
ఏపీలో రేషన్ లబ్ధిదారులకు కష్టాలు కొనసాగుతు న్నాయి. ఒకటో తేదీ వచ్చిందంటే సరకుల కోసం రేషన్ దుకాణాల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇంటి వద్దకే రేషన్ విధానానికి మంగళం పాడి.. షాపు వద్దకు రావాల్సిందే అంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వృద్ధులు, దివ్యాంగులు, రోజువారీ కూలీలకు శరాఘాతంగా మారింది.

గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ అందిస్తుంటే ఇబ్బంది తెలిసేది కాదని, ఇప్పుడు రేషన్ షాపు వద్దే సరకులు తీసుకోవాలనడంతో కూలి పనులు మానుకుని రావాల్సి వస్తోందని రేషన్ కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు.

పలు చౌక డిపోల వద్ద మంగళవారం ప్రజల అవస్థల దృశ్యాలివి























