ఇరుకు ఇళ్లకు ఇకమతు! ఇలాంటి గోడలు | Flexible Walls for Compact Homes House construction tips | Sakshi
Sakshi News home page

ఇరుకు ఇళ్లకు ఇకమతు! ఇలాంటి గోడలు

Mar 8 2026 8:11 AM | Updated on Mar 8 2026 8:17 AM

Flexible Walls for Compact Homes House construction tips

వినియోగదారుడికి నచ్చిన విధంగా ఇంట్లో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగిన విధంగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. ఇటుకలు, సిమెంట్‌ బ్లాక్స్‌ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుండటంతో వాటి స్థానంలో ప్యానల్స్‌ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందంతో పాటు పటిష్టంగా ఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.  

స్క్రూలతో బిగింపు.. 
ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ప్రస్తుతం కదిలేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్‌ పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్‌లో కలిసిపోయి అందంగా ఉంటాయి కాబట్టి ఎవరూ ఇవి గోడలని గుర్తించలేరు.

నిర్మాణ వ్యయం ఎక్కువ  
స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తరహా గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయంలో బెడ్‌ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్‌ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్‌ ప్యానెల్స్‌ రూ.75–రూ.80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement