breaking news
Davos
-
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్‌లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్‌ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్‌కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్‌లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్‌పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్‌లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్‌ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్‌లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్‌ల్యాండ్‌తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్‌ల్యాండ్‌ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్‌కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్‌లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్‌లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్‌ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్‌ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్‌ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సునీల్ మిత్తల్ (వ్యాపార కుబేరుడు) రాయని డైరీ
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్‌ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్‌లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు. ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్మేన్నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్‌ని కూడా! ట్రంప్ ట్యారిఫ్ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం! గాజాను గొప్ప రియల్ ఎస్టేట్‌గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్‌లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్‌ల్యాండ్‌ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు? ఎకనమిక్ ఫోరమ్‌లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్‌ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు! -
‘రష్యా సుంకం’ రద్దు?
వాషింగ్టన్: అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల విషయంలో భారత్‌కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్‌లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్‌పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్‌ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్ చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్ కొనుగోలు చేయడంపై బెసెంట్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్‌ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. ఆగస్టు నుంచీ రగడ భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది. -
దావోస్‌లో బిలియనీర్ల నోరు ఊరిస్తున్న కిచిడీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026లో గ్లోబల్ బిజినెస్ లీడర్లు, ఆర్థికవేత్తలు, భారత నాయకులు తమ ప్రత్యేకతను చాటుకుంనేందుకు, ఒప్పందాలు, పెట్టుబడులు అంటూ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు కిక్కిరిసిన కాన్ఫరెన్స్ హాళ్లలో చిక్కటి చలికాలంలో అందిస్తున్న సమోసాలు, కరకర లాడే పకోడీలు ముఖ్యంగా వేడి వేడి 'కిచిడీ' అత్యంత ఆదరణ పొందుతుండటం విశేషం.వేదిక సమీపంలోని ఫుడ్ కోర్టులో భారతదేశానికి చెందిన ఈ పౌష్టికాహార వంటకం ప్రపంచ నాయకులు, ప్రతినిధుల నోరు ఊరిస్తోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1000 మందికి ఉచితంగా వడ్డిస్తూ, భారతీయ రుచులకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చి పెట్టింది. కమ్మని వాసన, రుచికీ రుచితో ఈ కంఫర్ట్ డిష్ ప్రశంసలు అందుకుంటోంది. దీనికోసం ఎంతో ఓపికగా క్యూలో వేచి ఉండటం విశేషం.గడ్డకట్టే మంచుతో నిండిన దావోస్ వీధుల్లో వేడి భారతీయ భోజనం (కిచిడీ, సమోసాలు, పకోడాలు) ఇక్కడకు వచ్చే వారికి సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ స్టాల్‌ను సందర్శించి, కిచిడీ రుచి చూసి దాని పోషక విలువలను ప్రశంసించారు. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా దావోస్‌లో ఇండియన్ ఫుడ్ ట్రక్ చిత్రాన్ని పంచుకున్నారు. ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్ VIDEO | Davos: A visitor praising Indian cuisine, especially khichdi, said, “I love Indian food. I love this dish. I’m very happy because I was extremely hungry.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/pe3TUR3ofl— Press Trust of India (@PTI_News) January 23, 2026దావోస్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతుండటంతో, వరుసగా సమావేశాల మధ్య వేడిగా ఉండే కిచ్డీ తమకు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుందంటున్నారు. ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు వేడి వేడి కిచిడీ బావుందని జపాన్ ప్రతినిధి చెప్పారు. ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారతీయ సాంస్కృతిక , ఆర్థిక పాదముద్రకు ఇది సంకేతమంటూ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లారీ ఫింక్తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.సమాజానికి ముప్పుఅయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మదావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
23 లక్షల కోట్లు ఉద్యోగాలా..! మతి ఉందా.. లేదా..
-
‘ల్యాండ్ టైట్లింగ్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలకు దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తద్వారా ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. జగన్‌పై కక్షతో చంద్రబాబు విపరీతంగా దుష్ప్రచారం చేసి, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయడం తెలిసిందే. అయితే ల్యాండ్ టైట్లింగ్ అన్నది ఆదర్శనీయమని..దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైంది. కేవలం వృద్ధి రేటు మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణం కూడా తక్కువగా సింగిల్ డిజిట్‌లోనే ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశం’ అని గీతా గోపీనాథ్ అన్నారు. అయితే భూసేకరణ, డీ రెగ్యులేషన్ వెనక్కు నెడుతున్నాయని ఆమె గతంలో చెప్పిన విషయాలను వ్యాఖ్యాత ఉటంకించగా, ఆమె స్పందిస్తూ ‘భూసేకరణ, సమస్యలు గందరగోళంగా ఉన్నాయనడం కంటే అది చాలా పెద్ద సమస్య అనడం కరెక్ట్. ఇది వృద్ధికి, తయారీ రంగానికి ఒక పెద్ద సవాలు. అయితే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ వినియోగం, భూ సంబంధిత విషయాల్లో సృజనాత్మకమైన పద్ధతులను అనుసరిస్తూ మంచి పనితీరు కనబరుస్తోందని నేను భావిస్తున్నాను. ల్యాండ్ టైట్లింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం’ అని స్పష్టం చేశారు. విస్తృత అధ్యయనం తర్వాతే అమలు యత్నం గీతా గోపీనాథ్ చెప్పిన అంశాలు జగన్ హయాంలో జరిగినవే. ఆమె ఉదహరించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే భూముల వ్యవస్థ సమూలంగా మారిపోతుందని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అందుకే దానిపై విస్తృతమైన అధ్యయనం చేశాక దేశంలోనే తొలిసారిగా వైఎస్ జగన్ దాన్ని ఏపీలో అమలు చేసేందుకు చట్టాన్ని చేశారు. కేంద్రం ఆమోదం కూడా తీసుకున్నాక అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టం వస్తే మీ భూములు పోతాయని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటాడని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. దానిపై దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. ఎల్లో మీడియా పత్రికలో ఒక ఫుల్ పేజీ వ్యతిరేక ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వడాన్ని బట్టి ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర గతిని మార్చే చట్టాన్ని ఎన్నికల్లో వివాదాస్పదంగా మార్చిన చంద్రబాబు.. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తించారు. అప్పటికి ఆ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా అది అమలై పోతున్నట్లు, భూములు పోయినట్లు ప్రచారం చేసి తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాలే ప్రధానమని దేశానికే రోల్ మోడల్‌గా మారిన చట్టాన్ని రద్దు చేశారు. అయితే దాంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను మాత్రం కొనసాగిస్తూ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రీ సర్వే క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దావోస్‌లో గీతా గోపీనాథ్ చేసిన వ్యాఖ్యలు జగన్ అమలు చేసిన విప్లవాత్మకమైన భూ సంస్కరణలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. చంద్రబాబు అదే దావోస్‌కు వెళ్లి తన పాలన గొప్పగా జరుగుతున్నట్లు ఎన్ని మైకుల్లో ఉదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ జగన్ ఎప్పుడూ దావోస్‌కు వెళ్లకపోయినా, ఆయన చేసిన మంచి పనులు, భూ సంస్కరణలు అక్కడ చర్చకు వచ్చాయి. దీన్నిబట్టి ఎవరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం మంచి చట్టాలు, మంచి పనుల్ని చంద్రబాబు రద్దు చేసినా.. వాటి ఫలితం, ప్రభావం ఎలా ఉంటుందో దావోస్ వేదికగా బయట పడింది. చంద్రబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొందుదామనుకున్న క్రెడిట్‌ను జగన్.. తన హయాంలో చేసిన మంచి పనుల ద్వారా సాధించడం గమనార్హం. -
ఈ మండలి శాంతికేనా?!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. గాజాలో ‘శాంతి నెలకొల్పడమే’ లక్ష్యంగా 19 సభ్యదేశాలతో ‘శాంతిమండలి’ ఏర్పాటై నట్టు గురువారం ప్రకటించారు. అర్జెంటీనా మొదలుకొని వియత్నాం, పాకిస్తాన్ వరకూ పోటీ పడి ఇందులో సభ్యత్వం తీసుకోగా, ఈ అర్థరహిత విన్యాసానికి మన దేశందూరంగా ఉండి మంచి పని చేసింది. అమెరికా చిరకాల సన్నిహిత దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లొవేనియాలు ఇందులో చేరబోమని ప్రకటిస్తే, మనతోపాటు రష్యా, చైనా, జర్మనీ, యూరోపియన్ యూనియన్(ఈయూ), సింగపూర్ వగైరాలు తటస్థంగా ఉండి పోయాయి. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెండేళ్ల పాటు గాజాలో నరమేధం సాగించిన ఇజ్రాయెల్ సైతం ‘తగుదునమ్మా’ అంటూఇందులో చేరటం కొసమెరుపు. ‘నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు గనుక, ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ప్రకటించిన ట్రంప్, వారం తిరిగేసరికల్లా అంత ర్జాతీయ శాంతిదూత అవతారం ఎత్తడం ఒక వైచిత్రి.భద్రతామండలి తన 70 ఏళ్ల చరిత్రకు కళంకం తెచ్చుకునే విధంగా గత నవంబర్‌లో గాజా శాంతికి అగ్రరాజ్యాలు చొరవచూపాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ ఈ చర్యకు సాహసించారు. రష్యా, చైనాలు వీటో చేసివుంటే ఆ తీర్మానానికి ఆమోదముద్ర పడేదికాదు. కానీ గైర్హాజరుతో సరిపెట్టి ఈ వైపరీత్యానికి వారూ తోడ్పడ్డారు. దురాక్రమణలు, నరమేధాలు, ఊచకోతలు, సైనిక కుట్రలు తదితరాలను ఎదుర్కొనటానికి అంతర్జాతీయంగా ఆమోదించిన అనేక చట్టాలున్నాయి. వాటిల్లో ఏ చట్టాలు విఫలమైనాయని, ఎలాంటి ప్రయత్నాలు చేసిందని నవంబర్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందో భద్రతామండలి చెప్పాలి. గాజాలో అకారణంగా, అన్యాయంగా వేలాదిమందిని హతమారుస్తుంటే, విధ్వంసకాండను కొనసాగిస్తుంటేకంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా, ఆ సంస్థ పక్షాన జరిగిన యత్నాలేమీ లేవు. కానీ అకృత్యాలకు పాల్పడినవారికే దాన్ని ఉద్ధరించేందుకు లైసెన్సునిచ్చింది. ఈ‘శాంతిమండలి’ అమెరికా కోసం కాదు... ఏకంగా ప్రపంచ ఉద్ధరణకేనని దావోస్ లోట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో శాంతి నెలకొల్పగానే అది ప్రపంచంలోని ఇతర ఘర్షణలపై దృష్టిసారిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి ఎంతగా విఫలమైనా, వాటికి ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధం మానవాళికి తెచ్చిపెట్టిన లాంటి ఉత్పాతం భవిష్యత్తులో ఎన్నడూ సంభవించనీయబోమని వాగ్దానం చేస్తూ అవి ఆవిర్భవించాయి. కానీ ఇప్పుడు పుట్టుకొచ్చిన ‘శాంతిమండలి’ ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జేర్డ్ కుష్నెర్ మానసపుత్రిక. 3,000 కోట్ల డాలర్ల వ్యయంతో గాజా సాగరతీరాన కళ్లు చెదిరే భవంతులు, రిక్రియేషన్ క్లబ్‌లు, క్యాసినోలు నిర్మించాలని ఆయనగారి తపన. తరతరాలుగా పేదరికంలో మగ్గిన పాలస్తీనియన్లు ఈ అభివృద్ధి చూసి మూర్ఛపోతారని ట్రంప్ చెబుతున్నారు. శాంతిమండలిలో చేరిన నెతన్యాహూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. స్విట్జర్లాండ్‌లో అడుగుపెడితే అరెస్టవుతానని తెలిసి ఈ సంబరానికి దూరంగా ఉండిపోయారు. నిర్మానుష్యమైన తూర్పు జెరూసలేంలోని ఐక్యరాజ్యసమితి సహాయసంస్థ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయించిన మర్నాడే ఆయన ‘శాంతిమండలి’లో చేరటం గమనార్హం. ఇంతవరకూ ట్రంప్‌కు అంటిన మరకలు ఇకపై శాంతిమండలి సభ్యులకూ తప్పవు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి అపహరించటం, అక్కడి ముడిచమురుపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం, గ్రీన్‌ల్యాండ్‌ను కాజేయాలని ఆత్రపడటం, మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించటం, ప్రపంచం నలుమూలలా సైనిక స్థావరాల ఏర్పాటు యత్నాలు వంటి ట్రంప్ అనాలోచిత చర్యలకూ, ఆయన బెదిరింపు ధోరణు లకూ ఇకపై ఈ మండలి సైతం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సమితికి సంబంధించిన కర్తవ్యాలు శాంతిమండలి స్వీకరిస్తుందని ట్రంప్ చెప్పటంతోపాటు భవిష్యత్తులో సమితికి కాలం చెల్లుతుందనటాన్ని గమనిస్తే ఇదంతా చివరకు ఎటుపోతుందో... ఏమవు తుందో సులభంగానే గ్రహించవచ్చు. -
వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు ప్రశంసలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం వైఎస్ జగన్ కృషి చేశారని డిబేట్లో ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అభినందించారు. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటలింగ్ కోసం కృషి చేసిందని గీతా కితాబునిచ్చారు.చాలా మంచి భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేసింది.. చాలా క్రియేటివ్ గా చేసిందన్న గీతా గోపినాథ్.. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలు అవలంభించారని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం చర్చా గోష్టిలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలోనే గీతా గోపినాథ వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయగా.. వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ప్రశంసలు రావడంతో చంద్రబాబు అండ్ కో అభాసుపాలైంది. -
కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్‌గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.మాక్రాన్ ఉపయోగించిన సన్‌గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై మస్క్ సెటైర్లు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్‌తో నవ్వులు పూయించారు. ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC— DogeDesigner (@cb_doge) January 22, 2026 -
త్రైపాక్షిక చర్చలు మొదలెడతాం
దావోస్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు వేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో గురువారం జెలెన్స్కీ ప్రసంగించారు. ‘‘యుద్ధం ముగింపే లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. అంతకుముందు గురువారమే అమెరికా ప్రతినిధి బృందంతో మేం మంతనాలు జరుపుతాం. మా చర్చల పురోగతిని రష్యాకు వివరించేందుకు మరో అమెరికా బృందం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ తర్వాత రష్యా బృందంతో కలిసి అమెరికా, ఉక్రెయిన్ బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిర్సేట్లో త్రైపాక్షిక చర్చలు జరుపుతాయి. యుద్ధం పరిసమాప్తి కోసం ఉక్రెయిన్ మాత్రమేకాదు రష్యా సైతం కొన్నిసార్లు త్యాగాలుచేయాల్సి ఉంటుంది. అందుకు రష్యా సిద్ధపడాలి. చర్చలనేవే లేకుండా ఉండటం కంటే ఏదోరకమైన చర్చలకు ప్రయత్నించడం మంచిదే కదా. యుద్ధం ముగిసిపోయేలా మాకు దేవుడి దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ‘‘ గత ఏడాది ఇదే వేదికపై ఐరోపా సాయం కోసం వేడుకున్నా. ఆనాడు ఏం మాట్లాడానో అవే మాట్లాడాల్సి వస్తోంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ‘గ్రౌండ్‌హాగ్ డే’ సినిమాలో పాత్రలాగా ఒకే రోజు మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది’’ అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తంచేశారు.ట్రంప్‌తో జెలెన్స్కీ కీలక చర్చలువరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ ట్రంప్‌తో భేటీ ఉక్రెయిన్‌కు లబ్ధి చేకూరేలా సాగింది. మేమిద్దరం నేడో, రేపో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవుతాం. ఆ తర్వాతే త్రైపాక్షిక భేటీ జరగనుంది’’ అని అన్నారు. ట్రంప్, జెలెన్స్కీ భేటీ వివరాలను పుతిన్‌కు వివరించేందుకు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోకు వెళ్లనున్నారు. పుతిన్‌తో అమెరికా బృందం భేటీని ట్రంప్ సైతం ్ర«ధువీకరించారు. ఎలాగైనాసరే ఈసారి చర్చలు విజయవంతంచేసి యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన ట్రంప్‌కు ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ట్రంప్ హెలికాప్టర్ ఎగరలేకపోయింది. దాంతో రోడ్డు మార్గంలో ట్రంప్ జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో అమెరికాకు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. -
ఫాలో అప్ భేటీపై సానుకూలత
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు కొనసాగింపుగా ఏటా జూలైలో హైదరాబాద్‌లో ‘ఫాలో అప్’సమావేశం నిర్వహించాలని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనపై సానుకూల స్పందన వ్యక్తమయ్యింది. దావోస్ సదస్సులో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ‘ఫాలో అప్’సమావేశం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ స్పందించారు. గురువారం తెలంగాణ పెవిలియన్‌లో జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు ఫాలో అప్ సదస్సు నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.ఫాలో అప్ సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగ అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే తన ఆలోచనను సీఎం పంచుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు అందాయని, సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జర్గెన్స్ తెలిపారు.చైనా లో ప్రతి ఏడాదీ ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఫాలో అప్ సమావేశ నిర్వహణకు ఆసక్తి చూపుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్ తదితరాలను ఆయన ప్రశంసించారు. ‘తెలంగాణ రైజింగ్’లో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత అధునాతన టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ వివరించారు. నైపుణ్యాభివృద్ధితో పాటు క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. కాగా హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా–2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండ్రస్టియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ పేరిట అమలు చేస్తున్న మూడు జోన్ల విధానం, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఐటీ, ఔషధ రంగాల్లో హైదరాబాద్ అనుకూలతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. -
ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను దేశంలో ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. యూపీసీ వోల్ట్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఈ మేరకు యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై జరిపిన చర్చల ఫలితంగా ఈ ఎంవోయూ కుదిరింది.నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ భాగస్వామ్యంతో యూపీసీ వోల్ట్ సంస్థ ఆవిర్భవించింది. కాగా ఎంవోయూ ప్రకారం ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు దానికి అవసరమయ్యే విద్యుత్ కోసం 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సంస్థ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శంషాబాద్, గాగిల్లాపూర్‌లో ‘స్నైడర్’విస్తరణరాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా’రూ.623 కోట్లతో శంషాబాద్, గాగిల్లాపూర్‌లో తమ యూనిట్లను విస్తరించనుంది. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో ఆæ కంపెనీ సీఈవో దీపక్ శర్మ ఈ మేరకు ప్రకటన చేశారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ‘ఐనాక్స్’తో మంత్రుల భేటీతెలంగాణను కాలుష్య రహి త మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశ మయ్యారు. సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ: సీఎం రేవంత్ కృత్రిమ మేధస్సు (ఏఐ)లో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాల కోసం నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దావోస్ వేదికగా ప్రారంభించిన తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్)కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జరిపిన చర్చల ఫలితంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ⇒ బ్రిటన్‌కు చెందిన విద్యా, పబ్లిíÙంగ్ సంస్థ పియర్సన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటు కానున్న ‘గ్లోబల్ ఏఐ అకాడమీ’కి పియర్సన్ సహకారం అందిస్తుంది. ⇒ జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ‘ఏఐ కోల్యాబ్ సంస్థ’తో కుదిరిన మరో ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ⇒ దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో కుదిరిన ఎంఓయూ ద్వారా రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి అవకాశాలు అన్వేíÙంచనున్నారు.గోద్రెజ్ చైర్మన్‌తో మంత్రులు భేటీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దావోస్‌లో సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగులో ఏఐ సాంకేతికత వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రెజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకా శాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా చర్చించారు. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా నాదిర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. -
కొలువైన ట్రంప్ శాంతి మండలి
దావోస్/న్యూఢిల్లీ: మాటలతోనే పెనుకుంపట్లు రాజేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడి అవతారమెత్తి ప్రపంచ యవనికపై కొత్త కూటమిని కొలువుతీర్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగరంలో 19 దేశాల అగ్రనేతల సమక్షంలో బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో సంబంధిత పత్రంపై ట్రంప్ సంతకం చేసి కొత్త కూటమిని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా తన కనుసన్నల్లో పనిచేసేలా గాజా పునర్నిర్మాణ, అభివృద్ధి మాటున శాంతి మండలిని ఏర్పాటుచేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ‘‘ శాంతి మండలిలో భాగస్వాములుగా ఉండేందుకు ప్రతి దేశం అమితాసక్తి కనబరుస్తోంది. ఇవేగాక మరెన్నో దేశాలతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తా. ఇప్పుడిప్పుడే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా, పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఏడాది క్రితం యుద్ధాలతో ప్రపంచం అగ్నిగోళంగా ఉండేది. ఇది చాలా మందికి తెలీదు. సమకాలీన పరిస్థితుల పర్యవసానంగా ఏర్పడిన ఈ ‘శాంతి మండలి’ అంతర్జాతీయ కూటముల్లో ఒకటిగా గొప్పదిగా ఉండబోతోంది. శాంతి మండలి అనేది ప్రపంచానికి చాలాచాలా ప్రత్యేకమైంది. ఐక్యరాజ్యసమితిలో ఎంతో సత్తా ఉంది. ఒక పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధమేకాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ముగింపు కోసం ఐరాసతో కలిసి పనిచేస్తా. ఐరాస, కొత్త శాంతి మండలి కలిసి పనిచేస్తే అది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా పశ్చిమాసియాకు కొత్త రోజులొస్తాయి. గాజా యుద్ధం దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా వాటిని మనం ఆపేయబోతున్నాం. వాగ్దానం చేసినట్లు హమాస్ వాళ్లు ఆయుధాలు విడనాడాలి. ఆయుధాలను త్యజించని రోజున అదే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.35 దేశాలతో మొదలు..35 దేశాలతో శాంతి మండలిని ఆరంభిస్తున్నామని ట్రంప్ తెలిపారు. వేదికపై ఆసీనులైన పలువురు అగ్రనేతలను ట్రంప్ పేరుపేరున పొగిడారు. తనతో కలిసి ముందడుగువేస్తున్నందుకు అభినందించారు. ‘‘మేమంతా ఎంతో కీలకమైన పనులు చేయబోతున్నాం. ఇంతటి ఘనకార్యాలు చేయడానికి ఇంతకు మించిన వేదిక మరోటి లేదు. వ్యవస్థాపక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. గర్వంగానూ ఉంది’’ అని ట్రంప్ అన్నారు. శాంతి మండలి డాక్యుమెంట్‌పై ట్రంప్ సంతకంచేశాక అక్కడి 19 దేశాల అగ్రనేతలను సంతకాలుచేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం కార్యక్రమంలో పాల్గొని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముష్కరులను ముద్దుచేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి అశాంతిని రాజేసే పాకిస్తాన్.. శాంతికాముక∙బోర్డ్‌లో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాలు శాంతి మండలిలో చేరేందుకు ఆసక్తి చూపించగా ఐరోపా సమాఖ్యలోని కొన్ని సభ్యదేశాలు నిరాకరించాయి. ఆహ్వానం అందుకున్నా ఇంకొన్ని దేశాలు తమ వైఖరిని బయటపెట్టలేదు. భారత్ సైతం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉండిపోయింది.నేనింకా రియల్ ఎస్టేట్ మనిషినే..గాజా పునర్నిర్మాణలో భాగంగా గాజాను సము ద్రతీర ప్రాంతాలకు, రవాణా, ఇంధన మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అన్నారు. ఇదే వేదికపై ఆయన నూతన గాజా ఇలా ఉండబోతోందంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘ సముద్రతీర ప్రాంతం ఎంత బాగుందో చూడండి. బీచ్‌లతో అలరారుతున్న గాజా స్ట్రిప్‌లో ఆకాశహ ర్మ్యామ్యలను నిర్మించబోతున్నాం. తీరప్రాంత పర్యాటకం ఊపందుకోబోతోంది. ఇన్నాళ్లూ ఇదే ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గిపోయిన పాలస్తీనియన్లు మేం చేసే అభివృద్ధి తర్వాత అద్భుతజీవనం కొనసాగిస్తారు. భవిష్యత్‌లో సాక్షాత్కారం కాబోయే ఈ భవంతులను చూస్తుంటే నాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి మేల్కొంటున్నాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ వ్యక్తినే’’ అని ట్రంప్ అన్నారు.మండలిలో చేరతామన్న దేశాలుఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోసమ్మతి తెలపని దేశాలు..ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్తటస్థ వైఖరితో ఉన్న దేశాలురష్యా, భారత్, సింగపూర్, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు అపూర్వ స్పందన
దావోస్: దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... యువతకు ఏఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు.ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జార్జ్న్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది.అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC)తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్‌ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్లపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. -
ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు
-
అదో ఐసు ముక్క!.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
దావోస్: గ్రీన్‌లాండ్‌ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్‌లాండ్‌పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. గ్రీన్లాండ్కు, యూరప్‌కు, ముఖ్యంగా డెన్మార్క్‌కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. ‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్‌లాండ్‌పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్లాండ్ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను అమెరికాయే డెన్మార్క్‌కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్‌కు లేదు’’ అన్నారు. ట్రంప్ ప్రసంగం వినేందుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్ వేదిక కిటకిటలాడిపోయింది. యూరప్‌ను ప్రేమిస్తా, కానీ... యూరప్ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్‌లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు. తమ గ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్‌పై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘అమెరికాను బైడెన్ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్‌లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో గ్రీన్లాండ్కు బదులుగా పదేపదే ఐస్లాండ్ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్ వేదికపై కూడా ట్రంప్ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్ కాన్వాయ్ దావోస్ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాక్రాన్ కళ్లద్దాలపై చెణుకులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ధరించిన కళ్లద్దాలపై దావోస్ వేదికగా ట్రంప్ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్ వేదికపై మాక్రాన్ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్ చెప్పడం తెలిసిందే.మావల్లే మీ ఉనికి! కెనడాపై ట్రంప్ ఫైర్ మార్క్, నోరు జాగ్రత్త! ప్రధానికి హెచ్చరికలు దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే. -
ఇంట్రస్ట్.. ఇన్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2026’సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో భేటీ అయ్యింది. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీ సహా ఇతర సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం ఎంవోయూ కుదిరింది. గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా రష్మి గ్రూప్ చర్చించింది. ఈ భేటీలో సంస్థ ప్రమోటర్ సజ్జన్‌కుమార్ పటా్వరి, డైరెక్టర్ సంజీబ్‌కుమార్ పటా్వరి పాల్గొన్నారు. కాగా డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బుధవారం మరికొన్ని కీలక భేటీలు జరిపింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మరికొన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ కీలక ప్రకటనలు చేశాయి. రూ.6 వేల కోట్ల పెట్టుబడికి ఈఓఐ క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈఓఐ) సమరి్పంచింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బృందంతో జరిగిన భేటీలో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ డా.న్ బాబిక్, సీఈఓ, డైరెక్టర్ అనిల్‌కుమార్ బావిశెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్‌రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. 2047 నాటికి కాలుష్య రహిత తెలంగాణ సాధన లక్ష్యంతో తమ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఇది గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ‘సర్గడ్’రూ.1,000 కోట్ల పెట్టుబడులు విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన ‘సర్గడ్’సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌తో ‘సర్గడ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట భేటీ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ (ఎమ్మార్వో) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటయ్యే విమానాశ్రయాల్లో ఏదో ఒకచోట ఎమ్వార్వో కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ‘సర్గడ్’పెట్టుబడితో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో లోరియల్ బ్యూటీ టెక్ జీసీసీ ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆవిష్కరణలు, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలిచే ఈ జీసీసీ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. దీని ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందుతాయి. మెడ్‌టెక్, హెల్త్టెక్తో పాటు ‘బ్యూటీ టెక్’వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని శ్రీధర్‌బాబు అన్నారు. తమ జీసీసీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రేవంత్, శ్రీధర్‌బాబులను లోరియల్ ఆహ్వానించింది. కాగా రేవంత్‌రెడ్డి, లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ నడుమ జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ జీసీసీ ద్వారా 2030 నాటికి 2 వేల టెక్, ఏఐ, డేటా ఇంజనీరింగ్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ‘బ్లైజ్’విస్తరణ హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు కాలిఫోరి్నయాకు చెందిన ‘బ్లైజ్’సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బ్లైజ్ కో ఫౌండర్, సీఈఓ దినకర్ మునగాల, ముఖ్యమంత్రి మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థకు చెందిన డేటా సెంటర్ అభివృద్ధి చేస్తోంది. విస్తరణకు ‘ఏబీ ఇన్బెవ్’పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతిపెద్ద బీరు తయారీ సంస్థ ‘ఏబీ ఇన్బెవ్ ’రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్ విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్టేడియంల అభివృద్ధికి టాటా గ్రూప్ సంసిద్ధత – సంస్థ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దవోస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా స్పోర్ట్స్ స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై కూడా చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు.ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలావుండగా..సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. -
దావోస్: గ్రీన్లాండ్ మాక్కావాలి..
గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్లాండ్ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్లాండ్లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు. -
బాబు, లోకేష్ దావోస్ టూర్‌పై శైలజానాథ్ అదిరిపోయే సెటైర్లు
-
దావోస్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వేదికగా తెలంగాణ ప్రభుత్వం తన నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ను ఆవిష్కరించింది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే టాప్ ఐదు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.ఈ విధానం ద్వారా 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడుల ఆకర్షణ, 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి, అలాగే అధునాతన థెరప్యూటిక్స్, సస్టెయినబుల్ బయో-మాన్యుఫాక్చరింగ్, ఫ్రంటియర్ ఆర్ అండ్ డీ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.దావోస్‌లో పాలసీని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ “ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, మార్పు తీసుకువచ్చే బయోసైన్సెస్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది” అని పేర్కొన్నారు. గ్లోబల్ భాగస్వామ్యాలు, వినూత్న ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపడమే రాష్ట్ర సంకల్పమని తెలిపారు.రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని, రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.పాలసీ ముఖ్యాంశాలుప్రపంచ స్థాయి లక్ష్యం: 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలుగ్రీన్ ఫార్మా సిటీ: జీరో లిక్విడ్ డిశ్చార్జ్, నెట్-జీరో ప్రమాణాలతో పర్యావరణహిత పారిశ్రామిక క్లస్టర్ఫార్మా విలేజ్‌లు: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి 1,000–3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ప్రత్యేక హబ్‌లుజీనోమ్ వ్యాలీ విస్తరణ: షేర్డ్ ల్యాబ్స్‌తో కూడిన కొత్త బయో-ఇన్నోవేషన్, బయోమాన్యుఫాక్చరింగ్ క్లస్టర్వన్‌బయో: దేశంలోనే తొలి గ్రోత్-ఫేజ్ బయోఫార్మా స్కేల్-అప్ కేంద్రంలైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్: రూ.1,000 కోట్ల (111 మిలియన్ డాలర్లు) వరకు విస్తరించగల ప్రత్యేక నిధిటాలెంట్ అభివృద్ధి: గ్లోబల్ ప్రమాణాల విద్య కోసం తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ -
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్‌కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్‌తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు -
రేవంత్ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్ సందడి (చిత్రాలు)
-
ట్రంప్ విమానంలో విద్యుత్‌కు అంతరాయం.. యూటర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అలాగే వెనక్కి మళ్లింది. చిన్నపాటి విద్యుత్ సమస్య వల్లే ఇలా జరిగిందని.. విమానం సురక్షితంగానే దిగిందని వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఆయన బయల్దేరారు. అయితే కాసేపటికే విద్యుత్ సమస్య తలెత్తడంతో.. ప్రెస్ కేబిన్‌లోని లైట్లు ఆరిపోయాయి. దీంతో సిబ్బంది సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని తిరిగి యూఎస్ బేస్‌కు మళ్లించారు. #AirForce one is returning back to Washington DC because the crew detected a minor electrical issue. @POTUS Trump and staff are safe. pic.twitter.com/4EBPfEMw8w— @BeeNewsDailyB (@BeenewsdailyB) January 21, 2026వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ మరో విమానంలో(బ్యాకప్ ఎయిర్‌ఫోర్స్ వన్) దావోస్‌కు వెళ్లినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిటీ స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమని తెలిపారామె. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పదవి చేపట్టాక.. భారీ ఖర్చుతో బోయింగ్ 747-200 మోడల్ విమానాలు రెండింటికీ మార్పులు(ఒకటి బ్యాకప్) చేయించారు. ట్రంప్ ప్రయాణించే విమానాలు ఎయిర్‌ఫోర్స్ వన్(Air Force One) నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. ఒక్క గంట ప్రయాణానికి సుమారు 2,00,000–2,50,000 డాలర్లు (రూ.16–20 కోట్లు) వరకు ఖర్చు అవుతుంది(ఇంధనం, సిబ్బంది, భద్రతా, నిర్వహణ.. అన్నీ కలిపి). ఈ భారం పన్నుల రూపంలో మోసేది అమెరికన్లే. అయితే.. అధికారిక పర్యటనలే కాదు తన వ్యక్తిగత పర్యటనలకూ ఆయన ఈ విమానాన్ని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
కాలుష్య రహితం.. పర్యావరణ హితం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి కాలుష్య రహిత, పర్యావరణ హిత (నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్) స్మార్ట్ సిటీగా తెలంగాణలో రూపుదిద్దుకోనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టు ప్రత్యేకతలను దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. 30 వేల ఎకరాల్లో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మరుబెని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కావడం గురించి తెలియజేయడంతో పాటు, రిలయన్స్ గ్రూప్ (వంతారా) ఏర్పాటు చేస్తున్న జంతు ప్రదర్శనశాల ప్రత్యేకతలను వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలిరోజు వరుస భేటీలు నిర్వహించింది. అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. మరోవైపు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మార్రీతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీ గురించి చెప్పారు. ఈ భేటీల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. ఫ్యూచర్ సిటీపై యూఏఈ ఆసక్తి భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో తెలంగాణతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తెలిపారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేఏందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సీఎంతో ‘ఎక్స్‌పరై్టజ్’ భేటీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్‌పరై్టజ్’ ఆసక్తి చూపింది. సీఎం రేవంత్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్ భేటీ అయ్యారు. తమ సంస్థలో ఏటా సుమారు 5 వేల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకం జరుగుతోందని, యంగ్ ఇండియాతో భాగస్వామ్యం తమకు ఉపకరిస్తుందని చెప్పారు. విద్యా, ఉద్యోగ అవకాశాల నడుమ ఉన్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఎక్స్‌పరై్టజ్ సంస్థ పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంట్ నిర్వహణ సేవలను అందిస్తోంది. తెలంగాణతో భాగస్వామ్యంపై రాయల్ ఫిలిప్స్ ఆసక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యంపై హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై చర్చించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ ఈ విషయం వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలను ప్రశంసించారు. కాగా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ ప్రత్యేకతలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఔషధ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సదర్శించాల్సిందిగా సీఎం రేవంత్‌ను రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ ఆహ్వానించారు. పలు రంగాల్లో కలిసి పనిచేస్తామన్న గూగుల్ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌తో భేటీ అయిన గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. తొలి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు సంస్థ బృందానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆయా అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని గుప్తా అన్నారు. యూనిలీవర్ జీసీసీ ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ, హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్‌తో కూడా సీఎం భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది. -
యూఏఈతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
సాక్షి హైదరాబాద్: యుఏఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే మేటి నగరంగా నిర్మించడానికి యూఏఈ సహాకారం అందించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో భేటీ అయి ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా నిర్మించేందుకు ఇరువైపులా జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.కాగా హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. దీనిలో 11 టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. -
తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కండి.. శ్రీధర్ బాబు
సాక్షి హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి "తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన "ఇండియా పెవిలియన్" ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని పారిశ్రామికవేత్తలను శ్రీధర్ బాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ....భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని.... అందుకు అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఇక్కడి ఎకో సిస్టం వివరాలు మంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందని మంత్రి తెలిపారు.2026లో కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఉత్తమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. "తెలంగాణ బ్రాండ్" మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.O, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. -
దావోస్ వెళ్లి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టామని చెబుతారా?
సాక్షి, విశాఖపట్నం: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు దావోస్‌లో కూటమి పెద్దలు చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారాయన. మంగళవారం మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ..వెన్నుపోట్లు, పొలిటికల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్లో నిజంగానే చంద్రబాబు యూనిక్ పీస్. చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ చోరీలో సిద్ధహస్తులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాదు నగరం, భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా అన్ని తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. నారావారి దిష్టిబొమ్మ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని చెప్పుకుంటోంది. దావోస్‌కు వెళ్ళింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో కాదు.. టీడీపీ బ్యాండ్ మేళంతో. వైఎస్సార్సీపి పై విమర్శలు చేయడానికి దావోస్ ను వేదికగా వాడుకోబోతున్నారు. అసలు దావోస్ వెళ్లి పెద్ద పెద్ద రికార్డింగ్ డాన్సులు పెట్టామని చెప్పుకుంటారా?.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దావోస్ వెళ్లి మీ డప్పు మీరు కొట్టుకుంటారా?. పండుగ పేరు చెప్పి అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినదా?..వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోనీ బతికింది మీరు. నారా రామ్మూర్తి నాయుడునీ గొలుసులతో కట్టేసిన చరిత్ర మీది. లోకేష్ కు బ్యాక్ ఎక్కువ మైండ్ తక్కువ. రెండేళ్లలో మీరు ఒక పరిశ్రమనైనా తెచ్చారా?. .ఏపీకి వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలు తాము తెచ్చినట్లుగా చంద్రబాబు లోకేష్‌లు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారు.చంద్రబాబు గొప్ప గురించి ప్రజల చెప్పాలి. అంతేగానీ తనకు తానే విజనరీ అని సొంత డప్పు కొట్టుకోవడం కాదు. చలి ఉంటుంది కాబట్టి మేము దావోస్ వెళ్లలేదని గతంలో నేను అన్నట్లు ప్రచారం చేశారు. అది లోకేష్ నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. నిరూపించలేక పోతే క్షమాపణ చెబుతావా. ఒక సీఎం కొడుకువై ఉండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా?..ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇష్టానుసారంగా భూమి కేటాయించారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుపై చర్యలు ఉంటాయి.. నిబంధన ప్రకారం భూ కేటాయింపు జరపమని కోర్టు చెబితే.. పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ భూములను ఇవ్వండి. అంతేగానీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాళ్లా పంచారు అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీకి ఒక్క రూపాయి ఉపయోగం లేదు బాబు, లోకేష్‌పై గొల్లపల్లి ఫైర్..
-
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్‌లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్‌కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్‌లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్‌బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్‌విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
డేటా లీక్‌పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్‌కు ఎన్ఆర్ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తోందని, ఒక రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేస్తారని యూరోప్ ఎన్ఆర్ఐలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ‘దావోస్ పర్యటన–రాష్ట్రానికి పెట్టుబడులు’ అనే అంశంపై బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలువురు వాణిజ్య నిపుణులు, న్యాయవాదులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ (ఎన్ఆర్ఐ టీడీపీ)కు డేటా లీక్ అయ్యిందని, ఈ సంస్థ ద్వారా యూరోప్‌లోని ఎన్ఆర్ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరూ ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్)కు ఫిర్యాదులు చేయనున్నారనే విషయం ఈ వెబినార్ ద్వారా బయట పడింది. ఈ వెబినార్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..డేటా లీక్‌పై విచారణ జరపాలిఒక రాజకీయ సంస్థగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ అనే సంస్థ నుంచి మాకు మెయిల్స్ రావడం చాలా సీరియస్ అంశం. యూరోప్‌లోని మొత్తం తెలుగు ఎన్ఆర్ఐలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాలి. ఆయా దేశాల్లోని ఎన్ఆర్ఐలు జీడీపీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అక్కడ నో కార్ జోన్ ఉంటుంది. ఎంత పెద్ద వారు అయినా అక్కడ నడవాల్సిందే. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. జిందాల్ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒక మహిళతో కేసులు పెట్టించడం చేటు చేసింది. – ఎల్లాప్రగడ కార్తీక్, ఆర్థిక నిపుణుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలా?దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగి వచ్చి, దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పడం దారుణం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తీసుకువస్తుంటే, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైగా ప్రపంచ తీరు తెలుసుకునేందుకే దావోస్‌కు వెళ్లామని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనం. – వీవీఆర్ కృష్ణంరాజు, కన్వీనర్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదురాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి సహకారం ఇస్తామనే దానిపై సమగ్ర ప్రణాళికతో దావోస్‌కు వెళ్లాలి. అది జరగలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌కు పలు సంస్థలు వచ్చాయి. కానీ చేసిన హడావుడికి, ఆచరణలో సంస్థల పట్ల వ్యవహరించిన తీరుకు మధ్య చాలా తేడా ఉంది. గతంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖలో నిర్వహించిన సదస్సులో భోజనాల కోసం తోపులాట జరగడం ఎవరూ మరచిపోలేదు. – జేటీ రామారావు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడుఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదుపెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల రాజకీయ ప్రభుత్వం, సులభతర వాణిజ్య విధానాలు ఉండాలి. దేశంలో బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఫార్మా, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీ మాత్రం దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోయింది. నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు. – చింతలపాటి సుబ్బరాజు, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకేడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించాలన్న లక్ష్యంతోనే దావోస్ పర్యటనను వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లు దావోస్‌కు వెళితే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది భ్రమ అని నిరూపితమైంది. ఎన్ఆర్ఐల డేటాను రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేయడంపై న్యాయస్థానంలో కేసు నమోదు చేయబోతున్నాం. – పల్లి ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిపుణుడు, సామాజిక ఉద్యమకారుడు అస్తవ్యస్తంగా చంద్రబాబు పాలనవైఎస్ జగన్ పాలనలో దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈరోజు చంద్రబాబు పర్యటన ద్వారా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు? రేవంత్‌రెడ్డి రూ.1.79 లక్షల కోట్లు తెలంగాణాకు తీసుకువచ్చారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఉత్త చేతులతో రాష్ట్రానికి వచ్చారు. బాబు పాలనలో అప్పులు పెరిగాయి, రాబడి తగ్గింది. ఈ లెక్కన ఎవరిది సమర్థమైన పాలన? – బి.అశోక్ కుమార్, ఆంధ్రా అడ్వొకేట్స్ ఫోరం కన్వీనర్ -
దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య
సాక్షి, అమరావతి: ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళుతున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్‌ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్వర్కింగ్ కేంద్రం దావోస్’ అంటూ సెలవిచ్చారు. ఒప్పందాల కోసం దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్‌మార్ట్, యూనీలీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్‌ను తాను ప్రమోట్ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ దావోస్‌కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్‌ను ప్రమోట్ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులుకొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ 14 మిలియన్ టన్నుల స్టీల్ప్లాంట్స్ పోర్టు ఆధారంగా ఏర్పాటవుతున్నాయన్నారు. దీంతోపాటు ఎల్జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యూనిట్, రిలయన్స్ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్‌గా తయారు కానుందన్నారు. టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వచ్చిందని, గూగుల్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్‌గేట్స్‌ను కోరినట్టు తెలిపారు. సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జిందాల్ గ్రూపుతో దావోస్‌లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాకపోతే నేర్పించా..ఇండియాలో దావోస్‌ను, సీఐఐని నేనే ప్రమోట్ చేశా» గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.» 1997లో దావోస్ వెళ్లి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగేవారు.» 25 హైస్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను.» నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ హైదరాబాద్‌లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో చేసిన ప్రగతి చూసి ఎస్ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యారు.» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.» నేను అప్పట్లో పీసీ (పర్సనల్ కంప్యూటర్) అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.» 1995లో ఐటీని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా.» కార్పొరేట్–పబ్లిక్ గవర్నెన్స్‌లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా తయారు చేస్తా.» హైదరాబాద్‌ని తెలంగాణ వాళ్లదిగా చూడకూడదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్‌ను ప్రమోట్ చేశాను.» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.» గతంలో నువ్వు ల్యాప్‌టాప్‌లోని డాష్‌బోర్డుతో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నావా అని బిల్‌గేట్స్ అడిగారు.» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మహారాష్ట్రను హబ్‌గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను. -
దావోస్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు బుకాయింపు
-
చంద్రబాబు దావోస్ పర్యటన ఫ్లాప్
-
ఎల్లో మీడియా డబ్బా దావోస్ టూర్‌పై శివ శంకర్ కామెంట్స్
-
40 ఏళ్ల అనుభవం 40 కోట్లు కూడా తేలేదు...వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
కోట్లలో ప్రజల సొమ్ము స్వాహా... బాబుపై గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు.. లోకేష్ అక్కడ సీఈవోలు.. టెక్ కంపెనీల పెద్దలతో ఫోటోలు దిగారు.. ఎప్పట్లానే కోట్లు కోట్లు.. పెట్టుబడులు అంటూ ఊదరగొట్టినా ఒక్క ఇటుకబట్టీ.. అతుకుల మిల్లు.. అప్పడాల మిషన్ వంటి చిన్న పరిశ్రమల కూడా రాలేదు.. దీన్ని అటు సోషల్ మీడియాలో యూత్ మీమ్స్.. ట్రోలింగులతో పోస్టింగులు పెడుతుండగా అటు టీడీపీ అనుకూల మీడియా మాత్రం సైలెంట్ ఐంది. ఏపీలో అన్ని ప్రాథమిక ప్రక్రియలు పూర్తయి నిర్మాణం మొదలు కావాల్సిన జిందాల్ స్టిల్స్ మహారాష్ట్రకు తరలిపోయింది. అటు కొత్తగా ఒక్కటీ ఒప్పందం జరగలేదు. దీంతో ఇక ఈ దావోస్ విజయోత్సవాలు ఎలా చేయాలన్నదాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం అనుకూల మీడియా ప్రస్తుతానికి ఆ అంశాన్ని చర్చల్లో ఉంచడం లేదు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన పెద్దగా ఫలితం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం కక్కలేక మింగలేక ఉంటున్నా అటు లోలోన పవన్ కళ్యాణ్ మాత్రం సంబరపడిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. లోకేష్వాస్తవానికి మొదట్లో బాబుపట్ల అత్యంత వినయవిధేయతలతో ఉన్న పవన్ ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. శాంతిభద్రతలు బాలేవు.. అవసరం ఐతే నేనే హోం శాఖను తీసుకుంటాను.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను అన్నారు.. తిరుమల తొక్కిసలాట మీద కూడా తాను ముందుగా స్పందించి ప్రజలకు ప్రభుత్వం తరఫున సారీ చెప్పడంతోబాటు మీరెందుకు చెప్పరు మీకేం కష్టం.. అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావును సైతం ప్రశ్నించి ఇరుకునపెట్టేసారు. ఇవన్నీ లోకేష్ ను బాగా ఇరిటేట్ చేశాయని .. పవన్‌ను కంట్రోల్ చేయాలనీ అయన ప్లాన్ చేస్తున్నారని.. అందుకే తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు లీడర్లతో డిమాండ్లు చేయిస్తున్నారన్న ఫీలర్లు కూడా వచ్చాయి. మొత్తానికి అది సమసిపోగా ఇప్పుడు దావోస్ సదస్సుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు తీసుకెళ్లకుండా బాబు.. లోకేష్ ఇద్దరే వెళ్లారు. సీఎం హోదాలో బాబు.. ఐటి మంత్రిగా లోకేష్ వెళ్లారనుకున్నా పవన్‌ను సైతం తీసుకెళ్తే బాగుణ్ణని జనసైనికులు ఆశించారు. కానీ అక్కడ కూడా పవన్ వెళ్తే మీడియా మొత్తం ఆయనచుట్టూ ఉంటుందని.. లోకేష్.. చంద్రబాబును పట్టించుకోదని భయంతోనే ఆయన్ను తీసుకెళ్లలేదని అంటున్నారు..హమ్మయ్య మనకు హ్యాపీఇప్పుడు ఏమీ పెట్టుబడులు లేకుండా తిరిగొచ్చిన లోకేష్.. చంద్రబాబును చూసి పవన్ లోలోన సంతోషపడుతున్నారని అంటున్నారు... తనను పూర్తిగా పక్కనబెట్టేసి అదేదో వాళ్ళ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ అన్నట్లుగా వాళ్లిద్దరే వెళ్లడం.. పవన్‌ను కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం.. ఒకరకంగా ఆయన్ను అవమానించడమే అని అంటున్నారు. ఐటి గురించి నీకేం తెలీదు.. మేం చాలాసార్లు దావోస్ వెళ్లాం.. అవన్నీ నీకు అర్థం కానీ విషయాలు అన్నట్లుగా పవన్‌ను చిన్నచూపు చూసి ఆయన్ను వదిలేశారని ఇది చిన్నతనంగా భావించినా ఏమీ మాట్లాడకుండా పవన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు దావోస్ సదస్సు తుస్సుమనడంతో పోన్లే.. మనకు సంబంధం లేని విషయం. వాళ్లిద్దరే వెళ్లారు.. వట్టి చేతులతో తిరిగొచ్చారు.. మనదేం పోయింది.. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అలాగే జరగాలి అని పవన్ లోలోన ఖుష్ అవుతున్నారని అంటున్నారు..--సిమ్మాదిరప్పన్న -
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్‌కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్‌లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడికోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం
-
ఇక్కడి వాళ్లతో దావోస్‌లో ఒప్పందాలేంటి?: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది. -
పబ్లిసిటీకి మాత్రం రెండు కోట్లు ..బాబు దావోస్ టూర్ పై కామెంట్స్
-
Amarnath: లోకేష్ భజన కోసం 20 కోటు ఖర్చుపెడతారా?
-
KSR Live Show: పాయె.. ఉన్నది కాస్త పాయె.. తండ్రీకొడుకుల దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్.. వట్టి చేతులతో వెనక్కి
-
అమెరికాలో ఉత్పత్తి చేయండి లేదంటే టారిఫ్ కట్టండి
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌదీ.. రేట్లు తగ్గించుకో..‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. -
ఐటీ నేపథ్యం ఎప్పటికీ నాకు గర్వకారణం
సాక్షి, హైదరాబాద్: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తనను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్(KTR) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడవచ్చని అనుకునేవాళ్లకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి జీవనోపాధిని పొందుతున్నారు.ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలు, నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. -
సీఎం రేవంత్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు
-
పెట్టుబడులు తేకుండానే ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన
-
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి
సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్‌ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూల పేట ఇందుకు అనుకూలమని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది. బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్‌కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు. -
చార్మినార్ టు ఫ్యూచర్ సిటీ!
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’(తెలంగాణ అంటేనే వాణిజ్యం) అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను హైదరాబాద్ ప్రత్యేకతలు చాటేలా తీర్చిదిద్దారు. గతంలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు చోట్ల పెవిలియన్ కేటాయించగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలు తమ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ నగర చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా పెవిలియన్‌ను రూపొందించారు. చార్మినార్‌తోపాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ వంటి చిహ్నాలతో రూపొందించిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో అత్యంత నివాస యోగ్యంగా హైదరాబాద్‌కు అనుబంధంగా 14 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను వివరించేలా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు.ఫ్యూచర్ సిటీలో 6వేల ఎకరాల్లో పర్యావరణ జోన్‌తోపాటు ‘వర్క్, లివ్, లెర్న్, ప్లే’కాన్సెప్ట్‌తో ఉండే ఫ్యూచర్ సిటీ నమూనా ప్రదర్శిస్తున్నారు. మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డుతోపాటు మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు తదితరాలను ప్రస్తావించారు. వీటితోపాటు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రముఖ విద్యా సంస్థలు ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ ప్రత్యేకతలను చాటేలా పోస్టర్లు రూపొందించారు. -
రాష్ట్రం రూపు రేఖలు మార్చేలా హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల అభివృద్ధికి అర్బన్ మొబిలిటీయే పునాది ‘నగరాల అభివృద్ధి, వాటి భవిష్యత్తులో అర్బన్ మొబిలిటీ పునాదిగా పనిచేస్తుంది. ప్రజలు తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో వేగంగా గమ్యాన్ని చేరుకునేలా రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడవుతున్నాయి..’అని సీఎం చెప్పారు. మచిలీపట్నం పోర్టుతో అనుసంధానిస్తాం ‘ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. డ్రైపోర్టు నిర్మాణంతో తెలంగాణను వేర్‌హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తాం. 1.2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే రెండింతలుగా వంద కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మిస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు ఉండగా, కొత్తగా ఓఆర్ఆర్ వెలుపల 360 కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మిస్తాం. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌ను అనుసంధానం చేసేలా రేడియల్ రింగు రోడ్లు నిర్మిస్తాం. రింగు రోడ్లకు అనుబంధంగా రైల్వే లైన్లు నిర్మించే ఆలోచన ఉంది..’అని రేవంత్ తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటాం పొరుగు రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా కొనసాగుతూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని సీఎం రేవంత్ చెప్పారు. దావోస్‌లో ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులతో కలిసి రేవంత్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మేము సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నదుల నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం. ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతోంది. మా అత్యంత పెద్ద బలం హైదరాబాద్, అలాగే యువత. మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..’అని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కోరారు. భారతదేశం–రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన – భవిష్యత్తు.. వంటి పలు అంశాలపై ముగ్గురు సీఎంలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘లక్ష కోట్ల మొక్కల్లో..’భాగస్వాములమవుతాం భూమండలంపై లక్ష కోట్ల మొక్కలు నాటే సంకల్పంలో తాము భాగస్వాములు అవుతామని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నికోల్ శ్వాబ్ సమక్షంలో రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు ప్రమాణం చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకానికి చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. -
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...జిందాల్‌ను వేధించిన బాబు సర్కారు– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్‌ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..– ఈవీ, సోలార్ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలుసజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్‌తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్‌డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.నాడు.. పెట్టుబడులకు రాచబాట..– పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ భరోసావైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. -
Telangana: దావోస్‌లో కుదిరిన ఒప్పందం.. రూ. 45,500 కోట్ల పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో తెలంగాణ రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో ఈ మేరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం సన్ పెట్రో ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మూడుచోట్ల భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతుంది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలో ఏర్పాటయ్యే ఈ మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం: సీఎం హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయతి్నస్తున్నామని, సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించాలనే లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఓ మైలు రాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. సన్ పెట్రో కెమికల్స్ చేపట్టబోయే ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టినీ తెలంగాణ ఆకర్షిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. ‘కంట్రోల్ ఎస్’ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ‘ఏఐ డేటా సెంటర్ క్లస్టర్’ ఏర్పాటుకు ‘కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్’ ముందుకు వచ్చింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల ఉద్యోగాలు లభిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ప్రకటించారు. రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. రూ.800 కోట్లతో ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ రాష్ట్రంలో అధునాతన మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను రూ.800 కోట్లతో ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ యూఏవీ’తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది. -
తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నాగర్ కర్నూల్ ,మంచిర్యాల ,ములుగులో పంప్డ్ స్టోరేజి పవర్ ,సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకోల్పనుంది. తద్వారా 7వేల మందికి ఉపాధి లభించనుంది.Big investment : Sun Petrochemicals signs ₹45,500 crore investment MoU with #Telangana to establish large-scale pumped storage Hydro and solar power projects Deal will create over 7,000 jobs, to develop three Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and…— Naveena (@TheNaveena) January 22, 2025 -
బాబు, లోకేష్ కన్నింగ్ ఫెయిల్.. ఆఖరికి పవనే దిక్కు..
-
దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు.. ఏపీకి లోకేష్ ప్రమోషన్లు
-
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. యూనీలివర్‌తో ఒప్పందం దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. -
తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
బ్రెన్ : స్విట్జర్లాండ్ దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం జరిగింది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలీవర్ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొన్నారు. -
లోకేష్ ను పొగిడేవారి మంత్రులనే దావోస్ తీసుకెళ్లిన చంద్రబాబు
-
జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది. ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. -
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలుకేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు 2015లో⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం ⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన ⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం2016లో⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి 2017లో⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు ⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు ⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు 2018లో⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు 2019లో⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం ⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు. తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో) అదానీ గ్రూప్ : రూ.12,400 కోట్లు ఆరాజెన్ : రూ.2,000 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు గోడి ఇండియా : రూ.8,000 కోట్లు వెబ్ వర్స్ : రూ.5,200 కోట్లు గోద్రెజ్ : రూ.1,270 కోట్లు -
విషయాలను మరచి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు
ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్ సభలకు సీఎం జగన్ వెళ్ళలేదంటూ ఈనాడు విషం చిమ్ముతోంది. నిజానికి మొత్తం 29 రాష్ట్రాల్లో దావోస్‌కు వెళ్లింది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే. గతంలో ఐదు సార్లు దావోస్ వెళ్లానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఒక్క విదేశీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. చంద్రబాబు.. నేనే తెచ్చినట్లు గొప్పగా చెప్పుకునే కియా పరిశ్రమ కూడా ప్రధాని మోదీ కొరియా పర్యటనలో ఉన్నప్పుడు చేసిన సూచన మేరకు ఆ కంపెనీ ఏపీకి వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ కంపెనీ తీసుకు వచ్చింది నేనే అంటూ బాబు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ దావోస్ ఇప్పుడు దావోస్ సభలకు వెళ్లకపోయినా.. ఇప్పటి వరకు తన పాలనలో రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనలో ఉన్నన్ని రోజులు (దిగిపోయేనాటికి) రాష్ట్రానికి వచ్చిన ఎంఎస్ఎంఈల సంఖ్య 1.93 లక్షలు మాత్రమే. దీంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు రెట్టింపు అని స్పష్టమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్‌లో మాత్రమే పారిశ్రామిక వేత్తలు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక వృద్ధిలో దూసుకెళ్తోందన్న విషయం పారదర్శకంగా కనిపిస్తున్నాయనే.. విషయాలన్నీ తెలిసినా విష ప్రచారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. -
దావోస్‌లో సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటోంది. ఐటీ, జీవ, వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, భారీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను ప్రారంభించింది. తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. సీఎం, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనకు సాయం అందించడంపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు.. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’నినాదంతో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం చారి్మనార్‌తో పాటు చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్‌తో పాటు విభిన్న రంగాల విజయాలు చాటే లా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ అనుకూలతలను వివరించేలా నినాదాలు ఏర్పాటు చేశారు. జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయుల స్వాగతం మూడు రోజుల పాటు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం రేవంత్ బృందానికి మార్గం మధ్యలోని జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. సమ్మిళిత, సంతులిత అభివద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావటంపై హర్షం వ్యక్తం చేశారు. -
Davos: బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక చర్చలు
జ్యురిచ్: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డైమన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. డైమన్తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్, కార్లైల్ గ్రూపు, బ్లాక్‌స్టోన్ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్స్కీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం. ఇదీచదవండి.. చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
భారీ పెట్టుబడులే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏఐపై శ్రీధర్‌బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు. ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్ తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు. -
‘దావోస్’ పెట్టుబడులు రూ. 21 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తనతోపాటు అధికారుల బృందం 4 రోజులపాటు అక్కడి సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ఆయన ట్విట్టర్లో వివరించారు. అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు తదితరులతో 52 సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, విధానాల రూపకర్తలు సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ విధానాలపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు. యువతకు భారీగా ఉద్యోగాల కోసం.. వరుసగా ఐదోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరైన కేటీఆర్... దావోస్‌లో అడుగు పెట్టింది మొదలు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అధినేతలతో ముఖాముఖి చర్చలు జరిపారు. దావోస్ పర్యటన మార్గమధ్యలో స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరమైన జూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణకు పెట్టుబడులతో రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ బృందం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడులు ►హైదరాబాద్‌లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన. ►హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ►రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లోకి ఫ్రాన్స్ ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ విస్తరణ ూలండన్ తరువాత హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్. ►రూ.210 కోట్ల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ►తెలంగాణలో పెప్సీకో కార్యకలాపాలు రెట్టింపు ►హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రం ►హైదరాబాద్‌లో రూ. 150 కోట్లతో రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్‌పీటీ ప్రపంచ సామర్థ్య కేంద్రం. -
పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్స్కీ గురువారం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లోని వీడియో కాల్లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు. ఆ సమావేశంలోని బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్లో జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్ స్క్రీన్(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్‌పై జోక్‌లు పేల్చారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్, ఉక్రెయిన్, జెలెన్స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది. అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుతిన్ ఇటీవల కాస్త పబ్లిక్ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో జెలెన్ స్కీ పుతిన్‌ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్ కూడా డిసెంబర్లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ⚡️Zelensky refuses to negotiate with Putin because he is not sure that the Russian president is alive. Zelensky said this at the Ukrainian Breakfast in Davos this morning🤣 pic.twitter.com/KphpbM1eND — nicolasorin (@alocin96983806) January 20, 2023 (చదవండి: నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్) -
దావోస్ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్ 25న వరల్డ్ ఎకనావిుక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Due to the brutal nature of the negative campaign on the authenticity of the Invitation letter from @wef, we are reiterating, that any false claim will attract legal action. The Invitation letter is authentic and was shared as received.@GummallaSrijana@AP_EDB@ApiicOfficial https://t.co/pyeN1lMYax — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 19, 2023 -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో ఒక్కోటీ సగటున 100 మెగావాట్ల ఐటీలోడ్ (సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు వినియోగించిన లేదా వాటి కోసం కేటాయించే విద్యుత్ మొత్తం)తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ తాజాగా దావోస్ వేదికగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు మరో రూ. 16 వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని పేర్కొంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే ఈ భారీ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది. మైక్రోసాఫ్ట్‌తో బంధం బలోపేతం: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం సంతోషకరమన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భారత్ కేంద్రంగా తమ సంస్థ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు కీలకంగా మారతాయన్నారు. -
ఎయిర్టెల్ రూ.2,000 కోట్ల పెట్టుబడి.. హైదరాబాద్‌లో హైపర్ స్కేల్ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో టెలికం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్టెల్ హైదరాబాద్‌లో రూ. 2వేల కోట్ల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను తన అనుబంధ సంస్థ అయిన ‘నెక్స్ ట్రా’ ద్వారా భారతీ ఎయిర్టెల్ నెలకొల్పనుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2వేల కోట్లను పెట్టుబడిగా పెడుతామని ఎయిర్టెల్ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మోటిక్స్ పరీక్షల సంస్థ యూరోఫిన్స్.. జీనోమ్ వ్యాలీలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. –దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవీలియన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్, ఎండీ రాజన్ భారతీ మిట్టల్, యూరోఫిన్స్ సీఈవో డాక్టర్ గిల్లెస్ మారి్టన్లు విడివిడిగా సమావేశమయ్యారు. సమావేశానంతరం 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.రామారావు మాట్లాడుతూ ఎయిర్టెల్–నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కలి్పంచడంలో ఎయిర్ టెల్– నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు. –భారతీ ఎయిర్టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి కారణమన్నారు. జీనోమ్ వ్యాలీలో..యూరోఫిన్స్ ప్రయోగశాల... హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రయోగశాల (టెస్టింగ్ ల్యాబ్) ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మా, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలతో పాటు బయో అనలిటికల్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న యూరోఫిన్స్ హైదరాబాద్‌లో అధునాతన ప్రయోగశాలను నెలకొల్పాలని నిర్ణయించింది. తద్వారా భారతీయ ఔషధ మార్కెట్లోకి విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ ఆర్ అండ్ డీ, బయో అనలిటికల్ సరీ్వసెస్, ఇన్–వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన దేశ, విదేశ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్ కంపెనీలకు అవసరమైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. తన అనుబంధ సంస్థ ‘యూరోఫిన్స్ అడ్వినస్’ ద్వారా హైదరాబాద్‌లో ఈ ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటు చేయనుంది. ఫార్ములేషన్ డెవలప్మెంట్తో పాటు ఇన్–విట్రో, ఇన్–వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023 వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్‌కు ఈ ల్యాబ్‌తో అవకాశం కలుగుతుంది. ఔషధాల తయారీలో భారత్ ప్రాధన్యతను గుర్తించే...: గిల్లెస్ మార్టిన్ ఈ సందర్భంగా యూరోఫిన్స్ సీఈఓ డాక్టర్ గిల్లెస్ మారి్టన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు లే»ొరేటరీ నెట్‌వర్క్‌ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ క్యాంపస్ ద్వారా ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకం కానున్నట్లు చెప్పారు. కాగా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోకి యూరోఫిన్స్ ప్రవేశించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ విస్తరణ–వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్ పరిగణిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాలో మంత్రి కేటీఆర్‌కు చోటు!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. స్విర్జర్లాండ్లోని దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మంత్రి కేటీఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. ఇక కేటీఆర్ హ్యాండిల్ చేసే ట్విటర్ అకౌంట్ @కేటీఆర్టీఆర్ఎస్కు 12వ ర్యాంక్, @మినిస్టర్కేటీఆర్ అకౌంట్‌కు 22 ర్యాంక్ ఇచ్చింది. @truckdriverpleb @CyrilRamaphosa @ValaAfshar @rwang0 @AlinejadMasih @montymetzger @MinisterKTR @raghav_chadha @EU_Commission @vonderleyen @GBBCouncil @Oxfam @Gabucher @LassoGuillermo @ODI_Global https://t.co/KiTyPCbJIz#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/AMjO0RKion — Jim Harris #WEF23 (@JimHarris) January 17, 2023 -
తెలంగాణలో మల్టీగిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటుకానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామన్నారు. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా 750 కోట్ల రూపాయలను ఈ కేంద్రం పై పెట్టుబడిగా పెట్టనున్నారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అలాక్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టం ను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ -అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈ ఎస్ ఎస్ పాలసీని తీసుకొచ్చిందన్న కేటీఆర్, ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం తమదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంతో పాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కీలకంగా మారేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ గోపాలకృష్ణన్ విసి పాల్గొన్నారు. -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
దావోస్‌కు కేటీఆర్ బృందం
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేతృత్వంలో అధికారుల బృందం శనివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. నేడు జూరిచ్‌కు చేరుకోనున్న కేటీఆర్ బృందం రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటుంది. 2018లో తొలిసారిగా తెలంగాణ నుంచి దావోస్‌కు ప్రతినిధులు వెళ్లగా 2019, 2020, 2022లోనూ హాజరయ్యారు. దావోస్ సమావేశాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్లడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్పైన్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్ ఆతిథ్యమిస్తోంది. కాగా దావోస్‌లో ఏర్పాటయ్యే తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు చెందిన అధినేతలతో భేటీకావడంతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా జరిగే రౌండ్ టేబుల్ భేటీల్లో కేటీఆర్ పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కేటీఆర్ ప్రసంగాలు, భేటీలు ఉంటాయి. -
అంతర్జాతీయ రోడ్‌షోలతో పెట్టుబడుల ఆకర్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న అంతర్జాతీయ రోడ్‌షోలు సత్ఫలితాలిస్తున్నాయి. కరోనాతో రెండున్నరేళ్లుగా ఆన్లైన్ సమావేశాలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ రోడ్‌షోలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అధికారుల బృందం వెళ్లివచ్చింది. అంతకుముందు అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొంది. తాజాగా పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన నేతృత్వంలో అధికారుల బృందం జర్మనీలోని హాన్ఓవర్ మెస్సే ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొంది. ఈ మూడు రోడ్‌షోలు మంచి ఫలితాలు అందించడంతో రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ రోడ్‌షోలను నిర్వహించడానికి పరిశ్రమలశాఖ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ ట్రేడ్ ఫెయిర్‌గా పిలిచే హన్ఓవర్లో మే 30 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో రాష్ట్రం పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో తయారీ, పోర్టులు, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన ‘సాక్షి’కి చెప్పారు. ఏబీబీ, ఎయిర్‌బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన జర్మనీ, ఇజ్రాయిల్‌లకు చెందిన షెఫ్లర్ టెక్నాలజీస్, ఫెస్టో వంటి కంపెనీలు రాష్ట్రంలోని అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోబోటిక్, హెల్త్‌కేర్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. దుబాయ్, దావోస్, జర్మనీ రోడ్‌షోలు మంచి ఫలితాలివ్వడంతో త్వరలో నార్వే, దక్షిణ కొరియాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా దక్షిణ కొరియా రోడ్‌షోను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంపై మల్క్హోల్డింగ్ ఆసక్తి ఈ ఏడాది దుబాయ్ ఎక్స్పో సందర్భంగా రూ.5,150 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా అందులో కీలకమైన అమెరికాకు చెందిన మల్క్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసిన మల్క్హోల్డింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.1,500 కోట్లతో అల్యూమినియం కాయల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచానికి ఏపీని రోల్‌మోడల్‌గా చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ఒక్క రంగంలోనే నాలుగు అంతర్జాతీయస్థాయి కంపెనీల నుంచి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది. మిట్టల్, అదానీ, అరబిందో, గ్రీన్కో వంటి కంపెనీలతో పాటు బైజూస్, టెక్ మహీంద్రా, డసల్ట్ వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ రోడ్‌షోల్లో వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు, ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్ తెలిపారు. -
దావోస్‌కు బై బై...తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ శుక్రవారం తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు. తొలుత యూకేలో.. ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్లో జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ వచ్చే ఏడాది దాకా! సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చివరి రోజు స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో సరదాగా గడిపారు. ఓ వీధి పక్కన రెస్టారెంట్లో సేదతీరుతున్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘దావోస్‌కు బై బై.. వచ్చే ఏడాది దాకా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దావోస్ లో ఏపీ ఉజ్వల భవిష్యత్తుకు నిర్మాణాత్మక పునాదులు
-
Telangana: హ్యుందాయ్ పెట్టుబడులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ గురువారం మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పా టుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రక టించింది. మాస్టర్‌కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎం పీఈ తదితర సంస్థలూ రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. కేటీఆర్‌తో హ్యుందాయ్ ప్రెసిడెంట్ భేటీ హ్యుందాయ్ ప్రెసిడెంట్ యంగ్చో చి గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా.. డిజిటల్ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్ కార్డ్’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్ మైఖేల్ ఫ్రొమన్ వెల్లడించారు. ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్ యూనిట్ క్షయ వ్యాధి డయోగ్నొస్టిక్ కిట్ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయోగ్నొస్టిక్స్’ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో నెలకు 20 లక్షల కిట్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ అసలాపురం చెప్పారు. హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్ విస్తరణ ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈఓ థామస్ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్ డైరెక్టర్ అశోక్ జె పటేల్ గురువారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. -
తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్ కార్డ్స్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్ స్టేట్ పార్టనర్షిప్ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్ సేవలు అందివ్వడానికి మాస్టర్ కార్డ్స్ తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుంది. అంతే కాకుండా రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఉపకరిస్తుంది. సైబర్‌క్రైం, డిజిటల్ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్ తెలంగాణతో కలిసి పని చేయనుంది. In line with its vision of a Digital Telangana, the Govt. of Telangana entered into an MoU with @Mastercard to formalize a Digital State Partnership. The announcement was made in the presence of Minister @KTRTRS & Mastercard VC & President Michael Froman in Davos #InvestTelangana pic.twitter.com/zHx23l3Wra — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022 చదవండి: తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు.. -
దావోస్‌లో జోష్‌గా.. తెలంగాణకు భారీ పెట్టుబడులు..
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బుధవారం రెండు భారీ పెట్టుబడులు సాధించింది. రైల్వే కోచ్‌ల తయారీలో పేరొందిన స్టాడ్లర్ రైల్ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఆన్స్ గార్డ్ బ్రొక్‌మెయ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోకిలలో ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మేధా సర్వోడ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి స్టాడ్లర్ రైల్ ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పెట్టుబడి ద్వారా సుమారు 2,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే కోచ్‌లు భారత్‌కే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కూడా ఎగుమతి అవుతాయి. కాగా స్టాడ్లర్ రైల్ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విదేశాలకు కూడా కోచ్‌లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసే తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందనిబ్రొక్‌మెయ్ పేర్కొన్నారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫెర్రింగ్ ఫార్మా విస్తరణ భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు మరో స్విస్ సంస్థ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్‌తో సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. క్రోన్, అల్సరేటివ్ కోలైటిస్ వంటి (జీర్ణకోశ సంబంధిత) వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘పెంటసా‘ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలోని కొత్త ప్లాంట్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద మేసాలజైన్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నెలరోజుల క్రితమే తమ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ స్వల్ప వ్యవధిలోనే అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’మరో యూనిట్ తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్ రిమోంట్ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్సŠడ్ లైట్ హౌస్ అవార్డును అందుకున్నదని రిమోంట్ తెలిపారు. ఐఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనలిటిక్స్, ఏఐ డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వాడినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయంటూ, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కంపెనీ విస్తరణకు పూనుకున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్ వలన కొత్తగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. -
తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు..
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం శుభవార్తను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఫెర్రీ ఫార్మా అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించింది. వీటితో హైదరాబాద్‌లో ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పింది. దీన్ని మంత్రి కేటీఆర్ రెండు నెలల కిందట ప్రారంభించారు. ఇంతలో దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు జరగడం ఫెర్రీ ప్రతినిధులతో మరోసారి కేటీఆర్ సమావేశం కావడం జరిగింది. ఫలితంగా రెండో యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల కేటాయించేందుకు ఫ్రెర్రీ ఫార్మా ముందుకు వచ్చింది. More good news coming in for #Telangana from Davos! Delighted to announce that Switzerland headquartered @ferring Pharma will be expanding in Hyderabad with an investment of ₹ 500 Crores for setting up of another formulation unit#TelanganaAtDavos #InvestTelangana #WEF22 pic.twitter.com/3nkVzP5PEB — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: తెలంగాణకు రాబోతున్న స్విస్ రైల్ కోచ్ తయారీ కంపెనీ! రూ. 1000 కోట్లతో.. -
స్టాడ్లర్ రైల్.. త్వరలో తెలంగాణకు ! రూ. 1000 కోట్లతో..
రైల్ కోచ్ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్లో వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్లర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈవీపీ ఆన్స్‌గర్ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్ దావోస్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగియడంతో త్వరలో తెలంగాణలో రైలు కోచ్‌ల తయారీ రంగంలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు స్టాడ్లర్ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో నెలకొల్పబోయే రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్టాడ్లర్ సంస్థ రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2500ల మంది యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు రంగంలో మేధా సంస్థ రైల్ కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా స్టాడ్లర్ సంస్థ రైల్ కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. మేధా సంస్థతో కలిసి స్టాడ్లర్ తెలంగాణలో పని చేయనుంది. Delighted to announce that ‘Stadler Rail’ will be setting up their Rail Coach Manufacturing unit in Telangana This investment will be a joint venture b/w Medha Servo Drives & Stadler Rail with an investment of ₹ 1,000 Cr. which will create 2,500 jobs for our youngsters pic.twitter.com/Ntnxs1oU6x — KTR (@KTRTRS) May 25, 2022 షిండ్లర్ సైతం తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు షిండ్లర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. షిండ్లర్ ఈవీపీ లుక్‌రెమ్‌నాంట్‌తో దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో రెండో స్టేట్ ఆఫ్ ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు షిండ్లర్ గ్రీన్ సిగ్నల్ ఇచఇచ్చింది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో గ్లోబల్ లీడర్‌గా షిండ్లర్ ఉంది. వందకు పైగా దేశాల్లో షిండర్ల్ విస్తరించి ఉంది. Extremely happy to announce that @SchneiderElec will be expanding its operations in Telangana by setting up their 2nd state-of-the-art manufacturing facility in Hyd. Thanks to Luc Remont, EVP, @SchneiderElec for the fruitful meeting at Telangana Pavilion @wef #TelanganaAtDavos pic.twitter.com/n5DRuuQ8J9 — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: KTR: ‘మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్’! -
డిజిటల్ టెక్నాలజీ పురోగతితో పర్యావరణ పరిరక్షణ
దావోస్: డిజిటల్ టెక్నాలజీల పురోగతి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 2050 నాటికి 20 శాతం వరకు తగ్గించగలదని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అంచనావేసింది. అత్యంత పర్యావరణ ప్రతికూల ఉద్గారాలను వెలువరించే మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్‌లో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతను ఉద్ఘాటించింది. యాక్సెంచర్‌తో కలిసి ఈ మేరకు నిర్వహించిన అధ్యయన వివరాలు... నిర్ణయాలు–అమలు మధ్య వ్యత్యాసం పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పిలుపునకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నిర్ణయాలు–వాటి అమలు మధ్య ఇంకా తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే ప్రమాదకర ఉద్గారాల తగ్గింపు అవసరమైన చర్యలు 55 శాతం చేపట్టాల్సి ఉండగా, ఈ దిశలో నడిచింది కేవలం 7.5 శాతం కావడం గమనార్హం. ఈ వ్యతాసం తగ్గింపునకు అధిక ఉద్గార రంగాలు ఈ విషయంలో ‘సామర్థ్యం, పునరుత్పాదకత, సుస్థిర నిర్ణయాల’పై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మూడు రంగాలు కీలకం... మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్ విభాగాలు అధిక ఉద్గార రంగాలుగా ఉన్నాయి. 2020 మొత్తం ఉద్గారాల్లో వీటి వెయిటేజ్ వరుసగా 43 శాతం, 26 శాతం, 24 శాతాలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు తమ కార్యకలాపాలు, నిర్వహణ విషయంలో కాలుష్యాలను తగ్గించడానికి నాలుగు రకాలైన డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు/మెషిన్ లెర్నింగ్ వంటి నిర్ణయాత్మక సాంకేతికతలు, క్లౌడ్, 6జీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతలను ప్రారంభించడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, ఆటోమేషన్ వంటి సెన్సింగ్, కంట్రోల్ టెక్నాలజీలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. నివేదికలోని మరికొన్ని అంశాలు.. - డిజిటల్ పరిష్కారాలు, కార్బన్–ఇంటెన్సివ్ ప్రక్రియలను మెరుగుపరచడం, భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక శక్తి వినియోగం, నిర్వహణ, వంటి చర్యల ద్వారా ఇంధన రంగంలో ఉద్గారాలను 8 శాతం వరకు తగ్గించవచ్చు. - మెటీరియల్ రంగంలో డిజిటల్ సొల్యూషన్ లు మైనింగ్, అప్‌స్ట్రీమ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీనితోపాటు 2050 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు 7% వరకు తగ్గుతాయి. - సాంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్ ఇంధనం వైపునకు మొబిలిటీ రంగం అడుగులు వేయడం ద్వారా ఉద్గారాలను 5 శాతం వరకు తగ్గించవచ్చు. ఈ దిశలో సంబంధిత మౌలిక రంగం పురోగతి అవసరం. - వాయు ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి ప్రేరణకు డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే కంపెనీలు ఈ విషయంలో మిగిలిన కంపెనీలు, సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. - పర్యావరణ పరిరక్షణకు డిజిటల్ సాంకేతికత కంపెనీలకు ఒక మంచి సాధనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డిజిటల్ ఎకానమీ ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ అన్నారు. వ్యాపార పక్రియ, వ్యాలూ చైన్‌లో పారదర్శకత, సామర్థ్యం పెంపులో సాంకేతికత ప్రాధాన్యంత కీలకమని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికత పురోగతితో పారిశ్రామిక రంగాలు తగిన ప్రయోజనాలు పొందడం ప్రస్తుతం కీలకమని ఆయన సూచించారు. చదవండి: డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది: సీఎం జగన్ -
భారత్‌ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
సద్గురు ‘సేవ్ సాయిల్’ అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం ప్రశంసనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణలో సారవంతమైన భూములను కాపాడుకోవడంతోపాటు పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ సాయిల్’ పేరుతో సద్గురు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు దావోస్‌లో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులను కలిశారు. తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్‌తో కలిసి దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సద్గురు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతోందని, త్వరలోనే ఈ సమస్య వల్ల ఆహారకొరత ఏర్పడే ప్రమాదముందని సద్గురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నం అయిన హరితహారం కార్యక్రమం గురించి కేటీఆర్ వివరించారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు తమసంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
ఎమర్జింగ్ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా సైన్సెస్ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ (కొత్త, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ) వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ‘ప్రజా బాహుళ్యంలోకి కృత్రిమ మేథస్సు (ఏఐ).. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై మంగళవారం జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని బట్టి వ్యక్తుల గుర్తింపు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంలో ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. డేటా భద్రత, దాని వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు, అనుమతి లేకుండా నిఘా కార్యకలాపాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించబోమనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి నియంత్రణ అధికారాలు ఉండాలనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశిస్తేనే ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి..’అని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సులభమవుతుంది. దీనిద్వారా నేరాల నియంత్రణ, సమర్థ పోలీసింగ్ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి. ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా సేకరించే డేటా, ఇతర ఫలితాలను ప్రజలతో పంచుకున్నపుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది..’అని మంత్రి వ్యాఖ్యానించారు. చర్చాగోష్టిలో నిప్పన్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకయుకి మోరిట, ఉషాహిది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈడీ ఎంజీ నికోల్, ఎడ్జ్టెక్ సీఈఓ కోయెన్వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు. అలాగే దావోస్ వేదికగా డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. డిజిటల్ హెల్త్, డిజిటల్ ఎడ్యుకేషన్, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. నోవార్టిస్ విస్తరణ ప్రణాళికలు ‘అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు పరిశోధన కేంద్రాలను కలిగిన నోవార్టిస్ హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతి ఫార్మా కంపెనీల్లో నోవార్టిస్ సామర్థ్యం అతిపెద్దది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నోవార్టిస్ కార్యాలయం 9వేల మంది ఉద్యోగులతో రెండో అతిపెద్ద కార్యాలయంగా మారింది. హైదరాబాద్‌లోని ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైంది.’అని నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోదరుడు వైఎస్ జగన్‌తో భేటీ అద్భుతం డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేటీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌తో దిగిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘నా సోదరుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగింది..’అని మంత్రి ట్వీట్ చేశారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ఐటీ, లైఫ్‌సైన్సెస్ రంగంపై ఆదిత్య ఠాక్రే ఆసక్తి చూపగా, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేపట్టిన హరితహారం, పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం గురించి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు ఆదిత్య థాకరే తెలిపారు. ఏపీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి, ఎన్ఈసీ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నొరిహికో ఇషిగురో, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతి మిట్టల్, హెచ్‌సీఎల్ ఎండీ విజయ్ గుంటూరు, భారత్ ఫోర్జ్ డిప్యూటీ ఎండీ అమిత్ కళ్యాణిలు కేటీఆర్‌ను కలిశారు. ఆశీర్వాద్ రూ.500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని ఆశీర్వాద్ పైప్స్ (ఎలియాక్సిస్) నిర్ణయించింది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా స్టోరేజి, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తామని కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ వెల్లడించారు. ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కే పరిమితం చేయకుం డా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. -
‘ఆశ్చర్యపోకండి.. మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్’!
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతుంది. తెలంగాణ తరఫున రాష్ట్ర మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యదక్షతలో కేటీఆర్ చూపిస్తున చొరవ, ఆయనకున్న విజన్‌ను కొనియాడుతూ ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన మోత్వాని... రాబోయే ఇరవై ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ తరహాలో ఆలోచనల్లో స్పష్టత, దాన్ని అర్థమయ్యేలా విడమరిచి చెప్పగలిగే కళ ఉన్న యువ రాజకీయ నేతలను నేను ఇప్పటి వరకు చూడలేదన్నారు. దావోస్‌లో తెలంగాణ టీమ్ దుమ్ము రేపుతోంది. వాళ్లను చూస్తుంటే ఈ రోజు బిలియన్ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. 20 years from now, don’t be surprised if KTR becomes PM of India. I have never seen a young politician with such clarity of vision and expression. Telangana team is on fire in Davos. They remind me of a silicon valley start up - will likely go back w $billions in future deals. pic.twitter.com/ae1rT8jXwy — Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) May 23, 2022 ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది కేటీఆర్ పనితీరును ఆయన విజన్‌ను మెచ్చుకుంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. మోత్వాని ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. ఆశా జడేజా విషయానికి వస్తే ఆమె 2000లో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకు పైగా టెక్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆమె చేపడుతున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం.. -
WEF: పర్యాటక రంగాన్ని వీడని పరేషాన్
దావోస్‌లో జరుగుతున్న వలర్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ కుదురుతున్న వివిధ వ్యాపార ఒప్పందాలతో పాటు పలు కీలక అంశాలపై వెలువడుతున్న నివేదికలపై ఆసక్తి నెలకొంది. కాగా పర్యాటక రంగంపై విడుదలైన వివేదిక మరోసారి ధనవంత దేశాలకే పట్టం కట్టింది. 117 దేశాలకు సంబంధించిన సమాచారంతో ఈ ఇండెక్స్ తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో క్రమంగా టూరిజం ఊపందుకుంటోంది. అయితే ఇప్పటికీ కోవిడ్ ముందు పరిస్థితికి ఇంకా చేరుకోలేదు. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉండగా ధనిక దేశాల్లో మాత్రం త్వరగా పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. తాజా టూరిజం ఇండెక్స్ ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ట్రావెల్, టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్‌లో నంబర్ వన్ స్థానంలో జపాన్ నిలిచింది. మిగిలిన తొమ్మిది స్థానాలు ఏషియా, యూరప్, అమెరికా ఖండాల్లో ధనవంతదేశాలకే దక్కాయి. టాప్ టెన్‌లో స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, యూకే మొత్తం ఆరు దేశాలు స్థానం దక్కించుకున్నాయి. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఏషియా నుంచి జపాన్ తర్వాత సింగపూర్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వస్తే కోవిడ్ ముందు పరిస్థితితో పోల్చితే భారత్‌లో టూరిజం రికవరీ ఆశించినంత వేగంగా లేదు. తాజా ఇండెక్స్‌లో 4.5 పాయింట్లు సాధించి ఇండియా 54వ స్థానంలో నిలిచింది. కోవిడ్ ముందుతో పోల్చితే 8 స్థానాలు కిందికి పడిపోయింది. ఏషియా స్థాయిలో జపాన్, సింగపూర్లు ఆధిక్యం చూపితే.. దక్షిణాసియాలో ఇండియానే నంబర్ వన్ స్థానంలో ఉంది. చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ -
బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం జగన్ భేటీ
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెంటర్లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు. చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పుతిన్‌తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్స్కీ
Willing To Meet Vladimir Putin: దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ...ఈ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం చాల కష్టతరంగా మారింది. ఉక్రెయిన్ సైనిక సామార్ధ్యాన్ని దిగజార్చేలా పౌరులనే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు నిర్వహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. ఇంతవరకు రష్యా ఫెడరేషన్ అధికారులు, ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఎందుకంటే అంతా చేయిస్తోంది పుతినే కాబట్టి అతను లేకుండా ఈ యుద్ధాన్ని ముగించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. అంతేకాదు రష్యా దళాల జరిపిన యుద్ధ నేరాలు గురించి చర్చలు జరిపేందుకు రష్యా విముఖత చూపించిందే తప్ప అవకాశం ఇవ్వలేదు. అందువల్ల రష్యా అధ్యక్షుడితో తప్ప ఇక ఏ రష్య అధికారితో సమవేశం అవ్వం" అని తేల్చి చెప్పారు. అంతేకాదు దౌత్యం లేకుండా ఈ యుద్ధాన్ని ఆపడం అసాధ్యం అని జెలెన్ స్కీ చెప్పారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా మంది పౌరులను కోల్పోయి భారీ మానవ మూల్యాన్ని చెల్లించిందని కూడా చెప్పారు. మరోవైపు ఖార్కివ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలు బలపడుతున్నాయి కానీ డాన్‌బాస్‌లో సైన్యం అత్యంత రక్తపాతాన్ని ఎదుర్కొవడమేకాక చాలామందిన్ని కోల్పోతోందని ఆవేదనగా చెప్పారు జెలెన్స్కీ. (చదవండి: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్‌కు సాయం) -
నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్‌తో కేటీఆర్
హైదరాబాద్: విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k — KTR (@KTRTRS) May 23, 2022 -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
తెలంగాణలో రూ.500 కోట్లతో లులూ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే ఒక ఉత్పత్తి యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్ కంపెనీ ‘కిమో ఫార్మా’రూ.100 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీ ‘స్విస్ రే’నగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు తొలిరోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మరోచోట యూనిట్: లులూ అధినేత దావోస్‌లో కేటీఆర్.. లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో సమావేశమై చర్చలు జరిపారు. రూ.500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు యూసుఫ్ ముందుకు రాగా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల పత్రాలను మంత్రి అక్కడికక్కడే అందజేశారు. రాష్ట్రంలో మరోచోట సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని యూసుఫ్ తెలిపారు. తమ యూనిట్లకు త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండనుందన్నారు. తెలంగాణలో భారీ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించనున్నామని, హైదరాబాద్‌లో పలు స్థలాలను కూడా ఎంపిక చేశామని, యజమానులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో షాపింగ్ మాల్ నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయోత్పత్తులు, అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఇది సాకారం కానుందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 250 మందితో ‘స్విస్ రే’ కార్యాలయం రాష్ట్రంలో నైపుణ్యం గల మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ‘స్విస్ రే’గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, దశల వారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని వెరోనికా తెలిపారు. సంస్థ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై తమ హైదరాబాద్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. ఇన్నోవేషన్, ఇతర సహకారం కోసం టీ–హబ్‌తో భాగస్వామ్యానికి సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కిమో ఏపీఐ యూనిట్ కిమో ఫార్మా 2018లో నగరంలో క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా రూ.100 కోట్లతో తమ రెండో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని కిమో గ్రూప్ డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) ఉత్పత్తి యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీషో’ ఈ–కామర్స్ భారీ పెట్టుబడి: కేటీఆర్ ట్వీట్ ఈ–కామర్స్ పరిశ్రమ ‘మీషో’ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిటైల్ సేల్స్‌పై దృష్టి పెట్టనుందని కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్‌లో వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని తెలిపారు. -
లైఫ్‌సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌సైన్సెస్ (జీవశాస్త్ర) రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేందుకు భారత్‌లో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అన్నా రు. భారత్‌లో ఈ రంగం పురోగతికి అవసరమైన విధానాలకు అంతగా మద్దతు లభించడం లేదని చెప్పారు. అదే సమయంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించి.. ‘తెలంగాణ: ఆసియాలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక స్థానం’అనే అంశంపై సోమవారం జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలి తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని మంత్రి విమర్శించారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ (ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఔషధాల ఆవిష్కరణ) వైపు పయనిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. సులభతర విధానాలు అవసరం భారత్‌లో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతర విధానాలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. వచ్చే దశాబ్దం పాటు భారత్ లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశముందని, ఔషధ తయారీ సంస్థలు ప్రస్తుతమున్న మందుల తయారీకే పరిమితం కాకుండా, కొత్త మందులను తయారు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నైపుణ్యానికి కొదవలేదని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ పాల్గొన్నారు. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
తెలంగాణకు వస్తోన్న మరో ఈ కామర్స్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. మీషో ఫౌండర్ ఆత్రేయతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు మీషో ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో ఫెసిలిటీ సెంటర్‌తో పాటు టైర్ టూ సిటీస్‌లో ఆన్‌బోర్డ్ రిటైల్ సెల్లర్స్‌గా వ్యవహరించనుంది. టైర్ 2 సిటీస్‌లో ఉన్న ఐటీ హబ్స్, టీశాట్ సెంటర్లను ఈ మేరకు మీషో ఉపయోగించుకుంటుంది. Second major announcement from Davos! @Meesho_Official, the fast growing eCommerce company agreed to set up their facility in Hyderabad. Meesho will be working with the Govt. of Telangana in onboarding the retail sellers in Tier-II towns. pic.twitter.com/E1ciuXlbX9 — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 23, 2022 చదవండి: దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి -
దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లండన్ నుంచి జ్యూరీచ్ మీదుగా దావోస్‌కి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఇండియన్ స్టార్టప్ కల్చర్‌కి బూస్ట్ తెచ్చిన యంగ్ అచీవర్స్‌ను పర్సనల్‌గా కలుసుకున్నారు. ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ బ్రోకింగ్ ఏజెన్సీ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్, మీషో ఫౌండర్ విదిత్‌ఆత్రేలను కలుసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్విస్‌రే ముఖ ఇన్సురెన్సు సంస్థ స్విస్‌రే తెలంగాణలో మరిన్ని రంగాల్లో విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది ఆగస్టులో స్విస్ రే సంస్థ సుమారు 250 మంది సిబ్బందితో హైదరాబాద్‌లో ఇన్సురెన్సు సేవలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉన్న బీఎస్ఎఫ్ఐ ఎకోసిస్టమ్ ప్రోత్సహాకరంగా ఉండటంతో ఇక్కడే డిజిటల్, డేటా, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ 80 దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1 — KTR (@KTRTRS) May 23, 2022 చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ -
లండన్ నుంచి దావోస్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం లండన్ నుంచి దావోస్ బయల్దేరారు. నాలుగు రోజుల పాటు లండన్‌లోని పలు ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం కేటీఆర్ లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి జ్యూరిక్ వెళ్లారు. అక్కడ ఆయనకు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. ప్రపంచం లోని వివిధ ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 26న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. -
తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా సీఎం జగన్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు. దీనిలో భాగంగా విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియాల తయారీపై చర్చలు జరిపారు. 1. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సెంటర్లో ఆయనతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయన్న ప్రొఫెసర్ క్లాజ్.. ధాన్యాగారంగా పేరొందిన ఏపీని ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహర కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్ ష్వాప్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశంపై చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు. సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతీ ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని తెలిపారు. 2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైన ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతీ 2వేల జనాభాకు వైఎస్సార్ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ, తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు. 3. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. 4. డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశితంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌స్టోరేజీ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని సీఎం వివరించారు. విండ్, సోలార్, హైడల్.. ఈమూడింటిని కూడా సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని సీఎం వివరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. 5. తదుపరి సీఎం జగన్... బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ ప్రశంసించారు. నైపుణ్యమానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 6. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. 7. తర్వాత సీఎం జగన్.. అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఛలో దావోస్.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అండ్ కో
భారత దేశానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో భారీ బృందం స్విట్జర్లాండ్ బయల్దేరింది. దావోస్ నగరంలో 2022 మే 23 నుంచి 25 వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఈ బృందం పాల్గొననుంది. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత జరగున్న జీ 20 దేశాల సదస్సును దృష్టిలో ఉంచుకుని దేశానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టీమ్ పని చేయనుంది. దావోస్‌కి వెళ్లిన భారత బృందంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మన్సుఖ్లాల్ మండావియా, హర్దీప్సింగ్ పూరీలతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌కు చేరుకున్నారు. కాగా తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సులో మంత్రులు, ముఖ్యమంత్రులు సీనియర్ అధికారులతో పాటు ఇండస్ట్రీస్ తరఫున హరి ఎస్ భారతీయ, అమిత్ కళ్యాణి, రాజన్ భారతీ మిట్టల్, రోనీ స్క్రూవాలా, సలిల్ ఎస్ పరేఖ్లు సైతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగం కానున్నారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న సానుకూల అంశాలు, ఎకో సిస్టమ్, ఇక్కడి పాలసీలను వివరించనున్నారు. చదవండి: దావోస్ చేరుకున్న సీఎం జగన్ -
దావోస్ చేరుకున్న సీఎం జగన్
గన్నవరం/ సాక్షి, అమరావతి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ దావోస్ వెళ్లారు. కాగా, ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. -
ఏపీలో అవకాశాలపై విశ్వ వేదికన చర్చ
సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్ 4.0) దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సు వేదికగా చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆ సదస్సులో పారిశ్రామికవేత్తలు, ఆర్థిక వేత్తలకు వివరించనున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల 2020, 2021లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులు ప్రత్యక్షంగా నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు, అధికారుల బృందంతో కలిసి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ నుంచి బయలుదేరి, రాత్రికి దావోస్‌కు చేరుకోనున్నారు. కరోనా మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఈ వేదిక ద్వారా ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. కోవిడ్ నియంత్రణ నుంచి సుపరిపాలన దాకా.. కరోనా మహమ్మారి నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్ వేదికపై సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ద్వారా కరోనా కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను తెలియజెప్పనుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు, çసమగ్ర సామాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ – సుపరిపాలన, భవిష్యత్ తరాల కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించనుంది. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం దృష్టి సారించనుంది. కాలుష్యం లేని వ్యవస్థే లక్ష్యం కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం ప్రధానంగా వివరించనుంది. పారిశ్రామికీకరణలో భాగంగా నాలుగో విప్లవం దిశగా ప్రపంచం కదులుతున్న నేపథ్యంలో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాలుష్య రహిత విధానాలతో ఉత్పత్తులు సాధించడం, అందుకు తగిన విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. పెట్టుబడులకు స్వర్గధామం ఇండిస్ట్రియలైజేషన్ 4.0కు సరైన వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలను కూడా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం వివరించనుంది. పారిశ్రామికీకరణ దిశగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణం వంటి వాటి ద్వారా ఇండస్ట్రియలైజేషన్ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో విశదీకరిస్తారు. బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగుళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచుతారు. పరిశ్రమల కోసం సుశిక్షితులైన మానవ వనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న తీరును కూడా వివరిస్తారు. పీపుల్ – ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్ పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దావోస్ వేదికగా రాష్ట్రం చర్చించనుంది. నేరుగా ఇంటి గుమ్మం వద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, దాన్ని డిజిటలైజేషన్‌తో అనుసంధానించడం.. రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారు చేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలకు సంబంధించి అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై దృష్టి పెట్టనుంది. ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ‘పీపుల్ – ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్’ నినాదంతో ఏపీ పెవిలియన్ నిర్వహిస్తోంది. కీలక అంశాల్లో భాగస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్ సదస్సు పలు కీలక అంశాలపై దృష్టి పెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. -
యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్: కేటీఆర్
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారు. దీంతో తనకు లభించిన ఘన స్వాగతాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ప్రవాస తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. Thank you to the affectionate NRIs of Telangana in UK for their overwhelming welcome 😊 Special thanks to @Anil_trs Garu who has been spearheading NRI TRS in UK for over a decade & @ASHOKDUSARI Garu NRI TRS UK president who gave me a ride in his car with special number plate 😄 pic.twitter.com/N8uxk6h21B — KTR (@KTRTRS) May 18, 2022 చదవండి: దావోస్ సదస్సుకు కేటీఆర్ -
లండన్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించడం లక్ష్యంగా దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక వేదిక) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ అధికారుల బృందం వెళ్లింది. బుధవారం ఉదయం లండన్‌కు కేటీఆర్ చేరుకోనున్నారు. 4 రోజులు అక్కడే ఉంటారు. ఈ నెల 18 నుంచి 21 వరకు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్, తెలంగాణ ప్రభు త్వం భాగస్వామ్యంతో జరిగే వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల దిగ్గజ సంస్థలతో భేటీ అవుతారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ ఆ తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ కంపెనీల సీఈవోలు, యాజమాన్యాలతో భేటీ అవుతారు. సీఈవో స్థాయి సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రాజెక్టులు, వర్క్ షాప్‌ల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 35 మంది ప్రముఖులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సమావేశాలు ఉంటాయని ఆయన వెంట వెళ్లిన అధికారులు తెలిపారు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు దావోస్ సదస్సులో పాల్గొనను న్నారు. సదస్సు తర్వాత ఈ నెల 27న కేటీఆర్ రాష్ట్రానికి చేరుకుంటారు. -
దావోస్ సదస్సుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్ ఈ నెల 17న బయల్దేరి వెళ్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఈ నెల 27న తిరిగి హైదరాబాద్‌కు కేటీఆర్ చేరుకుంటారు. ఈ ఏడాది జనవరిలోనే సదస్సు జరగాల్సి ఉన్నా కోవిడ్ మూలంగా వాయిదా పడింది. -
సీఎం వైఎస్ జగన్‌కు ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
-
దావోస్‌లో బ్రాండ్ ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా చాటిచెప్పేలా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు లాంటి నవరత్న పథకాలతో గడప వద్దకే పరిపాలన చేరువ చేయటాన్ని దావోస్ సదస్సు వేదికగా తెలియచేసేలా ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్‌లో జరిగే పర్యటన వివరాలను గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు తెలియచేశారు. జనవరిలో జరగాల్సినా.. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్‌లో మెంబర్ అసోసియేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్‌ఫాం పార్టనర్‌గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా డబ్ల్యూఈఎఫ్‌కు చెందిన సీఈవో స్థాయి చర్చలు, ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభించనుంది. సాంకేతిక ఆవిష్కరణల పునాదులపై పారదర్శకత, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు సీఎం జగన్ నిబద్ధతతో కృషిచేస్తున్నారని సమావేశాలకు ఆహ్వానించేందుకు వచ్చిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్జ్ బెండే ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ సమావేశాలు జనవరిలోనే జరగాల్సినా కోవిడ్ థర్డ్‌వేవ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలతో సారూప్యం కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ‘కలసి పని చేయడం – నమ్మకాన్ని పునరుద్ధరించడం’ అనే లక్ష్యంతో దావోస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇవి దగ్గరగా ఉన్నట్లు మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను ప్రచారం చేసేలా సమావేశాల కోసం రూపొందించిన లోగోను మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఆవిష్కరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చాటే విధంగా రూపొందించిన బుక్‌లెట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన నవరత్నాలు, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, సుపరిపాలన లాంటి 9 అంశాలకు బుక్‌లెట్‌లో ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 10 రంగాలపై ఫోకస్ దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్ఎంసీసీ లాంటి పదిరంగాల్లో అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు. సీఐఐ నేతృత్వంలో 23న వైద్యరంగం, 24న విద్య, నైపుణ్యరంగం, డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా అడుగులులాంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది పెట్టుబడుల సమావేశం కాదని, కోవిడ్‌తో మారిన వాణిజ్య పరిణామాలపై చర్చించి వ్యాపార అవకాశాలు, సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు డబ్ల్యూఈఎఫ్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు. -
డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు వైఎస్ జగన్!
న్యూఢిల్లీ/దావోస్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌వార్షిక సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
DAVOS 2022: దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్‌లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
భారత్ నుంచి రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్ ఆఫ్ ద వరల్డ్)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్‌లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. నవ భారత్ రికార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉందని, ఒక్క డిసెంబర్లోనే భారత్‌లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. -
దావోస్ సదస్సుపై ఒమిక్రాన్ నీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సోమవారం తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు,పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారు. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ భయాలతో 2022 సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈఓలుసహా దాదాపు 100కిపైగా భారత్ నుంచి 2022 సదస్సులో పాల్గొనడానికి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. -
ఒమిక్రాన్ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. ఈ కొత్త వేరియంట్ కారణంగా బ్రిటన్, యూరప్ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో దావోస్‌లో జరగాల్సిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం వాయిదా పడింది. ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఫోరమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 17-21 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరగాల్సిన వార్షిక సమావేశం వేసవి ప్రారంభంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు కఠినమైన ఆరోగ్య ప్రోటోకాల్స్ ఉన్నప్పటికీ, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండడంతో సమావేశాలను వాయిదా వేసినట్లు డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ మాట్లాడుతూ...కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సమిష్టిగా పోరాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12)య వాయిదా పడిన విషయం తెలిసిందే. చదవండి: 4 Day Work Week: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తే..! -
దావోస్‌కు రండి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి రావాలంటూ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుకు మరోమారు ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్‌లో జరగనున్న ఈ సమావేశానికి హాజరుకావాలని ఫోరం కోరింది. కోవిడ్–19 సంక్షోభం తర్వాత వినూత్న టెక్నాలజీ, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి తన అనుభవాలను పంచుకోవాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె కేటీఆర్‌ను కోరారు. అధునాతన సాంకేతికతను సామాన్యుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైనా తన అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడం కోసం రాజకీయ, వ్యాపారరంగాలతోపాటు పౌర సమాజం కలిసి పనిచేయాల్సి ఉంది. ఆ దిశలో అందరం కృషి చేద్దాం’అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. ప్రగతికి దక్కిన గుర్తింపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వా నం తెలంగాణ వినూత్న విధానాలకు, ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేదికగా తెలంగాణను మరోమారు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రానికి రావాలని కోరతానని వెల్లడించారు. తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు. -
డబ్ల్యూఈఎఫ్ సదస్సు రద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 2021లో నిర్వహించాల్సిన తమ వార్షిక సదస్సును రద్దు చేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. తదుపరి సదస్సు 2022 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని డబ్ల్యూఈఎఫ్‌జీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తెలిపారు. ఈ సదస్సు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. రెండు సార్లు వేదిక మారింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగాల్సింది. కానీ పలు కారణాలతో స్విట్జర్లాండ్‌లోనే ఉన్న లూసెర్న్ నగరానికి వేదికను మార్చారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో నిర్వహించేలా సింగపూర్‌కి వేదిక మారింది. ఏటా దావోస్‌లో జరిగే ఈ సదస్సును 2002లో న్యూయార్క్ సిటీలో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సివచ్చింది. -
దావోస్‌లో మోదీపై బిలియనీర్ సొరోస్ ఫైర్..
దావోస్ : ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సొరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్‌లో హిందూ రాజ్యాన్ని స్ధాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనా సొరోస్ విమర్శలు గుప్పించారు. ప్రపంచమంతా తన చుట్టూ తిరగాలని ట్రంప్ కోరుకుంటారని, అధ్యక్షుడు కావాలనే తన కోరిక నెరవేరడంతో అధ్యక్షుడికి రాజ్యాంగం నిర్ధేశించిన పరిమితులను అతిక్రమించారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన చేష్టలతో అభిశంసనను ఎదుర్కొన్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం దేశ ప్రయోజనాలను విస్మరించేందుకూ ట్రంప్ వెనుకాడరని, తిరిగి ఎన్నికయ్యేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. చదవండి : తదుపరి ప్రధానిగా మళ్లీ మోదీకే మొగ్గు.. -
‘అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే’
దావోస్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా డబ్ల్యూటీవోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశం పట్ల డబ్ల్యూటీవో న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. చైనా, భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమెరికాను మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని సరిగ్గా ట్రీట్ చేయని డబ్ల్యూటీవో తీరుపై తాను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నానని, చైనా..భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న ఈ సంస్థ తమను ఎందుకు అలా చూడటం లేదని ప్రశ్నించారు. దావోస్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో అమెరికా సైతం అభివృద్ధి చెందుతున్న దేశమేనని, తమను ఇలా చూడకుండా, భారత్..చైనాలనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూడటంతో ఆ దేశాలు భారీ ప్రయోజనాలను దక్కించుకుంటున్నాయని రుసరుసలాడారు. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలైతే తమదీ అభివృద్ధి చెందుతున్న దేశమని గుర్తించాలని అన్నారు. డబ్ల్యూటీవో ఈ దిశగా నూతన విధానం చేపట్టకపోతే..తాము ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు డబ్ల్యూటీవో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చదవండి : కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా -
కృత్రిమ మేధపై కలసికట్టుగా..
దావోస్ (స్విట్జర్లాండ్): స్వేచ్ఛతో కూడిన ఉచిత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణపై ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో భాగంగా సుందర్ పిచాయ్ ప్రసంగించారు. గోప్యత అన్నది ఖరీదైన వస్తువేమీ కాదంటూ ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ అందరికీ అవసరం. డేటా సార్వభౌమత్వం ప్రతీ దేశానికి ముఖ్యమైనది. కనుక ప్రపంచంలో ఏ దేశంలో అయినా డేటా పరిరక్షణకు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్నెట్ నిజానికి ఒక ఎగుమతి వస్తువు. యూట్యూబ్‌లో ఒక భారతీయ పౌరుడు ఒక వీడియోను పోస్ట్ చేస్తే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సౌందర్యం ఇదే’’ అని పిచాయ్ చెప్పారు. ఆధునిక ప్రపంచంలో ఏఐ అద్భుత పాత్రను పోషిస్తుందన్నారు. ఏఐ రిస్క్‌ల గురించి అవగాహన ఉందని, ఇది బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ‘‘సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని ఎన్నో పనులను క్వాంటమ్ కంప్యూటర్లు చేయగలవు. వీటి సాయంతో ప్రకృతి మెరుగ్గా మారేలా ప్రేరేపించొచ్చు. వాతావరణం, ప్రకృతి మార్పుల గురించి మెరుగ్గా అంచనా వేయొచ్చు. టెక్నాలజీలో క్వాంటమ్ భవిష్యత్తులో పెద్ద ఆయుధంగా మారుతుంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కలయిక అద్భుతంగా ఉంటుంది’’ అని పిచాయ్ చెప్పారు. ఏఐపై ఒక కం పెనీ లేక ఒక దేశమో పనిచేయడం కాకుండా కలసికట్టుగా పనిచేసే అంతర్జాతీయ విధానం అవసరమని సూచించారు. గూగుల్ శక్తి పెరిగితే ప్రమాదకరమా..? ఈ ప్రశ్నను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్‌ష్వాబ్ సంధించారు. దీనికి పిచాయ్ స్పందిస్తూ.. ‘‘ఇతరులు కూడా మాతో సమానంగా మంచి పనితీరు చూపించినప్పుడే మేము సైతం మంచిగా పనిచేయగలం. సరైన పరిశీలన అనంతరమే మా స్థాయి విషయంలో ముందడుగు ఉంటుంది. మా వెంచర్ల ద్వారా ఏటా వందలాది స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం’’ అని తెలిపారు. ప్రజల జీవితాలను టెక్నాలజీతో ఏవిధంగా మెరుగుపరచొచ్చన్న దానిపై గూగుల్ పనిచేస్తుందని భవిష్యత్తు ప్రణాళికలపై బదులిచ్చారు. సదస్సులో ఇతర అంశాలు.. ► డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. ► ప్రపంచ ఆర్థిక వేదిక పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ► కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో దావోస్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు. -
‘పిరమాల్’ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ పిరమాల్ రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కేటీఆర్‌తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ సమావేశమైన అనంతరం ఆ సంస్థ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తమ కంపెనీలో 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రూ.500 కోట్ల పెట్టుబడి ద్వారా మరో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఔషదాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన స్థల పరిశీలన కోసం వచ్చే నెలలో రాష్ట్రంలో తమ కంపెనీ ప్రతినిధి బృందం పర్యటించనుందని పేర్కొంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన పిరమాల్ గ్రూపునకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈఓడీబీ ర్యాంకింగ్స్ మేరకు నిర్ణయం.. ప్రస్తుతం రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణలో భాగంగా కొత్త తయారీ బ్లాకులు ఏర్పాటు చేయడం, వేర్‌హౌస్ విస్తరణ పనులకు రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నట్టు పిరమాల్ గ్రూపు తెలిపింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ ప్లాంట్లను హైదరాబాద్‌కు తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల ప్రభుత్వం, విధానాలతో పాటు సరళీకృ వ్యాపారం (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేసి తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, హెల్త్ కేర్, సురక్షిత తాగునీరు, డిజిటల్ విలేజ్ వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో తమకు అన్ని అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు ఉన్నాయని, జీరో డిశ్చార్జ్ విధానంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని విధంగా తమ పిరమాల్ గ్రూప్ పనిచేస్తుందని పేర్కొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కేటీఆర్ సమావేశం మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీల సీఈవో సుందర్ పిచాయ్‌తో సహా పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో గూగుల్ కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలపై చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని కేటీఆర్ ఆయనకు వివరించారు. ఇప్పటికే పలు ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. రాక్వెల్ అటోమేషన్ సీఈఓ, అధ్యక్షుడు బ్లేక్ డీ మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ వెంకయ్య కేటీఆర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్ భారత్‌కు లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ రాజధానిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కే గోయాంక, కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్, సీఈఓ బిల్ థామస్, ఐడీఓ సాండీ స్పీచర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీటీఓ కల్యాణ్ కుమార్ సైతం మంత్రితో సమావేశమయ్యారు. ప్రత్యేకత చాటుకున్న తెలంగాణ పెవిలియన్ దావోస్‌లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దావోస్ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. భారత్ నుంచి తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. తెలంగాణ పెవిలియన్‌లో ఒక రిసెప్షన్ కేంద్రంతో పాటు, రెండు సమావేశ గదులు, ఒక వెయిటింగ్ గది ఏర్పాటు చేశారు. వర్చువల్ రియాలిటీ లాంజ్‌లో తెలంగాణకు సంబంధించిన వర్చువల్ రియాలిటీ ప్రజెంటేషన్ వీక్షించే అవకాశాన్ని సందర్శకులకు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారం కూడా తెలంగాణ పెవిలియన్‌లో అందుబాటులో ఉంచారు. కేవలం పారిశ్రామిక, పెట్టుబడుల సమాచారమే కాకుండా హైదరాబాద్ నగర చరిత్ర, టూరిజం ప్రత్యేకతలను కూడా పెవిలియన్ గోడలపైన అంటించారు. -
కృత్రిమ మేధస్సుదే కాలం
సాక్షి, హైదరాబాద్ : ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రభావానికి లోనుకాకుండా ఏ ఒక్క వ్యాపారమూ ఉండదు. ప్రతి వ్యాపార వ్యూహం, విధాన రూపకల్పనలో ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఐటీ, నాన్ ఐటీ సంస్థలైనా ఏఐను అనుసరించాల్సిందే. మా కార్యక్రమాలన్నింటిలో ఏఐను అంతర్భాగం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 2020ను ఏఐకు అంకితం చేసింది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంగళవారం అక్కడ ఏఐ పరిజ్ఞానంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ఏఐ సమూలంగా మార్చబోతోందని, ముందుగా ఈ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారు ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో 40 శాతాన్ని ఏఐ జత చేయబోతోందని చెప్పారు. ప్రపంచంలోని 25 ఏఐ పరిశోధనల కేంద్రాల్లో హైదరాబాద్‌ను ఒకటిగా తీర్చదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. పౌర సేవలకు గుర్తింపు ధ్రువీకరణ, నిత్యావసర వస్తువుల పంపిణీ, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తు సంస్థల అవసరాలు, జీ2సీ చాట్‌బోట్స్, క్రోడ్ కౌంటింగ్ వంటి అవసరాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఏఐ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. పౌరులకు రవాణా సమయం తగ్గించేందుకు ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఏఐ పరిజ్ఞానం ఆధారంగా రూపొందించిన ట్రాఫిక్ నిర్వహణ ప్రయోగాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. కేంద్రం సైతం ఏఐ ఆధారిత కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఈ చర్చలో సింగపూర్ ఐటీ మంత్రి ఐ.ఈశ్వరన్, యునిసెఫ్ ఈడీ హెన్రిట్ట హెచ్.ఫోర్ పాల్గొన్నారు. భారత్‌లో అద్భుత అవకాశాలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 20–40 ఏళ్ల వయసున్న యువ జనాభా భారత్‌కు అదనపు బలమన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లిన ఆయన మంగళవారం అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘ఇండియా–ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నొవేషన్ నేషన్’అనే అంశంపై సీఎఫ్బీసీ–18, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ఈ చర్చలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశోధన రంగాన్ని ప్రోత్సహిస్తున్న తీరును వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ టాప్–5 కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. నివాస సౌలభ్యం పరంగా హైదరాబాద్ అత్యుత్తమమైన నగరమని మెర్సర్ సంస్థ గత ఐదేళ్లుగా గుర్తిస్తూ వస్తోందన్నారు. ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్‌ని జేఎల్ఎల్ గుర్తించిందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే.. పరిశోధన, సమ్మిళిత అభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి అనే మూడు మంత్రాలను అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ చర్చ అనంతరం కేటీఆర్ దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలిశారు. రోషే చైర్మన్ క్రిస్టోఫర్ ప్రాన్జ్‌తో సమావేశమై హైదరాబాద్ ఫార్మా హబ్‌గా ఉందని తెలిపారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైస్ పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. హెచ్‌పీ సీఈవో విశాల్ లాల్, అపోలో టైర్స్ ఉపాధ్యక్షుడు, ఎండీ నీరజ్ కన్వర్, కాల్లŠస్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ ప్లెమింగ్ బెసెన్ బాచర్, పీఅండ్‌జీ దక్షిణాసియా సీఈవో, ఎండీ మాగేశ్వరన్ సురంజన్ తోనూ మంత్రి సమావేశమయ్యారు. -
ఆ 63 మంది కుబేరుల ముందు... బడ్జెట్ దిగదుడుపు!
దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు.. ► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. ► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. ► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు. ► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ. ► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది. సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం... ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. -
రేపటి నుంచి దావోస్ సదస్సు
దావోస్: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీరో ఎమిషన్స్ లక్ష్యానికి కట్టుబడాలి... 2050 లేదా అంతకుముందుగానే కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్ ఎమిషన్స్) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. -
దావోస్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదివారం ఉదయం నగరం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. -
రేపు దావోస్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఫోరం నుంచి కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 2018లో తొలిసారిగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినా హాజరు కాలేకపోయారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా నిర్వహించే పలు చర్చల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు. తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేయనున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్ పత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం.. కేటీఆర్‌తో పాటు దావోస్‌కు వెళ్తున్నారు. సదస్సు ముగిసిన అనంతరం 24న కేటీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. కాగా, కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. ఆయన దావోస్‌కు బయలుదేరి వెళ్లితే సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈసారి ‘దావోస్’కు భారీ సన్నాహాలు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్ స్టార్స్ పాల్గోనున్నారు. ప్రపంచ దేశాలు సమష్టిగా, నిలకడగా వృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసారి దావోస్ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. గతేడాది జరిగిన సదస్సులో వీరిద్దరూ పాల్గొనలేదు. ఈసారి సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది దిగ్గజ నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. భారత్ నుంచి పేర్లు నమోదైన వారిలో పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదాని, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ తదితరులు ఉన్నారు. మానసిక స్వస్థతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా ఇందులో పాల్గోనున్నారు. ఆర్థికంగా ఉన్నతవర్గాలు తమకు ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, మరోవైపు గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాలు నెరవేరడం లేదని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ క్లాస్ ష్వాబ్ పేర్కొన్నారు. ఆ స్విస్ ఖాతాల్లో నిధులు స్విట్జర్లాండ్ ఖజానాకు.. క్లెయిమ్ చేసుకోవడానికి చాన్నాళ్లుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో భారతీయులకు చెందిన సుమారు పది ఖాతాల్లోని సొమ్ము.. స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఖజానాకు దఖలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మనీని కట్టడి చేసే క్రమంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాల వివరాలను 2015 నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. అవసరమైన ఆధారాలను సమర్పించి ఖాతాలను పునరుద్ధరించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తోంది. వీటిలో భారతీయులకు చెందిన ఖాతాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్నింటికి క్లెయిమ్ గడువు ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుంది. లీలా తాలూక్దార్, చంద్రలతా ప్రాణ్‌లాల్ పటేల్, మోహన్‌లాల్ మొదలైన వారి పేర్లతో ఈ ఖాతాలు ఉన్నాయి. -
దావోస్‌లో ఏపీ లాంజ్ ఖర్చు రూ.17 కోట్లు
సాక్షి, అమరావతి: ‘‘నా ప్రతిభను ప్రపంచ దేశాలు గుర్తించాయి. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రినీ పిలవని విధంగా కేవలం నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలకు పిలుస్తారు’’... ఇవీ చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, డబ్ల్యూఈఎఫ్ సదస్సులకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ పిలవలేదని, ఆయనే రూ.కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని వెళ్లినట్లు సాక్ష్యాలతో సహా బయటపడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ద్వారా దావోస్‌లో రూ.కోట్లు పెట్టి లాంజ్‌లను కొనుగోలు చేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి సీఐఐ సమర్పించిన బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దావోస్‌లో లాంజ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత మొత్తం చెల్లించాలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు(ఏపీఈడీబీ) రాసిన లేఖలో సీఐఐ వివరంగా పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించమని కోరింది. రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లాంజ్ల్లో సీఐఐ ద్వారా సమావేశాలు నిర్వహించి, తనను చూసి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేసుకునేవారు. 2019 జనవరిలో జరిగిన దావోస్ సమావేశాలకు అయిన ఖర్చు రూ.14.41 కోట్లు చెల్లించాలంటూ సీఐఐ బిల్లు సమర్పించింది. దీనిపై 18 శాతం జీఎస్టీ, ఇతర సుంకాలను కలిపితే ఈ మొత్తం రూ.17 కోట్లు దాటుతోంది. ఇందులో కేవలం ఏపీ లాంజ్ అద్దె రూ.2.48 కోట్లు. ఆ లాంజ్‌ను కంప్యూటర్లు, సోఫాలతో అందంగా తీర్చిదిద్దినందుకు రూ.2.51కోట్లు, నాలుగు రోజుల భోజనాలకు రూ.1.05 కోట్లు బిల్లు వేసింది. విచిత్రం ఏమిటంటే ఎల్ఈడీ తెరకు ఏకంగా రూ.1.45 కోట్ల బిల్లు వేశారు. 2018 సమావేశాలకు కూడా సీఐఐ రూ.9.86 కోట్ల బిల్లును సమర్పించింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. ప్రత్యేక విమానాలు,బస ఖర్చులు అదనం ఇవి కేవలం దావోస్‌లో లాంజ్ ఏర్పాటు, అక్కడి సమావేశాలకు అయిన ఖర్చు మాత్రమే. ఇది కాకుండా చంద్రబాబు తన మందీ మార్బలంతో వెళ్లిన ప్రత్యేక విమానాలు, బస వంటి ఖర్చులు కలుపుకుంటే ఈ వ్యయం రెండింతలవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు ఏటా క్రమం తప్పకుండా దావోస్ సమావేశాలకు హాజరై, రూ.వేల కోట్ల పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. సీఐఐ దావోస్ బిల్లు కాపీ -
‘ఇ - చెత్త’ నిజంగా బంగారమే.. కానీ
ఏటా కాలం తీరిన ఎలక్ట్రానిక్ పరికరాలను వందల టన్నుల్లో పడేస్తున్నాం. ఫలితంగా ఇ-వ్యర్థాలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఇలా నిరుపయోగంగా మారిన ఇ-వేస్ట్‌తో సంవత్సరానికి దాదాపు 4,500 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చట. అంతేనా ఇలా పోగుపడిన ఇ - వేస్ట్ బరువు ఏకంగా 1,25,000 బోయింగ్ 747 జంబో జెట్ల బరువుకు సమానమట. ఇవేవో గాలి కబుర్లు కావు. స్వయంగా దావోస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఈ నివేదికను వెల్లడించారు. అవును మరి ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు.. ఇవే కాక బయట మరో సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇవి లేకపోతే మనకు నిమిషం కూడా గడవని పరిస్థితి. ఉపయోగాలు లేవని కాదు.. అతి వాడకం. వెరసి రోజురోజుకు పెరిగిపోతున్న ఇ-వ్యర్థాలు. వీటిని పునరుపయోగించడం చాలా కష్టమైనదే కాక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇన్నాళ్లు గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందితే.. ఇప్పుడు ఇ-వ్యర్థాలు మరింత భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న వ్యర్థాల్లో ఇ-వేస్ట్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. కానీ పర్యావరణానికి కలిగించే హానిలో వీటి వాటా మాత్రం ఏకంగా 70 శాతం అంటే ఇ-వేస్ట్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు. పెరిగిపోతున్న ఇ-వేస్ట్‌ను తగ్గించేందుకు తీసుకునే చర్యలే కాక.. సులభంగా రీసైకిల్ చేసి రీయూజ్ చేసే మార్గాల గురించి పరిశోధనలు పెంచాలని నిర్ణయించారు. ఆ వివరాలు.. సాంకేతికతో పాటే పెరుగుతున్న వ్యర్థాలు.. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్ది.. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా పెరుగుతుంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.46 బిలియన్ల స్మార్ట్ఫోన్లు ఉంటే.. 2020నాటికి స్మార్ట్ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2.87 బిలియన్లకు చేరనుందట. ఇంతమందికి మొబైల్ ఫోన్ సౌకర్యాలు కల్పించాలంటే సెల్ టవర్ల సంఖ్య కూడా పెంచాలి. అంటే నెట్వర్కింగ్ పరికరాలను కూడా పెంచాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో ఇ-వేస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి ఎలక్ట్రాననిక్ పరికరం ఏదో ఒక రోజు నిరుపయోగంగా మారుతుంది. ఫలితం ప్రస్తుతం ఉన్న చెత్తను తగ్గించకపోగా.. మరికొంత పెంచుతున్నట్లే కదా. చెత్త ‘బంగార’మే.. చెత్త బంగారం ఏంటి అనుకోకండి. ఇ-వ్యర్థాలు నిజంగా బంగారు కొండలే. మనం వాడే స్మార్ట్ఫోన్ల తయారీలో చాలా తక్కువ మొత్తంలో బంగారం వాడతారనే విషయం తెలిసిందే. 100 టన్నుల బంగారు ధాతులో లభించే బంగారం కంటే.. 100 టన్నుల స్మార్ట్ఫోన్లలో లభించే బంగారం ఎక్కువ అంటే నమ్మగలరా?.. కానీ నమ్మక తప్పదు. వీటిలో బంగారం మాత్రమే కాక వెండి, రాగి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగా సేకరించే వీలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు 4,35,000 టన్నుల మొబైల్ ఫోన్లను చెత్త కుప్పలో పడేస్తున్నాం. రీసైకిల్‌తో మంచి ఆదాయం.. ఇ-వ్యర్థాలు నుంచి విలువైన లోహాలను వేరు చేయడం ఇప్పటికే పెద్ద బిజినెస్‌గా మారింది. ప్రతి ఏడాది ఇ వేస్ట్‌ను రీసైకిల్ చేయడం ద్వారా 62.5 బిలియన్ల సంపద లభిస్తుంది. ఈ మొత్తం కొన్ని దేశాల జీడీపీకి సమానం. అయితే ఇ వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేయడం అంత తెలికైన పనేం కాదు. ఇందుకు ఎంతో ఖర్చుతో పాటు శ్రమ కూడా అవసరం. ఎందుకంటే వీటిల్లో బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు పాదరసం, లెడ్, కాడ్మియం వంటి హానికారక పదర్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి రీసైకిలింగ్ అనేది సరైన పద్దతిలో.. సరైన సౌకర్యాల మధ్య జరగకపోతే.. పర్యావరణానికే కాక మనుషులకు కూడా హాని కల్గించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఎటువంటి అనుమతుల్లేకుండా ఈ ఇ-వేస్ట్‌ను ఎగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాక చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్నారు. కేవలం నైజిరియాలోనే దాదాపు లక్ష మంది ఈ ప్రమాదకర ఇ-వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్లలో పని చేస్తున్నారు. అంటే వీరందరి బతకడం కోసం ప్రమాదంతో సావాసం చేస్తున్నారు. రీసైకిలింగ్లో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఇ-వ్యర్థాలను మండించడం వల్ల చాలా విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. ఫలితంగా పర్యావరణమే కాక అక్కడ ఉన్న కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివారణ మార్గాలు.. ఇ-వ్యర్థాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యలను తగ్గించాలంటే ఒకటే మార్గం. సరైన రీతిలో వీటిని రీసైకిల్ చేయడం. ఇ-వేస్ట్‌ను తగ్గించాలంటే ముందుగా ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని సమూలంగా మార్చాలి. త్వరగా పాడయ్యే పరికరాల కన్నా ఎక్కువ కాలం మన్నే వస్తువులను తయారు చేయ్యాలి. అంతేకాక ఒక్కసారి వాటి లైఫ్ టైమ్ పూర్తయ్యాక వాటిని సులువుగా, భద్రంగా రీసైకిల్ చేసే విధంగా డిజైన్ చేయాలి. తయారిదారుడు, అమ్మకందారుడు ఇద్దరు ఈ ఇ వ్యర్థాలను తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. అందుకే బై బ్యాక్ స్కీమ్‌లను తీసుకురావాలి. అస్సెట్ - ఓనర్షిప్ వ్యవస్థ నుంచి సర్వీస్ - సబ్‌స్ర్కిప్షన్ వ్యవస్థకు మార్చాలి. అంతేకాక పరికరాలను ఒక నిర్దిష్ట కాలానికి లీజ్కిచ్చే విధానాలను తీసుకురావాలి. వీటినే మళ్లీ రీసైకిల్ చేసి తిరిగి వాడుకునేందుకు వీలుగా మార్చాలి. -
ప్రియాంక ఎంట్రీతో బీజేపీకి షాక్ : కమల్ నాథ్
దావోస్ : యూపీ (తూర్పు) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం బీజేపీకి చావుదెబ్బ వంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. అత్యధిక లోక్‌సభ సీట్లున్న యూపీలో ప్రియాంక ఆగమనం ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. ప్రియాంక నేతృత్వంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు కైవసం చేసుకుంటుందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమైనందునే ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కృత్రిమ మేథతో సమూల మార్పులు
దావోస్ : కృత్రిమ మేథ (ఏఐ)తో మానవ జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనుప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామన్నారు. మెరుగైన డేటా ఇవ్వగలగడం, వైద్యులకు నివేదికలు, చిత్రాలు పంపడం, విద్యలో వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించడం వంటి ఎన్నో ఊహించని మార్పులు ఏఐతో అనుభవంలోకి వస్తాయన్నారు. కృత్రిమ మేథను పౌరుల జీవితం మెరుగయ్యేందుకు శాస్త్రీయ కోణంలో అమలు చేయాలని సూచించారు. అందరి ప్రయోజనం కోసం ఏఐని వాడుకోవడంపై దృష్టిసారించాలని, దీనిపై మితిమీరిన ఆంక్షలు వినూత్న ఆవిష్కరణలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. -
హెచ్చార్డీ మంత్రిగా వారుంటేనే మంచిది : ఆర్బీఐ మాజీ గవర్నర్
దావోస్ : భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మనం యువతరాలను మాత్రమే నిర్మించగలుగున్నాం. కానీ, ప్రపంచంతో పోటీ పడేవిధంగా వారిని తయారు చేయలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌కు అతి ముఖ్యమైన ‘మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశాన్ని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. మానవ వనరుల అభివృధ్ది శాఖ (హెచ్చార్డీ)కు అత్యంత సమర్థులు మంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు. నాణ్యమైన విద్యతోనే భారత యువత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) లో పాల్గొనేందుకు వచ్చిన రాజన్ ఓ జాతీయ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోవచ్చు. మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం కంటే మెరుగైన స్థానంలో నిలవొచ్చునని, దేశాల మధ్య ఇలాంటి పోటీ మంచిదే’ అని రాజన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
కొత్త ఉపద్రవం
జీవన కాలమ్ బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్యమాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. దావోస్‌లో జరుగుతున్న సర్వదేశ సమ్మేళనంలో సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ కొద్దికాలంలో మానవుడు 140 సంవత్సరాలు జీవించబోతున్నాడని సోదాహరణంగా వక్కాణించారు. ఇది మానవాళి మీద పెద్ద గొడ్డలిపెట్టు. మా చిన్నతనంలో ఏదైనా అనర్థం జరిగినప్పుడు మా నాయనమ్మ అంటూండేది: ‘ఈ ఘోరాలు చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను. నన్ను త్వరగా తీసుకుపో దేవుడా!’ అని. ఇది తేలికగా 70 సంవత్సరాల కిందటిమాట. ఇప్పటి మనుషులు 140 ఏళ్లు బతకబోతున్నారు. రోజుకి లక్షల గాలన్ల చమురును తవ్వుకుంటున్న నేపథ్యంలో భూమిలో చమురు నిల్వలు మరో 22 సంవత్సరాలలో పూర్తిగా నిండుకుంటున్నాయి. మనం ఇప్పుడే తాగే మంచినీళ్లని కొనుక్కుంటున్నాం. అచిరకాలంలో పీల్చే గాలిని కొనుక్కోవలసిన రోజులు వస్తాయని ఒక శాస్త్ర జ్ఞుడు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఇప్పటిలాగ విరివిగా వాడుకోడానికి నీరు దొరకదు. స్నానానికి బదులు రసాయనాలతో ఒళ్లు శుభ్రం చేసుకునే ప్రత్యా మ్నాయ ధోరణులు వస్తాయన్నారు. ధృవాలలో మంచు కరిగిపోతోంది. ఈ సీజనులోనే ఒక హరియాణా రాష్ట్ర మంత మంచు శకలం కరిగి సముద్రంలోకి దూసుకు వచ్చిందట. ఇది ఒక పార్శ్వం. ఈ మధ్య అమెరికాలో ఉద్యోగం చెయ్యని పిల్లలు లేని కుటుంబాలు లేవు. లక్షల ఆస్తి ఉన్న, పోస్టు మాస్ట ర్గా రిటైరయి పెన్షన్ తీసుకుంటున్న ఒకాయన తమ కూతురు అమెరికాలో 40 ఏళ్లుగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోతూంటే– ఆయన వృద్ధాశ్రమంలో కాలం చేశారు. ఒక దశలో సంపాదనకి విలువ పోయి, జీవితం యాంత్రికమై, తమ పిల్లలు– బంధువులకీ, భాషకీ, భారతీయ జీవన విధానానికీ దూరమై బతుకు తూంటే– నిస్సహాయంగా ఆత్మవంచన చేసుకుంటు న్నారు. ఇది మరొక పార్శ్వం. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులనే ఖాతరు చేయ కుండా–ఓ సినీమాలో లేని అభ్యంతరాలని, లేవని నిరూపించినా–మారణ హోమాన్ని సృష్టించే గూండాలు, వారి అకృత్యాలకు భయపడి.. సుప్రీంకోర్టు అదిలించినా చేష్టలుడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు, పరీక్షలు వాయిదా కోసం హత్య అవసరమని భావించే హింసాత్మకమైన ‘ఆలోచన’లకి పసితనంలోనే పునాదులు పడుతున్న విష సంస్కృతి, చదువుకోలేదని గదమాయించిన టీచర్ని కాల్చి చంపిన విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ దశ లోనూ కోట్లు నొల్లుకునే ‘నీచపు’ ఆఫీసర్ల ఉద్యోగుల వీర విహారం– ఇది మరొక పార్శ్వం. సరే. 140 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ప్రతీ పౌరుడికీ కనీసం రెండు హత్యలు–సజావయిన కారణాలకు చేసుకునే రాయితీని ప్రభుత్వం కలిగిం చవచ్చు. లల్లూ వంటి మహా నాయకుల ఆరో తరం మునిమనుమడు–ప్రతీ మనిషీ తన జీవితంలో 570 టన్నుల గడ్డి తినే అనుమతిని కల్పించవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా మోసుకుతిరిగే ఆక్సిజన్ సిలిండర్ల దొంగ తనం చేసి అమ్ముకునే వ్యాపారాలు దావూద్ ఇబ్రహీం ఏడో తరం వారసుడు ప్రారంభించవచ్చు. ఏ భక్తుడైనా తన జీవితకాలంలో తనకు నచ్చిన మూడు క్షేత్రాలలో క్షుద్ర పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు–సాలీనా కనీసం 120 కోట్లు భక్షించవచ్చునని అనుమతిని ఇవ్వవచ్చు. తన ఆరో తరం ముని మనుమడు చదువుతో హింసి స్తున్న బడిపంతుల్ని క్లాసులో బాంబు పెట్టాలనుకుంటు న్నట్టు 120 ఏళ్ల ముత్తాతకి తెలిస్తే–రెండు హత్యలకు రాయితీ ఉన్న ఈ మనుమడు–తాతని పొడిచి చంపవచ్చు. గూండాలు నాయకులవొచ్చు. హంతకులు ప్రవచనాలు చెప్పవచ్చు. సెక్స్ కథలు పాఠ్య పుస్తకాలలోనే చోటు చేసు కోవచ్చు. సాయంకాలం పార్కుల్లో కనిపించే ముసిలి గుంపుల లక్ష్యం ‘ఆరోగ్యం’ కాదు– ఇంట్లో వారి చాద స్తాన్ని భరించలేని పిల్లలు, కోడళ్లూ కనీసం ఆ రెండు గంటలు విశ్రాంతికి వాళ్లకి కార్లిచ్చి తగలెయ్యడం. మరి 80, 100, 120, 130 సంవత్సరాల ముసిలి వొగ్గుల మాటే మిటి? వృద్ధాశ్రమాలు మాత్రమే కాక, ముసిలివారి ‘చాదస్త’ విముక్తి ఆశ్రయాలు కల్పిస్తారేమో! ఇర్విన్ షా అనే ఆయన ‘బరీ ది డెడ్’ (Bury the Dead) అనే నాటిక రాశాడు. చచ్చిపోయినవాళ్లు చచ్చి నట్టు సమాధుల్లో ఉండక లేచి నిలబడ్డారు. ఎంత పెద్ద విపత్తు? ఎవరి బంధువులు వారి దగ్గరికి వచ్చి ‘చచ్చి నవారు చచ్చినట్టు’ ఉండటం ఎంత అవసరమో నచ్చ చెప్తారు. ఈ ఇబ్బంది ఇప్పుడు బతికున్నవారికి రాబో తోంది. బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్య మాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభు త్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. ఇందులో మళ్లీ దొంగదారిన అనుమతులు తెచ్చుకుని బతికేస్తున్నవారూ, లంచాలిచ్చి బతికేసేవారు... ‘అయ్యో దేవుడా! నన్ను ఎప్పుడు తీసుకు పోతావు!’ అని మా నాయనమ్మలాగా ప్రాధేయపడే రోజులు ముందున్నాయి. - గొల్లపూడి మారుతీరావు -
చంద్రబాబుకు మానసిక స్థితి లోపించిందా?
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘ సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు దావోస్ వెళ్లివచ్చి...ప్రతి ఒక్కరూ సూర్య ఆరాధన చేయాలని కొత్తగా చెప్పడం హాస్యాస్పదం. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మానసిక స్థితి లోపించిందా?. లేక మైండ్ దావోస్‌లో ఏమైనా వదిలి వచ్చారా అనే అనుమానం కలుగుతోంది. దావోస్ మోజులో పడి గణతంత్ర వేడుకలకు కూడా హాజరు కాలేదు. ఈ దేశంలో గణతంత్ర వేడుకలకు హాజరు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?. దావోస్ పర్యటన సందర్భంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు. లోకేశ్ దావోస్ నుంచి అమెరికా ఎందుకు వెళ్లాడు?. దావోస్‌లో వచ్చిన సూట్‌కేసులు దాచుకోడానికా?. తల్లికి వందనం అని చెబుతున్న చంద్రబాబు...మరి తల్లిదండ్రులు లాంటి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతికి చేసిన ద్రోహం అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మానసికంగా హింసించి చంపిన వైనం చరిత్రలో ఎవరూ మరచిపోరు. జలహారతి అంటున్న చంద్రబాబు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 22మందిని, పర్మిట్లు లేని బోట్లను తప్పి ఇబ్రహీంపట్నంలో మరో 20మందిని పొట్టన పెట్టుకున్నావు. ఇక చంద్రబాబు వ్యవసాయమే దండగ అంటే మంత్రి దేవినేని ఉమ మరో అడుగు ముందుకు వేసి వరి పండించే రైతుల్ని సోమరిపోతులంటున్నారు. దేవినేని చినప్పటి నుంచి ఏంతిని పెరిగాడు. రైతులను ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.’ అని హెచ్చరించారు. -
'నాకు 15 మంది దోస్తులయ్యారు.. డిన్నర్ చేశాం'
దావోస్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కొత్తగా 15 మంది స్నేహితులు అయ్యారు. ఆ విషయాన్ని ట్రంప్ స్వయంగా చెప్పారు. వారితో కలిసి డిన్నర్ కూడా చేసినట్లు వెల్లడించారు. వారిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారున్నట్లు తెలిసింది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ట్రంప్ 20 నిమిషాలపాటు ప్రసంగించిన తర్వాత స్వల్ప కాలంపాటు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెప్పారు. దావోస్‌లో కొత్తగా ఎవరితో పరిచయాలు అయ్యాయని ట్రంప్‌ను ప్రశ్నించగా పదిహేను మంది అని చెప్పారు. 'నేను గురువారం మధ్యాహ్నం దావోస్‌కు వచ్చాను. అదే రోజు రాత్రి 15 మంది కొత్త మిత్రులతో భోజనం చేశాను. నాకు తెలిసిన వారు అందులో ఒక్కరు కూడా లేరు. కానీ, వీరందరి గురించి మాత్రం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాను. నాకు ఇక్కడ 15మంది మిత్రులు దొరికేలా చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి, దాని వ్యవస్థాపకులైన మీకు నా ధన్యవాదాలు' అని ట్రంప్ చెప్పారు. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌కు త్వరలో రానున్న సీఈవో వ్యాస్ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి, డెలాయిట్ సీఈవో పునిత్ రేంజెన్తోపాటు, బేయర్, సైమెన్స్, ఏపీ వోల్వో, శ్యాప్, అడిదాస్, స్టాటోయిల్, నెస్ట్లే, ఏబీబీ, హెచ్ఎస్బీసీవంటి సంస్థల సీఈవోలతో ట్రంప్ భేటీ అయినట్లు తెలిసింది. -
కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చ!
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు. -
‘అమెరికా ఫస్ట్’ అంటే..!
దావోస్: ‘అమెరికా ఫస్ట్(తొలుత అమెరికా)’ అనే తన నినాదాన్ని ‘అమెరికా మాత్రమే’ అనే అర్థంలో చూడకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా సాధించిన అభివృద్ధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. అయితే, తన తొలి ప్రాధాన్యత అమెరికానేనని పునరుద్ఘాటించారు. ‘అమెరికా ఫస్ట్ అంటే అమెరికా మాత్రమే అని కాదు. అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచమూ వృద్ధి చెందుతుంది’ అని అన్నారు. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన దావోస్‌లో కీలక ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై అమెరికా పోరు కొనసాగిస్తుందని, అఫ్గానిస్తాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారనివ్వబోమన్నారు. పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాం.. ఏడాది కాలంగా తాను తీసుకున్న నిర్ణయాల్ని ట్రంప్ ప్రస్తావించారు. ‘వరుసగా స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి ఇంతవరకూ అదనంగా 7 ట్రిలియన్ డాలర్లు మార్కెట్లలోకి వచ్చి చేరాయి. స్వేచ్ఛా వాణిజ్యానికి అమెరికా మరోసారి సిద్ధమని చెప్పేందుకు నేనిక్కడి వచ్చా. అమెరికాలో వ్యాపారానికి, ఉద్యోగాలకు, పెట్టుబడులకు ఇదే మంచి సమయం. నేనెప్పుడూ అమెరికా ఫస్ట్ విధానాన్ని నమ్ముతాను. ప్రపంచ నేతలు కూడా వారి దేశం విషయంలో అలాగే భావించాలి. అధ్యక్షుడిగా దేశం, ఉద్యోగులు, కంపెనీల ప్రయోజనాల్ని ఎల్లప్పుడూ పరిరక్షించాల్సి ఉందన్నారు. ఏదైనా ఒక దేశం నిబంధనల్ని ఉల్లంఘిస్తే స్వేచ్ఛా వాణిజ్య విధానం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మీడియా రూపం అప్పుడు తెలిసింది ఉగ్రవాదం విషయంలో అమెరికా పౌరుల్ని, సరిహద్దుల్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలకు వెనకాడమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘దుర్మార్గపు పాలన, ఉగ్రవాదం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మిత్రదేశాలు తమ భద్రతను పటిష్టం చేసుకోవాలి’ అని సూచించారు. అమెరికాలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సందర్భంలో రెండు పాత చట్టాల్ని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ‘అమెరికాలోని మధ్య తరగతి ప్రజల కోసం భారీగా పన్నులు తగ్గించాం. కార్పొరేట్ వర్గాలకు కూడా ఊరట కల్పించాం. పన్ను తగ్గింపుతో ఒక కుటుంబ వార్షిక ఆదాయం 4 వేల డాలర్లు పెరుగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. విద్యుత్ స్వయం సమృద్ధి, ఇంధన భద్రత కోసం ఇంధన ఉత్పత్తిపై విధించిన కట్టుబాట్లను ఎత్తివేస్తున్నామని అన్నారు. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడూ మీడియా ఎప్పుడూ తనను ప్రేమించేదని, అయితే మీడియా ఎంత మోసపూరితమో రాజకీయాల్లోకి వచ్చాక, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే తెలుసుకోగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో బిల్ క్లింటన్ అనంతరం దావోస్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. సెనెట్‌లో హెచ్–1బీ వీసాల పెంపు బిల్లు వాషింగ్టన్: ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించేలా హెచ్–1బీ వీసా వార్షిక కేటాయింపుల్ని పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికన్ సెనెట్‌లో ఇద్దరు రిపబ్లికన్లు సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. ‘ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని, హెచ్1–బీ వీసాదారులు ఉద్యోగాలు మారేందుకు సమయం కేటాయించాలని ప్రతిపాదించారు. వీసాల వార్షిక పరిమితిని 85 వేలకు పెంచాలని, అవసరమైతే 1.95 లక్షలకు పెంచాలని సూచించారు. కాగా, నిపుణులైన ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు వీసా లాటరీ విధానానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా పథకంలో ఏడాదికి 50 వేల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తున్నారు. ఈ విధానం అమెరికా భవిష్యత్తుకు లాభదాయకం కాదని ట్రంప్ వాదిస్తున్నారు.


