డేవిడ్ వార్న‌ర్ ఫెయిల్‌.. 119 పరుగులకే ఆసీస్ ఆలౌట్‌ | WCL 2026, West Indies Champions Need 120 Runs To Win From 20 Overs Against Australia Champions, Check Out Score Details | Sakshi
Sakshi News home page

డేవిడ్ వార్న‌ర్ ఫెయిల్‌.. 119 పరుగులకే ఆసీస్ ఆలౌట్‌

Oct 11 2026 6:50 PM | Updated on Oct 11 2026 7:34 PM

West Indies Champions need 120 runs to win from 20 overs against Australia Champions

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026లో షార్జా వేదిక‌గా వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బ్యాట‌ర్లు నిరాశ‌ప‌రిచారు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(1)తో సహా బెన్‌ డంక్‌(13), జో బర్న్స్‌(0) వంటి స్టార్‌ ప్లేయర్లు సైతం విఫలమయ్యారు. దీంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది.

డి ఆర్చీ షార్ట్‌(34), వెల్స్‌(26) రాణించిడంతో ఆసీస్‌ ఆ మాత్రం స్కోర్‌ అయినా సాధించగల్గింది. వెస్టిండీస్‌ బౌలర్లలో కాట్రల్‌ మూడు, ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌, రీఫర్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. ఇప్పుడు కరేబియన్ జట్టుపై కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసేటట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైంది.

తుది జట్లు
వెస్టిండీస్ ఛాంపియన్స్‌: క్రిస్ గేల్(కెప్టెన్), లెండల్ సిమన్స్, చాడ్విక్ వాల్టన్(వికెట్ కీపర్), రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డ్వేన్ బ్రావో, రాయద్ ఎమ్రిట్, డేవ్ మహమ్మద్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాట్రెల్

ఆస్ట్రేలియా ఛాంపియన్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), డి ఆర్సీ షార్ట్, జో బర్న్స్, బెన్ డంక్(వికెట్ కీపర్), కాలమ్ ఫెర్గూసన్, జొనాథన్ వెల్స్, మైఖేల్ బీర్, నాథన్ కౌల్టర్-నైల్, బెన్ లాఫ్లిన్, బెన్ హిల్ఫెన్‌హాస్, ఫవాద్ అహ్మద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement