డ్వేన్‌ బ్రావో క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. నోరెళ్ల‌బెట్టిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ | Dwayne Bravo Catch Leaves Faf du Plessis Awestruck-WCL 2026 | Sakshi
Sakshi News home page

డ్వేన్‌ బ్రావో క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. నోరెళ్ల‌బెట్టిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌

Oct 4 2026 9:22 PM | Updated on Oct 4 2026 9:22 PM

Dwayne Bravo Catch Leaves Faf du Plessis Awestruck-WCL 2026

Photo Credit: Twitter

విన్యాసాల‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో మ‌రోసారి నిరూపించాడు. వెస్టిండీస్ చాంపియ‌న్స్ త‌ర‌ఫున వ‌రల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లీగ్ (డ‌బ్ల్యూసీఎల్ 2026)లో ఆడుతున్న బ్రావో.. సౌతాఫ్రికా చాంపియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో క‌ళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 

42 ఏళ్ల వ‌య‌సులో బ్రావో అమాంతం గాల్లోకి ఎగిరి స్ట‌న్నింగ్ క్యాచ్ తీసుకోవ‌డంతో సౌతాఫ్రికా స్టార్ ఫాప్ డుప్లెసిస్ నోరెళ్ల‌బెట్టాడు. డుప్లెసిస్ 14 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు బ్రావో ఈ విన్యాసం ప్ర‌ద‌ర్శించాడు. లాంగాన్ దిశ‌గా డుప్లెసిస్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న బ్రావో వెన‌క్కి ప‌రిగెత్తి. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకోవ‌డం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన‌ సౌతాఫ్రికా చాంపియ‌న్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ఓపెన‌ర్ రిచ‌ర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) భారీ అర్థ‌శ‌త‌కాల‌తో విధ్వంసం సృష్టించారు. 

వీరిద్ద‌రి బీభ‌త్సం ధాటికి సౌతాఫ్రికా చాంపియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 242 ప‌రుగులు చేసింది. చివ‌ర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియ‌న్స్ బౌల‌ర్ల‌లో డేవ్ మొహ‌మ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, ఫిడెల్ ఎడ్‌వ‌ర్డ్స్‌, రెయాడ్ ఎమ్రిట్‌, డ్వేన్ బ్రావో త‌లా ఒక వికెట్ తీశారు.

ఇదీ చదవండి: కెప్టెన్‌గా రుతురాజ్‌.. మ్యాచ్ టైమింగ్స్‌, లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement