దావోస్.. అంతా తుస్ | Chandrababu Davos Visit Concludes Without Investment Gains | Sakshi
Sakshi News home page

దావోస్.. అంతా తుస్

Jan 23 2025 2:22 PM | Updated on Jan 23 2025 6:03 PM

Chandrababu Davos Visit Concludes Without Investment Gains

సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ  ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్‌ పర్యటన పరిమితమైంది.

అదే సమయంలో తన దావోస్‌ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్‌. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు.

పెట్టుబడులు తేకుండానే ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement