అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి ప్లేయర్‌గా..
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్‌లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో కమల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్‌లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్‌ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్‌లో కొనసాగుతున్నాడు.
కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!


