ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్‌కీ గత వారం ప్రకటించారు.
పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్‌కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.
విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు ఇలా..
భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.
ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్!


