
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది.
ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.
క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..
టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు.
ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:
క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్
ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్
క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్
ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్