Meesho: తెలంగాణకు వస్తోన్న మరో ఈ కామర్స్‌ కంపెనీ

Second major announcement from Davos for Telangana - Sakshi

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్‌ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ నగరంలో ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించారు.

మీషో ఫౌండర్‌ ఆత్రేయతో మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు మీషో ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో ఫెసిలిటీ సెంటర్‌తో పాటు టైర్‌ టూ సిటీస్‌లో ఆన్‌బోర్డ్‌ రిటైల్‌ సెల్లర్స్‌గా వ్యవహరించనుంది. టైర్‌ 2 సిటీస్‌లో ఉన్న ఐటీ హబ్స్‌, టీశాట్‌ సెంటర్లను ఈ మేరకు మీషో ఉపయోగించుకుంటుంది. 

చదవండి: దావోస్‌లో యంగ్‌ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్‌ మాటామంతి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top