
6 వికెట్లతో సూపర్ జెయింట్స్‌పై హైదరాబాద్ గెలుపు
206 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదన
ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్
చెలరేగిన అభిషేక్ శర్మ, క్లాసెన్
మార్‡్ష, మార్క్‌రమ్ మెరుపులు వృథా
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు),
మార్క్‌రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు.
సెంచరీ భాగస్వామ్యం
మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్‌రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్‌రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్‌రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.
మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్‌రమ్‌కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు.
ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్‌రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్‌రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు.
అభిషేక్ అదరహో
రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది.
మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్‌రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199.
బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206.
వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195.
బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్‌రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1.