పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే! | Today Gold And Silver Prices March 8th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!

Mar 8 2026 11:54 AM | Updated on Mar 8 2026 1:47 PM

Gold prices drop in 7 days in India check latest rates

పసిడి ప్రియులకు గడిచిన వారమంతా ఆనందమే కలిగింది. దేశంలో బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ధరలు పడిపోవడంతో పసిడి కొనే వారికి  భారీ ఊరట లభించింది. గత వారంలో, అంటే మార్చి 2 నుంచి మార్చి 8 వరకు దాదాపు వారమంతా పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి, దీంతో స్థానికంగా కూడా ధరలు పడిపోయాయి.

ధరలు దిగొచ్చాయిలా..
హైదరాబాద్‌, విశాఖ పట్నం సహా తెలుగు రాష్ట్రాలలో గత వారం బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. మార్చి 2న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,70,510  ఉండగా మార్చి 8 నాటికి రూ.1,63,640 లకు దిగొచ్చింది.  అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మార్చి 2న రూ. 1,56,300  ఉండగా మార్చి 8 నాటికి రూ.1,50,000 లకు క్షీణించింది.

అంటే వారం మొత్తంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,300 తగ్గుదలను నమోదు చేసింది.  

ఈ వారంలో ధరలు రోజుకు రోజూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో భారీ తగ్గుదల నమోదైంది. తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నా మొత్తంగా వారం అంతా క్షీణతే కనిపించింది. మార్చి 8న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు
అంతర్జాతీయంగా బంగారం ధరలు మార్చి ప్రారంభంలో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి (ఔన్స్‌కు సుమారు 5,400 డాలర్ల పైన). కానీ తర్వాత అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, మిడిల్ ఈస్ట్ ఘర్షణల నేపథ్యంలో ఇన్‌ఫ్లేషన్ భయాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాల మార్పు వల్ల సేఫ్-హెవెన్ డిమాండ్ తగ్గింది. ఇది బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చింది. అలాగే, కొన్ని రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్, స్పెక్యులేటివ్ సెల్లింగ్ కూడా జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement