కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు! | French President Macron Viral Davos Shades Give iVision Tech Rs 38 Crore Stock Boost | Sakshi
Sakshi News home page

కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!

Jan 23 2026 2:45 PM | Updated on Jan 23 2026 3:00 PM

French President Macron Viral Davos Shades Give iVision Tech Rs 38 Crore Stock Boost

దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్‌గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.

మాక్రాన్ ఉపయోగించిన సన్‌గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.

మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్‌లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.

ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.

ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement