బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ | Parvinder Awana appointed chairperson of Junior Selection Committee | Sakshi
Sakshi News home page

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్

Oct 23 2026 9:30 PM | Updated on Oct 23 2026 9:30 PM

Parvinder Awana appointed chairperson of Junior Selection Committee

బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ పర్విందర్ అవానా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ.. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం అవానా పేరును ఈ చీఫ్ సెలక్టర్ పదవికి సిఫార్సు చేసింది. 

పర్విందర్ అవానాతో పాటు క్రిష్ణ దాస్, రాకేష్ పటేల్, అర్జున్ యాదవ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా బీసీసీఐ నియమించింది. త్వరలోనే ఐదో సభ్యుడిని కూడా ఎంపిక చేయనున్నట్లు క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

అవనా ట్రాక్ రికార్డు ఇదే
పర్విందర్ అవనా భారత తరపున కేవలం 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినప్పటికి.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం అతడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఢిల్లీ తరపున  62 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు తీశాడు.  ఇండియా-ఎ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున కూడా ఆడాడు.

రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ వైపు మళ్లిన అవానా.. ఢిల్లీ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు హెడ్‌కోచ్‌గా తన సేవలు అందించాడు. అలాగే ఇండియా అండర్-19 జట్టుతో పాటు బీసీసీఐ/సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లలోనూ బాధ్యతలు నిర్వహించాడు.
చదవండి: గంభీర్‌పై విమర్శలు సరికావు.. వ్యూస్ కోసం అలా చేయొద్దు: పఠాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement