ముగ్గురు భారత బ్యాటర్లు డకౌట్‌.. 113 ప‌రుగుల‌కే ఆలౌట్‌ | KL Rahul-Duck-Batting Failure-INDA-113-Allout Vs NZA-1st-Unofficial Test | Sakshi
Sakshi News home page

ముగ్గురు భారత బ్యాటర్లు డకౌట్‌.. 113 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Oct 24 2026 7:18 AM | Updated on Oct 24 2026 7:40 AM

KL Rahul-Duck-Batting Failure-INDA-113-Allout Vs NZA-1st-Unofficial Test

Photo Credit: Twitter

న్యూజిలాండ్-ఏతో జ‌రుగుతున్న తొలి అన‌ధికారిక టెస్టులో భార‌త‌-ఏ జ‌ట్టు పూర్తిగా విఫ‌ల‌మైంది. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు స‌న్నాహ‌కంగా జ‌రుగుతున్న టెస్టులో భార‌త బ్యాట‌ర్లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 39.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ డ‌కౌట్‌గా వెనుదిర‌గ్గా, మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (17) త్వ‌ర‌గానే పెవిలియ‌న్ చేరాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన దేవ‌దత్ ప‌డిక్క‌ల్ (32) ప‌ర్వాలేద‌నిపించాడు. మిడిలార్డ‌ర్‌లో సాయి సుద‌ర్శ‌న్ డ‌కౌటయ్యి నిరాశ‌ప‌రచ‌గా, కీప‌ర్ ధ్రువ్ జురేల్ కూడా ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా డకౌట్‌ కావడం గమనార్హం.

లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో య‌శ్ రాథోడ్ (44 నాటౌట్‌) కాస్త ఓపిక ప్ర‌ద‌ర్శించి ఆడ‌డంతో భార‌త‌-ఏ జ‌ట్టు క‌నీసం 100 ప‌రుగుల మార్క్‌ను దాట‌గ‌లిగింది. కివీస్ బౌల‌ర్ల‌లో సిమోన్ నీ 4 వికెట్లతో చెల‌రేగ‌గా, జాక్ గిబ్స‌న్ మూడు వికెట్లు, ఫ్రేస‌ర్ షీట్‌, క్రిస్టియ‌న్ క్లార్క్‌లు చెరొక వికెట్ తీశారు.

ఒక దశలో 81 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్ కనీసం వంద పరుగుల మార్క్ అయినా దాటుతుందా అనే అనుమానం వచ్చింది. ఈ దశలో యశ్‌రాథోడ్ టెయిలెండర్లను నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉంచి తాను ఎక్కువసేపు స్ట్రైక్ తీసుకొని పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 39 ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన యశ్ రాథోడ్ భారత్‌ను వంద దాటించాడు. అయితే మరుసటి ఓవర్లోనే ముకేశ్ చౌదరీ వెనుదిరగడంతో భారత-ఏ జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇలా అయితే ఎలా..
కివీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ అనధికారిక టెస్టులో భారత బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. ముఖ్యంగా టెస్టు జట్టులో కీలకంగా ఉన్న రాహుల్‌, సాయి సుదర్శన్‌, యశస్వి జైస్వాల్‌, పడిక్కల్‌, ధ్రువ్ జురేల్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా రాణిస్తారనుకున్న కేఎల్ రాహుల్‌, సాయి సుదర్శన్‌, వాషింగ్టన్ సుందర్‌లు డకౌటయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. మరి బౌలర్లు ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి.

 

ఇదీ చదవండి: వైభవ్‌ ఆటపైనే అందరి దృష్టి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement