ర‌షీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే | Rashid Khan Achieve Embarrassing Feat, Becomes First Bowler In The IPL History | Sakshi
Sakshi News home page

IPL 2025: ర‌షీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

May 31 2025 1:26 PM | Updated on May 31 2025 1:38 PM

Rashid Khan Achieve Embarrassing Feat, Becomes First Bowler In The IPL History

PC: BCCI/IPL.com

ర‌షీద్ ఖాన్‌.. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిగా పేరు గాంచాడు. త‌న స్పిన్ మ‌యాజాలంతో ప్ర‌త్య‌ర్ధుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టే  సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్‌-2025లో మాత్రం రషీద్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్న‌ర్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ప్ర‌తీ మ్యాచ్‌లోనూ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటూ జ‌ట్టుకు భారంగా మారాడు. శుక్ర‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల‌లో కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా 31 ప‌రుగులు ఇచ్చాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్‌.. 9.34 ఏకాన‌మితో కేవ‌లం 9 వికెట్లు మాత్రమే ప‌డ‌గొట్టాడు.

ర‌షీద్ ఖాన్ చెత్త రికార్డు..
ఈ క్ర‌మంలో ర‌షీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్‌గా ర‌షీద్ ఆప్ర‌తిష్ట‌ను మూట‌క‌ట్టుకున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌షీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మహ్మ‌ద్ సిరాజ్ పేరిట ఉండేది. 

2022 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తూ సిరాజ్ 31 సిక్స‌ర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు ఇచ్చిన ర‌షీద్‌.. సిరాజ్‌ను అధిగ‌మించాడు. వీరిద్ద‌రి త‌ర్వాత స్ధానాల్లో చాహ‌ల్‌(30), హ‌స‌రంగా(30),బ్రావో ఉన్నారు. కాగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ఓట‌మి పాలైంది.
చదవండి: అదే మా కొంప‌ముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement