ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum – WEF) 2026 సమావేశాలకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికైంది.
ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని “Telangana Rising” ప్రతినిధుల బృందం పాల్గొని రాష్ట్రాన్ని గ్లోబల్ పెట్టుబడిదారుల ముందు ప్రోత్సహిస్తోంది.
ఈ బృందం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తూ, వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతోంది.
తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అవకాశాలను వివరించి, అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ ప్రతినిధుల బృందంలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమవడం విశేషం. ఆయన హాజరు “Telangana Rising” బృందానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినీ రంగంలో చిరుకు ఉన్న గ్లోబల్ గుర్తింపు, ప్రజాదరణ పెట్టుబడిదారుల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.


