వైభ‌వ్ సూర్య‌వంశీ అట్ట‌ర్‌ ప్లాప్‌.. | Vaibhav Suryavanshi Flops In Maiden Under-19 WC Outing | Sakshi
Sakshi News home page

IND vs USA: వైభ‌వ్ సూర్య‌వంశీ అట్ట‌ర్‌ ప్లాప్‌..

Jan 15 2026 6:13 PM | Updated on Jan 15 2026 8:01 PM

Vaibhav Suryavanshi Flops In Maiden Under-19 WC Outing

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ టోర్నీలో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యవంశీ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

దీంతో స్వల్ప లక్ష్య  చేధనలో వైభవ్ తనదైన శైలిలో విరుచుకుపడతాడని అంతా భావించారు. కానీ 14 ఏళ్ల వైభవ్ మాత్రం తుస్సుమన్పించాడు. 2 పరుగులు చేసిన సూర్యవంశీ.. రిత్విక్ అప్పిడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్‌లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.

వర్షం అటంకి..
కాగా భారత్ లక్ష్య చేధనకు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4 ఓవర్లలో భారత్ స్కోర్ 21/1 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. క్రీజులో అయూశ్ మాత్రే(15), త్రివేది(2) ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు  దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement