Photo Credit: Twitter
యూఏఈ వేదికగా జరిగిన వన్డే ట్రై సిరీస్ విజేతగా అఫ్గానిస్తాన్ నిలిచింది. జింబాబ్వే, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఈ ట్రై సిరీస్ ఆడాయి. శుక్రవారం జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రహ్మత్ షాకు ఇది వరుసగా ఏడో విజయం కావడం విశేషం.
అక్టోబర్ 27 నుంచి అఫ్గానిస్తాన్, జింబాబ్వేల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సికందర్ రజా (68) అర్థసెంచరీతో రాణించగా, రెయాన్ బర్ల్ (31) పర్వాలేదనిపించగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, ఫజల్లా ఫరుకీ, బిలాల్ సమీ, మొహమ్మద్ నబీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గానిస్తాన్ 34.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రన్ (70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించగా, కెప్టెన్ రహ్మత్ షా (43), రహమనుల్లా గుర్బాజ్ (36) రాణించారు.
జింబాబ్వే బౌలర్లలో నైమూరీ రెండు వికెట్లు, వెస్లే మదెవెరె ఒక వికెట్ తీశారు. ఇబ్రహీం జద్రన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకోగా, సిరీస్‌లో 11 వికెట్లతో రాణించిన రషీద్ ఖాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.
AFGHANATALAN ARE THE CHAMPIONS! 🏆 #AfghanAtalan delivered a commanding batting performance to defeat Zimbabwe by seven wickets in the final and lift the title of the Etisalat ACB ODI Tri-Nation Series 2026, powered by SuperCola! 🙌💙 #AFGvZIM | #GloriousNationVictoriousTeam | #ThreeTeamsOneSpirit
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2026
ఇదీ చదవండి: ముగ్గురు భారత బ్యాటర్లు డకౌట్.. 113 పరుగులకే ఆలౌట్


