం హోరెత్తించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు లెవీకి డివిలియర్స్ జత కలవడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 104 పరుగులు సాధించి సౌతాఫ్రికా భారీ స్కోరుకు బాటలు వేశారు. లెవీ ఔటైనప్పటికీ, సారెల్ ఎర్వీతో కలిసి డివిలియర్స్ జట్టు స్కోరును 200 దాటించాడు.50 for Mr. 360! 🔥💯 AB de Villiers puts on a show with a massive knock! What a way to watch a legend roll back the years. 👑🏏 #wcl #wcl2026 #warofchampions https://t.co/RQlU3YWD4R— World Championship Of Legends (@WclLeague) October 4, 2026ఇదీ చదవండి: 'రోహిత్ నన్ను పూర్తిగా నిరాశపరిచాడు' -
ఆసీస్ ఓపెనర్ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 27 బంతుల్లోనే....
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ లిన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ పూర్తైన అనంతరం మరో ఏడు బంతులు ఎదుర్కొన్న క్రిస్ లిన్ (Chris Lynn).. ఏకంగా 31 పరుగులు రాబట్టాడు.27 బంతుల్లోనే35 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్ మొత్తంగా 27 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 300 స్ట్రైక్‌రేటుతో ఈ మేర పరుగులు రాబట్టాడు. క్రిస్ లిన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా.. ఆస్ట్రేలియా చాంపియన్స్ వెస్టిండీస్ చాంపియన్స్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.డబ్ల్యూసీఎల్-2025లో భాగంగా బుధవారం రాత్రి ఆసీస్- విండీస్ (AUSCH vs WICH) జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.గేల్ మరోసారి విఫలంఓపెనర్ డ్వేన్ స్మిత్ (22), లెండిల్ సిమ్మన్స్ (29), డ్వేన్ బ్రావో (26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ క్రిస్ గేల్ (21) మరోసారి తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడెల్ మూడు వికెట్లు కూల్చగా.. కౌల్టర్-నైల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ బ్రెట్ లీ, స్టీవ్ ఒకెఫె, ఆర్సీ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ చాంపియన్స్ ఆరంభంలోనే షాన్ మార్ష్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్అయితే, మరో ఓపెనర్ క్రిస్ లిన్ (27 బంతుల్లో 81) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. నికిత మిల్లర్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఆటకు తెరపడింది. ఈ క్రమంలో డీ ఆర్సీ షార్ట్ (12 బంతుల్లో 18) వేగంగా ఆడగా.. వికెట్ కీపర్ బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 30)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 9.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.Lynnsanity Strikes in Style 😎Chris Lynn hammered 81 off just 27 balls, peppering the ground with 8 sixes and 6 fours to power Australia Champions to a dominant win 💪#WCL2025 pic.twitter.com/CZUaP0T4Ui— FanCode (@FanCode) July 23, 2025ఈ క్రమంలో ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ చాంపియన్స్‌ను చిత్తు చేసిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఈ మెగా టోర్నీ 2024లో మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా చాంపియన్స్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచింది. చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
చాడ్విక్, పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఇంగ్లండ్ చాంపియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్ చాంపియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పది పరుగుల తేడాతో విండీస్ చేతిలో పరాజయం పాలై.. రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య జట్టు తొలుత పాకిస్తాన్ చాంపియన్స్‌తో తలపడి ఓడిపోయింది. అనంతరం ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో పోటీపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. తాజాగా తమ మూడో టీ20లో ఇంగ్లండ్ వెస్టిండీస్‌ను ఢీకొట్టింది.నార్తాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు.చాడ్విక్కు తోడుగా కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30) కూడా దంచికొట్టాడు. ఇక కెప్టెన్ క్రిస్ గేల్ (19 బంతుల్లో 21) మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజ్మల్ షెహజాద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో సమిత్ పటేల్, ఆర్జే సైడ్‌బాటమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చాంపియన్స్ ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లలో సర్ అలిస్టర్ కుక్ డకౌట్ కాగా.. ఇయాన్ బెల్ (5) కూడా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (0) కూడా చేతులెత్తేయగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కూడా విఫలమయ్యాడు.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ రవి బొపారా (24), సమిత్ పటేల్ (36 బంతుల్లో 52) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరికి మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చాంపియన్స్ తలవంచాల్సి వచ్చింది. ఫిడెల్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించగా.. షనన్ గాబ్రియెల్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. సులేమాన్ బెన్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ చాంపియన్స్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ను ఎదుర్కొన్న విండీస్ బాలౌట్‌లో ఓటమిపాలైంది.Classic Caribbean flair on display 🔥🌴Chadwick Walton's dazzling 83 off 50 - just the kind of 𝕎𝕚𝕟𝕕𝕚𝕖𝕤 𝕗𝕚𝕣𝕖𝕨𝕠𝕣𝕜𝕤 we love 😍#WCL2025 pic.twitter.com/4OIQC3OIKM— FanCode (@FanCode) July 22, 2025


