
ఐపీఎల్-2025 సీజన్‌ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
సీఎస్‌కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించాయి.